Bigg Boss Telugu 2nd week Elimination: 2వ వారం ఊహించని ఎలిమినేషన్..ఇంటి నుంచి కామన్ మ్యాన్ అవుట్
చూస్తుండగానే బిగ్‌బాస్ తెలుగు 9 రెండో వారాన్ని కూడా పూర్తి చేసుకుని మరికొద్దిగంట్లో మూడో వారంలోకి ప్రవేశించనుంది. వీకెండ్ వచ్చిందంటే ఖచ్చితంగా ఎలిమినేషన్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. తొలివారం కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ హౌస్‌ను వీడగా.. బిగ్‌బాస్ తెలుగు 9లో రెండో వారంలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనేది ఉత్కంఠగా మారింది. అందరూ టఫ్ ఫైట్ ఇస్తుండగా, ఓటింగ్ ఎప్పటికప్పుడు మారిపోతోంది. ఈ నేపథ్యంలో రెండో వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే దానిపై సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
నామినేషన్స్‌లో 7గురు
శ్రష్టి వర్మ ఎలిమినేషన్‌తో 15 మంది కంటెస్టెంట్స్‌కు గాను బిగ్‌బాస్ హౌస్‌లో 14 మంది మిగిలారు. సెలబ్రిటీ కంటెస్టెంట్ల సంఖ్య 9 మందికి గాను 8 మందికి చేరింది. ఇక ఈ వారం నామినేషన్లు హోరాహోరీగా జరిగాయి. తొలివారం సరైన కారణం లేకుండా నామినేషన్స్ జరగ్గా.. రెండో వారంలో మాత్రం ప్రతి ఒక్కరూ సాలీడ్ రీజన్‌తో నామినేట్ చేశారు. ముఖ్యంగా హరిత హరీష్‌ను ఎక్కువ మంది టార్గెట్ చేశారు. దాంతో బిగ్‌బాస్ తెలుగులో రెండో వారంలో మొత్తం ఏడుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో నిలిచారు. వారు భరణి శంకర్, ఫ్లోరా షైనీ, హరిత హరీశ్, మనీష్ మర్యాద, డిమోన్ పవన్, ప్రియా శెట్టి, సుమన్ శెట్టి. అయితే డిమోన్ పవన్ కెప్టెన్‌గా గెలవడంతో అతను నామినేషన్స్ నుంచి ఆటోమేటిగ్గా సేవ్ అయిపోయాడు. దీంతో మిగిలిన ఆరుగురిలో రెండో వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు? ఈసారి డబుల్ ఎలిమినేషనా? సింగిల్ ఎలిమినేషనా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

ఓటింగ్‌లో సుమన్ శెట్టి డామినేషన్
సోషల్ మీడియాలో జరుగుతున్న ఓటింగ్‌ను పరిశీలిస్తే.. సుమన్ శెట్టి దాదాపు 42 శాతం ఓటింగ్‌తో టాప్‌లో నిలిచాడు. నామినేషన్స్ ముగిసిన నాటి నుంచి నేటి వరకు ఆయన ఓటింగ్‌లో దుమ్మరేపుతున్నాడు. సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్న సుమన్ శెట్టికి, ఇప్పుడున్న వారితో పోలిస్తే సోషల్ మీడియాలో ఫాలోవర్స్ తక్కువే. అయితే తన గేమ్‌తో మెప్పిస్తోన్న సుమన్ శెట్టికి ప్రేక్షకులు ఓట్లు గుద్దిపడేస్తున్నారు. దీంతో ఓటింగ్‌లో ఆయన దరిదాపుల్లోకే వచ్చేవారు కనిపించడం లేదు.
డేంజర్ జోన్‌లో ఇద్దరు
సుమన్ శెట్టి తర్వాత భరణి 25 శాతం, ఫ్లోరా షైనీ 8 శాతం, ప్రియా శెట్టి 7 శాతం, హరిత హరీష్ 6 శాతం, మర్యాద మనీష్ 4 శాతం ఓటింగ్‌తో నిలిచారు. ఈ ఓటింగ్‌ను బట్టి పరిశీలిస్తే.. హరిత హరీష్, మర్యాద మనీష్‌లు డేంజర్ జోన్‌లో నిలిచారు. హరిత హరీష్ ఇప్పటికే స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా గుర్తింపు తెచ్చుకోగా.. అతను హౌస్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నాడు. దీంతో బిగ్‌బాస్ తెలుగు 9లో రెండో వారం మర్యాద మనీష్ ఎలిమినేట్ కావడం దాదాపు ఖాయమైనట్లేనని గాసిప్స్ వినిపిస్తున్నాయి.
టాప్ కంటెస్టెంట్ ఔట్
అందరికంటే లీస్ట్ ఓటింగ్ రావడంతో పాటు బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో తన మైండ్ గేమ్‌తో జనం దృష్టిలో నిలిచిన మనీస్.. మెయిన్ హౌస్‌లో మాత్రం తన స్థాయికి తగినట్లుగా ఆడటం లేదని ప్రేక్షకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ నుంచి ఈ వారం మనీష్ ఎలిమినేట్ కావడం ఫిక్స్ అయినట్లేనని అంటున్నారు. మరి మనీష్ ఎలిమినేట్ అవుతాడో లేదో తెలియాలంటే కొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











