For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  బిగ్ బాస్ ఇంట్లో ఏం జరుగుతోంది?.... వాస్తవాలు బయట పెట్టిన యాంకర్ శ్యామల!

  By Bojja Kumar
  |
  Bigg Boss Season 2 Telugu : Syamala Response On Show

  బిగ్ బాస్ తెలుగు సెకండ్ సీజన్లో ఎవరూ ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అవుతారనుకుంటున్న టాప్ కంటెస్టెంట్స్ అనూహ్యంగా ఎలిమినేట్ అయి బటకు వస్తున్నారు. తాజాగా యాంకర్ శ్యామల ఇంటి నుండి బయటకు రావడమే ఇందుకు నిదర్శనం. ఆమె ఎలిమినేట్ అవుతుందని ప్రేక్షకులే కాదు, ఆమె కూడా అసలు ఊహించలేదు. దీంతో చాలా మందిలో బిగ్ బాస్ షో జరుగుతున్న తీరుపై అనుమానాలు రేకెత్తడం మొదలైంది. తాజాగా టీవీ ఛానల్ ఇంటర్వ్యూల్లో బిజీ అయిపోయిన శ్యామల బిగ్ బాస్ హౌస్‌లో ఏం జరుగుతోంది? అనే వాస్తవాలు బయట పెట్టే ప్రయత్నం చేశారు.

  బిగ్ బాస్ రియాల్టీ షోనా? స్క్రిప్టు ప్రకారం జరుగుతోందా?

  బిగ్ బాస్ రియాల్టీ షోనా? స్క్రిప్టు ప్రకారం జరుగుతోందా?

  బిగ్ బాస్ షో స్క్రిప్టు ప్రకారం జరుగుతోందా? లేక రియాల్టీగా జరుగుతోందా? అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. దీనిపై శ్యామల స్పందించారు. స్క్రిప్టు ప్రకారం జరుగుతుందనే ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఇంట్లో ఎవరికి నచ్చినట్లు వారు గేమ్ ఆడతారు? వారి బిహేవియర్ బట్టే ఎలిమినేషన్‌కు నామినేట్ అవ్వడం, ప్రేక్షకుల ఓట్ల ప్రకారమే ఎలిమినేషన్ జరుగుతుందని తెలిపారు.

  బయటకు రావడం బాధగా ఉంది

  బయటకు రావడం బాధగా ఉంది

  ఇంత తొందరగా ఇంటి నుండి బయటకు రావడం బాధగా ఉందని శ్యామల తెలిపారు. ఇంకా కొంతకాలం బిగ్ బాస్ ఇంట్లో ఉండాలనిపించింది. నా గురించి పూర్తిగా ప్రేక్షకులు చూడలేదు. నన్ను నేను నిరూపించుకోవడానికి రైట్ టాస్క్ రాలేదు. ఇంకొన్నాళ్లు ఉంటే రైట్ టాస్క్ వచ్చి ఉండేదేమో? తొందరగా వచ్చాననే ఫీలింగ్ అయితే ఉంది... అని శ్యామల తెలిపారు.

  ఎవరు విన్ అయ్యే అవకాశం ఉంది?

  ఎవరు విన్ అయ్యే అవకాశం ఉంది?

  ఎవరు విన్నర్ అనేది ఊహించడం చాలా కష్టం. వారం వారం సీన్ మారిపోతూ ఉంటుంది. ఈ సీజన్ ఎవరు గెలుస్తారు అనే అంచనాకు వచ్చిన పేర్లలో టాప్ 5లో నేను కూడా ఉన్నాను. కానీ ఇపుడు నేను హౌస్ లో లేను. బిగ్ బాస్ ఇంట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం చాలా కష్టం. మనం ఏమీ ఊహించడానికి కుదరని ఒక సబ్జెక్ట్ బిగ్ బాస్.

  అంతా వారి చేతుల్లోనే...

  అంతా వారి చేతుల్లోనే...

  బిగ్ బాస్ ఇంట్లో ఎవరు ఉండాలి, ఎవరు బయటకు రావాలి అనేది నిర్ణయించేది ప్రేక్షకులే. వారి ఓట్లను బట్టే నామినేషన్స్ జరుగుతున్నాయి. నాకు తక్కువ ఓట్లు రావడం వల్లనే బయటకు రావాల్సి వచ్చింది అని శ్యామల తెలిపారు.

  వారి మధ్య ఎఫైర్ ఉందా?

  వారి మధ్య ఎఫైర్ ఉందా?

  బిగ్ బాస్ స్క్రిప్టు ప్రకారం జరిగేది కాదు, ప్రేక్షకులను ఎంటర్టెన్ చేద్దామనే స్ట్రాటజీ కూడా ఇంటి సభ్యులకు లేదు. ఇంట్లో లవర్స్‌లా ముద్రపడ్డ వారి మధ్య నిజమైన లవ్ ఉందని చెప్పడం కష్టం. మనం చిన్నపుడు స్కూల్లో ఒక అబ్బాయి అమ్మాయి మాట్లాడుకున్నా, క్లోజ్‌గా ఉన్నా వారి మధ్య ఏదో ఉందని అంతా గుసుగుసలు మొదలు పెడతారు. అలాంటిదే బిగ్ బాస్ హౌస్ లో జరుగుతోందని నా అభిప్రాయం... అని శ్యామల తెలిపారు.

  లస్సి గొడవలో తప్పు తేజుదే

  లస్సి గొడవలో తప్పు తేజుదే

  లస్సీ విషయంలో జరిగిన గొడవలో తేజుదే తప్పు. జిమ్ చేసి వచ్చిన తర్వాత ఆ రోజు బాగా ఆకలేసింది. ఈ రోజు తనీష్ కిచెన్ డ్యూటీ కాకున్నా లస్సీచేశాడు. ఎవరైనా లస్సీ తాగుతారా? అని ఆతడే అడిగాడు. నేను తాగుతాను అని చెయ్యెత్తాను. అపుడు తేజు కల్పించుకుని రీసోర్సెస్ తక్కువ ఉన్నపుడు ఇలా ఇష్టం వచ్చినట్లు చేస్తే ఎలా నా మొహం మీదే అనేసింది. ఆమె చెప్పిన పాయింట్ కరెక్టే... చెప్పిన విధానం సరిగా లేదు. అందుకే ఆ గొడవ జరిగింది... అని శ్యామల తెలిపారు.

  అతన్ని మాత్రమే ఏరా, పోరా, వాడు వీడు అంటాను

  అతన్ని మాత్రమే ఏరా, పోరా, వాడు వీడు అంటాను

  నేను ఇంట్లో ఎవరినీ ఏరా పోరా అనను. గణేష్ ఒక్కడినే అంటాను. ఎందుకో అలా కనెక్ట్ అయిపోయింది. అందరికంటే చిన్నోడు. వాడు కూడా అక్క అక్క అంటూ ఉంటాడు. వాడు దీప్తికి బాగా క్లోజ్ విజయవాడ కాబట్టి. తనే నాకు పరిచయం చేసింది. తనకేమైనా కావాలంటే నన్ను, దీప్తినే అడుగుతాడు.... అని శ్యామల తెలిపారు.

  మా ఆయనకు లెటర్ రాశాను

  మా ఆయనకు లెటర్ రాశాను

  ఇంట్లో ఉన్నపుడు మా ఆయనకు లెటర్ రాశాను. ఇంట్లోకి ఏ వస్తువు బయటి నుండి అలోవ్ చేయరు. లవర్స్ టాస్క్ జరిగిన సమయంలో పెన్, పేపర్ దొరకింది. ఆ సమయంలో మనసులో ఏదోలా అనిపించింది. నా భర్తతో ఏదైనా షేర్ చేసుకుంటే బావుండు అనిపించింది. పేపర్ పెన్ను తీసుకుని లెటర్ రాస్తూ కూర్చున్నాను. అది ఆయనకు ఇస్తానో ఇవ్వనో కూడా నాకు తెలియదు. కానీ రాస్తే నా మనసులో ఉన్న బరువు తగ్గుతుందని లెటర్ రాశాను. దాన్ని ఎవరూ చూడకుండా అన్నంతో అతికించి దానిపై రాశాను. ఇది నా పర్సనల్ లెటర్, దీన్ని పడవేయద్దు, ఓపెన్ చేయవద్దు. నేను ఎప్పుడైతే బయటకు వస్తానో అప్పుడు నాకు ఇవ్వండి అని చెప్పాను.... అని శ్యామల గుర్తు చేసుకున్నారు.

  గెలవడానికి ప్రామాణిక ఏమీ లేదు

  గెలవడానికి ప్రామాణిక ఏమీ లేదు

  బిగ్ బాస్‌లో విన్నర్ అవ్వడానికి ప్రామాణికం అంటూ ఏమీ లేదు. మీరు మీలా ఉండాలి. మీ బిహేవియర్‌ ప్రేక్షకులు మీకు ఓట్ చేసేలా ఉండాలి. దాంతో పాటు లక్ కూడా అవసరం అని శ్యామల తెలిపారు.

  శ్యామల బయటకు రావడానికి కారణం అదే

  శ్యామల బయటకు రావడానికి కారణం అదే

  శ్యామల భర్త నరసింహారెడ్డి మాట్లాడుతూ... శ్యామల చివరి వరకు ఉంటుందని అంతా అనుకున్నారు, శ్యామలను నామినేట్ చేస్తారని కూడా ఎవరూ ఊహించలేదు. శ్యామలకు ఎక్కువ ఓట్లు రాకపోవడానికి కారణాలు ఫస్ట్ నుండి ఎలిమినేట్ అవుతున్న వారికే ప్రేక్షకులు ఓట్లు వేయడం ప్రారంభించారు. చాలా మందికి శ్యామల ఎలిమినేషన్లో ఉందని కూడా తెలియదు. ఫస్ట్ నుండి నామినేషన్లో ఉన్నవారికే ఓట్లు వేస్తూ శ్యామల ఎలిమినేషన్లో ఉందనే విషయం చాలా మంది మరిచిపోయారు. అందుకే ఆమెకు తక్కువ ఓట్లు వచ్చి ఎలిమినేట్ అయిందని తెలిపారు.

  English summary
  Aafter eliminated from Bigg Boss 2 house anchor Shyamala said, she was very balancing throughout her journey in the house and added that she has believed that she would have stay in the house for long time.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more