twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కంటతడి పెట్టుకొన్న జాఫర్.. అందర్నీ ఏడిపించిన సావిత్రి

    |

    మాస్ సినిమాలోని టైటిల్ సాంగ్‌తో నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. స్టెపులతో అదరగొడుతూ చలాకీగా వేదికపైకి ప్రవేశించాడు. పాటను ముగించి మాటలతో అల్లరి చేశాడు. వేదిక వద్ద ఉన్న ఆడియెన్స్ విష్ చేసి కార్యక్రమంలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మన టీవీలో శనివారం ఇంటి సభ్యులు యాక్టివిటీని చూశాడు. ఇంటి సభ్యుల మధ్య ఉన్న అన్యోన్యతను నాగ్ ప్రశంసలతో ముంచెత్తాడు. శనివారం రాత్రి షోలో ఏం జరిగిందంటే..

    కన్నీళ్లు పెట్టుకొన్న జాఫర్

    కన్నీళ్లు పెట్టుకొన్న జాఫర్

    జర్నలిస్టు జాఫర్‌కు ఇంటిపై బెంగ పెట్టుకొన్నది. తన కుటుంబ సభ్యులపై మనసు మళ్లడంతో విషాదంలోకి మునిగిపోయాడు. బెడ్‌పైన దుప్పట్లోకి దూకి కంటతటి పెట్టుకొన్నారు. దాంతో ఇంటి సభ్యుల్లో శ్రీముఖి, శివజ్యోతి జాఫర్‌ను ఓదార్చారు. ఆ తర్వాత బాధ నుంచి తేరుకొని మాములుగా మారిపోయాడు. బాబా భాస్కర్ చొరవ తీసుకొని డ్యాన్స్ నేర్పించాడు. దాంతో జాఫర్ రిలాక్స్ అయ్యాడు.

    ప్రేమ కథతో కంటతడి పెట్టించిన సావిత్రి

    ప్రేమ కథతో కంటతడి పెట్టించిన సావిత్రి

    శ్రీముఖి, అషు రెడ్డి, ఇతర ఇంటి సభ్యులకు సావిత్రి (శివజ్యోతి) తన ప్రేమకథను చెప్పింది. తమ ప్రేమను కుటుంబ సభ్యులు వ్యతిరేకించడం వల్ల ఎంత ఇబ్బంది పడ్డామనే విషయాన్ని చెప్పారు. అమ్మ, నాన్న మాట్లాడలేదు. అన్నయ్య హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ.. మాట్లాడటానికి రాలేదు. 3 వేల జీతంతో నా భర్త నన్ను బాగా చూసుకొన్నాడు. చదువుతూ పనిచేయడం వల్ల డిగ్రీలో అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత నేను రియలైజ్ అయ్యాను. తప్పుకుండా తాను కూడా ఉద్యోగం చేయాలని.. రిసెప్షనిస్టుగా పనిచేశాను. ఆ తర్వాత నా సంపాదన బాగుండటంతో మా ఆయన అన్ని సబ్జెకులు పాస్ అయ్యాడు.

    పిల్లోతో గేమ్ ఆడుతూ

    పిల్లోతో గేమ్ ఆడుతూ

    ఇంటి సభ్యులతో మాట్లాడుతూ నాగ్ ఓ పిల్లో గేమ్‌ను ఆడించాడు. మ్యూజిక్ ప్లే చేసి పిల్లోను ఇంటి సభ్యులు చేతిలో పెట్టాడు. మ్యూజిక్ ఎక్కడ ఆగుతుందో ఆ వ్యక్తితో నాగ్ మాట్లాడాడు. ఆ క్రమంలో తొలుత జాఫర్‌తో మాట్లాడాడు. కంటతడి పెట్టుకోవడానికి కారణం అడిగాడు. ఇంట్లో డ్యాన్స్ చేసిన తీరు, పాట పాడిన క్షణాలను గుర్తు చేస్తూ జాఫర్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు. అంతేకాకుండా స్ట్రాంగ్‌గా కనిపించే జాఫర్ ఎందుకు డీలా పడ్డాడనే విషయాన్ని అడుగగా. తన భార్య గుర్తుకు వచ్చింది అని చెప్పారు.

    కర్రోడా అంటే రవికృష్ణకు క్లాస్ పీకిన

    కర్రోడా అంటే రవికృష్ణకు క్లాస్ పీకిన

    రవికృష్ణ విషయంలోకి వచ్చే సరికి.. నాగ్ క్లాస్ పీకారు. మహేష్ విట్టను కర్రోడు అనడం తప్పుకాదా? అని ప్రశ్నించాడు. మనిషి రంగు భౌగోళిక పరిస్థితులను బట్టి ఆధార పడి ఉంటుంది. రంగు, జాతీ, మతం, ప్రాంతాలకు బిగ్‌బాస్‌లో తావు లేదు. కేవలం బిగ్‌బాస్‌లోనే కాకుండా సమాజంలో ఇలాంటి వాటికి చోటు ఉండకూడదు అని నాగార్జున చెప్పాడు.

    English summary
    Bigg Boss 3 season started with Nagarjuna as host. On day one, Shock for Sreemukhi, Baba Bhaskar. These along with some other celebraties nominated for elimination.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X