»   » ఆ గొడవతో మారిన పరిణామాలు: బిగ్ బాస్ నుంచి నూతన్ నాయుడు ఔట్!

ఆ గొడవతో మారిన పరిణామాలు: బిగ్ బాస్ నుంచి నూతన్ నాయుడు ఔట్!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  నాని హోస్ట్‌గా ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 2 విజయవంతంగా రెండు వారాలు పూర్తి చేసుకుంది. రెండో వారం ఇంటి నుండి నూతన్ నాయుడు ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ షోలో ఎప్పుడు ఏదైనా జరుగవచ్చు? అనే దానికి నూతన్ నాయుడు ప్రత్యక్ష ఉదామరణగా నిలిచాడు. గురువారం వరకు నూతన్ నాయుడు సేఫ్ జోన్లో ఉన్నప్పటికీ శుక్రవారం జరిగిన గొడవ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బటర్‌ఫ్లై ఎఫెక్ట్ మాదిరిగా ఎక్కడో జరిగిన ఒక చిన్న సంఘటన చివరకు నూతన్ నాయుడు ఇంటి నుండి బయటకు వెళ్లిపోయేలా చేసింది.

  మీకు ఓటు వేసిన ప్రేక్షకులు పిచ్చోళ్లు కాదు

  మీకు ఓటు వేసిన ప్రేక్షకులు పిచ్చోళ్లు కాదు

  నూతన్ ఎలిమినేషన్ ప్రకటించడానికి ముందు అవకాశం ఉంటే నేను వెళ్లి పోతానంటూ కౌశల్ అనడంతో నాని సీరియస్ అయ్యాడు. మీకు ఓటు వేసిన ప్రేక్షకులు పిచ్చోళ్లు కాదు, నువ్వు ఇలా మాట్లాడటం సరైంది కాదు అని సూచించాడు. నువ్వు వెళ్లిపోతాను అనడం ద్వారా నిన్ను నువ్వు మాత్రమే కాదు.... నిన్ను నమ్మి ఓటు వేస్తిన చాలా మందిని తక్కువ చేస్తున్నట్లే అని వ్యాఖ్యానించారు.

  కాన్ఫిడెన్స్ కోల్పోవద్దు, ఇది లైఫ్‌లో వచ్చే ఒకే ఛాన్స్

  కాన్ఫిడెన్స్ కోల్పోవద్దు, ఇది లైఫ్‌లో వచ్చే ఒకే ఛాన్స్

  రెండు వారాలకే మీలో కాన్ఫిడెన్స్ పోతే బిగ్ బాస్ షోకు ఎందుకొచ్చారు? ఈ షోలో గెలవడం అనేది కేవలం ఇక్కడి నుండి ప్రైజ్ మనీ ఒక్కటే తీసుకెళ్లడం కాదు. ఒక రెస్పెక్ట్ ను ఇంటికి తీసుకెళతారు, ఒక హీరోగా ఇంటికెళతారు. మిమ్మల్ని మూడున్నర నెలల పాటు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ప్రతి రోజూ వారి ఇంట్లో చూస్తున్నారు. మీరు మాట్లాడే చిన్న మాటైనా? కాన్ఫిడెన్స్ లెవల్స్ అయినా, ఇంకేదైనా అవ్వొచ్చు. ఇది మళ్లీ మీకు తిరిగి ఎక్స్‌ప్లెయిన్ చేసే ఛాన్స్ రాదు. ఇది వన్ టైమ్ ఆఫర్. మీరు చేసే ప్రతి పని గురించి, ప్రతి మాట గురించి బయట మాట్లాడుకుంటున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి అని నాని సూచించారు.

  కౌశల్ విషయంలో జరిగిన మ్యాజిక్ అదే

  కౌశల్ విషయంలో జరిగిన మ్యాజిక్ అదే

  బిగ్ బాస్ హౌస్‌లోని కంటెస్టెంట్స్ ఒక అరగంటలో ఈ షో చూస్తున్న ప్రేక్షకుల మనసును మార్చేయగలరు. ఆ పవర్ మీకు ఉంది. కౌశల్ విషయంలో అదే జరిగింది. ఆ గొడవ జరగక ముందు వరకు ఓటింగ్ చూస్తే ఈ రోజు ఇక్కడి నుండి వెళ్లిపోవాల్సింది కౌశల్. ఒక్క దెబ్బకు మొత్తం గ్రాఫ్ అంతా మారిపోయింది. ఆ రోజు కౌశల్ నా ఫ్యామిలీ చూస్తున్నారు, నా పిల్లలు చూస్తున్నారు. నన్ను కొందరు బ్యాడ్‌గా చిత్రీకరించడం వల్ల వారు ఎఫెక్ట్ అవుతారని బాధ పడ్డారు. ఆయన అలా మాట్లాడిన తర్వాత ఆయన తన కుటుంబం, పిల్లల దృష్టిలో హీరో అయ్యారు. ఇంతకు మించి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను... అని నాని తెలిపారు.

  ఆ ఇద్దరికీ థాంక్స్ చెప్పుకున్న నూతన్

  ఆ ఇద్దరికీ థాంక్స్ చెప్పుకున్న నూతన్

  బిగ్ బాస్ ఇంటి నుండి బయటకు వచ్చిన నూతన్ నాయుడు... ఇంట్లో తనకు ఎంతో సపోర్టుగా ఉన్న కౌశల్, నూతన్ నాయుడులకు థాంక్స్ చెప్పుకున్నారు. వారు తనకు అన్ని విషయంలో మద్దతుగా ఉన్నారని, పలు సందర్బాల్లో ధైర్యం చెప్పారని, ఎంతో అభిమానం చూపించారని తెలిపారు.

  కౌశల్ మీద బిగ్ బాంబ్

  కౌశల్ మీద బిగ్ బాంబ్

  బిగ్ బాస్ ఇచ్చిన బిగ్ బాంబును నూతన్ నాయుడు కౌశల్ మీద ప్రయోగించాడు. దీని ప్రకారం ఆయన వారం పాటు ఇంట్లో అంట్లు తోమాల్సి ఉంటుంది. ఈ బాంబును కౌశల్ సంతోషంగా స్వీకరించాడు. కౌశల్ మీద ఈ బాంబు వేసింది ఆయనలో ఆవేశాన్ని తగ్గించడానికే అని, తొందరపడకుండా ఆలోచించి ముందుకు వెళ్లడానికి ఆయనకు ఇది తోడ్పడుతుందని నూతన్ తెలిపారు.

  సంతోషంగా ఇంటికి వెళ్లిన నూతన్

  సంతోషంగా ఇంటికి వెళ్లిన నూతన్

  బిగ్ బాస్ ఇంటి నుండి బయకు వచ్చినందుకు బాధ లేదని, ఫ్యామిలీని కలవబోతున్నందుకు సంతోషంగా ఉందని నూతన్ నాయుడు తెలిపారు. అయితే పోటీలో వెనకపడినందుకు కాస్త బాధగా ఉందన్నారు.

  ఇది బటర్‌ఫ్లై ఎఫెక్టే అని చెప్పిన నాని

  ఇది బటర్‌ఫ్లై ఎఫెక్టే అని చెప్పిన నాని

  మన హౌస్‌లో కూడా బటర్ ఫ్లై ఎఫెక్ట్ జరిగిందని, ఆ ఎఫెక్టే నూతన్ బయటకు వెళ్లిపోయేలా చేసిందని నాని తెలిపారు. కౌశల్ దీప్తి సునైనను ఎత్తుకోవడం ఏమిటి? దాని తర్వాత అతడిపై అన్ని కంప్లయింట్స్ రావడం ఏమిటి? అందరూ తనను కార్నర్ చేయడం ఏమిటి? చివరకు కిరీటి వచ్చేసి ఇంకా రెచ్చగొట్టడం ఏమిటి? అది చూసిన ప్రేక్షకులు కౌశల్‌కు ఫుల్లుగా ఓట్లు వేయడం ఏమిటి? కౌశల్ సేఫ్ అయిపోవడం ఏమిటి? నూతన్ షో నుండి ఎలిమినేట్ అవ్వడం ఏమిటి? ఇదే కదా బటర్ ఫ్లై ఎఫెక్ట్ అని నాని వ్యాఖ్యానించారు.

  English summary
  Nutan Naidu has been eliminated from Bigg Boss Telugu 2. He is the second contestant to leave the house this season after Sanjana Anne, who was shown the door from the show last week.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more