Just In
- 7 min ago
టాలీవుడ్ యంగ్ హీరోపై కేసు నమోదు: నమ్మించి మోసం చేశాడంటూ ఫిర్యాదు.. స్పందించకపోవడంతో!
- 10 hrs ago
స్వర్గమంటూ ఉంటే అదే ఇది.. మాల్దీవుల్లో యశ్ రచ్చ.. అందుకే వెళ్లాడా?
- 11 hrs ago
త్రివిక్రమ్-రామ్ సినిమా.. అది అతడినే అడగాలి.. స్రవంతి రవికిశోర్ కామెంట్స్ వైరల్
- 11 hrs ago
‘భూమి’పై కాజల్ వీడియో.. జయం రవి కోసం స్పెషల్ పోస్ట్
Don't Miss!
- Lifestyle
బుధవారం దినఫలాలు : మీన రాశి వారు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు...!
- News
జో బైడెన్ రాకముందే డొనాల్ ట్రంప్ జంప్: కరోనా, నిరుద్యోగితలే అధ్యక్ష భవనానికి దూరం నెట్టాయి
- Finance
Gold prices today : బంగారం ధరల్ని అక్కడే నిలిపిన వ్యాక్సీన్!
- Sports
భారత్ పోరాటం ముందు నిలవలేకపోయాం: ఆసీస్ కెప్టెన్
- Automobiles
కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అవినాష్‌కు ఎలిమినేషన్ కష్టాలు.. Bigg Boss మరో ట్విస్టు.. Eviction free pass ఉన్నా తప్పని టెన్షన్!
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో 12వ వారం అనేక రకాల ట్విస్టులు, ఆసక్తికరమైన కంటెంట్‌తో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నది. ప్రస్తుత వారం ఆరంభంలో జరిగిన నామినేషన్ ప్రక్రియలో బిగ్‌బాస్ రకరకాల షాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. నామినేట్ ప్రక్రియలో భాగంగా అవినాష్‌కు ఎవిక్షన్ ఫ్రీ పాస్ లభించిన విషయం తెలిసిందే. అయితే పాస్ విషయంలో బిగ్‌బాస్ మరో ట్విస్టు ఇవ్వబోతున్నాడంటూ బయటకు వచ్చిన విషయం ఏమిటంటే..

12వ వారం నామినేషన్ ఇలా..
12వ వారంలో కలర్ టోపిలను కంటెస్టెంట్ల తలపై పెట్టి సరికొత్తగా నామినేషన్ ప్రక్రియను బిగ్‌బాస్ మొదలుపెట్టారు. కలర్ టోపి టాస్క్‌లో అడ్డంగా బుక్కై అఖిల్, అభిజిత్, అవినాష్, అరియానా నామినేట్ అయ్యారు. ఆ తర్వాత స్వాపింగ్ ట్విస్టును తెరపైకి తెచ్చి నామినేట్ కాని ఇంటి సభ్యులతో మార్చుకోమని చెప్పిన విషయం తెలిసిందే. ఆ తర్వాత హారికకు సూపర్ ఇవ్వడంతో ఆమె అభిజిత్‌ను మోనాల్‌తో స్వాప్ చేసి నామినేషన్ నుంచి సేవ్ చేసింది.

ఎవిక్షన్ ఫీ పాస్ ఆసక్తికరంగా
ఆ తర్వాత నామినేట్ అయిన సభ్యులకు బిగ్‌బాస్ బంపర్ ఆఫర్ ఇస్తూ మరో ట్విస్టు ఇచ్చాడు. కలర్ జెండాల సేకరణను గేమ్‌గా ఇచ్చి ఎవిక్షన్ ఫీ పాస్ అంశాన్ని సభ్యుల ముందు ఉంచారు. ఈ గేమ్‌లో అఖిల్‌తో పోటీ పడిన అవినాష్ ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను సొంతం చేసుకొన్నాడు.

ఎవిక్షన్ ఫీ పాస్‌కు రెండు వారాల వ్యాలిడిటి
అవినాష్‌కు లభించిన ఎవిక్షన్ ఫ్రీ పాస్ విషయానికి వస్తే.. బిగ్‌బాస్ చెప్పిన ప్రకారం రెండు వారాలపాటు వాలిడిటీ ఉంటుంది. రెండు వారాల్లో ఎప్పుడైనా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది అని బిగ్‌బాస్ పేర్కొన్నారు. అయితే ఇందులో కూడా ఓ ట్విస్టు పెట్టినట్టు తాజాగా వెల్లడైంది. దాంతో అవినాష్‌కు పెద్ద సమస్య వచ్చి పడింది.

అవినాష్ ముందు మరో సమస్య
ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను ఉపయోగించడం ఇప్పుడు అవినాష్ పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టడానికి ముందే హోస్ట్ నాగార్జున, బిగ్‌బాస్‌కు ప్రస్తుత వారంలో పాస్‌ను వాడుకొంటున్నారా? లేదా? అనే విషయాన్ని స్పష్టం చేయాలి. ఒకవేళ ఈ వారం ఉపయోగించుకోకపోతే.. నామినేషన్‌లో ఉన్న అవినాష్ ఎలిమినేట్ అయితే అది పనిచేయదు. ఒకవేళ ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను ఉపయోగించుకొంటే.. ఎలిమినేషన్ నుంచి సేవ్ అయితే ఆ పాస్ వృధాగా మారే అవకాశం ఉంది. ఇలా రెండు రకాల ప్రశ్నలు అవినాష్ ముందున్నాయి.

అవినాష్ నిర్ణయం ఎలా ఉంటుందో
దాంతో 12వ వారం ఎలిమినేషన్‌కు ముందు అవినాష్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉపయోగించుకొంటాడా? లేదా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తాడనే విషయం చర్చనీయాంశమైంది. 12వ వారాంతంలో అవినాష్ ఎలాంటి నిర్ణయం తీసుకొంటాడో వేచి చూడాల్సిందే. ప్రస్తుత వారంలో అవినాష్, అరియానా, అఖిల్, మోనాల్ నామినేట్ అయి ఉన్న సంగతి తెలిసిందే.