For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఖతర్నాక్ స్టెప్పులతో సినిమా చూపించిన శ్రీముఖి.. బిగ్‌బాస్‌లో సుమ, బాబా మాస్కర్ లొల్లి లొల్లి

  |
  Bigg Boss Telugu 3 : Episode 101 Highlights || ఫాన్స్ ట్వీట్లు చూసి హౌస్ మేట్స్ షాక్

  బిగ్‌బాస్‌లో యాంకర్ సుమ ప్రయాణం మంగళవారం కూడా కొనసాగింది. ఇంటి సభ్యులతో ఆటాపాటలతో అల్లరి చేశారు. అంతేకాకుండా ఇంటి సభ్యులతో దీపావళీ పండుగను జరుపుకొన్నారు. సెలబ్రిటీలతో కలిసి బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు. తెలుగు బిగ్‌బాస్ షోను చాలా ఫన్నీగా, హోమ్లీగా మార్చిన సుమ ఇంటి నుంచి నిష్క్రమించారు. మంగళవారం ఎపిసోడ్‌లో ఇంకా ఏమి జరిగిందంటే..

  ఇంటి సభ్యులతో సరదాగా

  ఇంటి సభ్యులతో సరదాగా

  ఇంటి సభ్యులతో కలిసి సరదాగా ముచ్చటిస్తూ మాటలు, పాటలు, స్టెప్పులతో హోరెత్తించారు. వరుణ్‌కు ఫ్యాన్ చేసిన ఫోన్ కాల్‌ను అందుకొన్నారు. ఫ్యాన్ అడిగిన ప్రశ్నలకు సానుకూలంగా సమాధానం చెప్పారు. వితిక పోయిన తర్వాత ఎందుకు డల్ అయ్యావని అడిగితే.. అలాంటిదేమీ లేదు. కానీ నా లైఫ్‌లో అంత ఎక్కువగా కలిసి ఉన్నది బిగ్‌బాస్‌ హౌస్‌లోనే అంటూ వరుణ్ చెప్పాడు.

  ఫ్యాన్ లెటర్లతో సంతోషంగా

  ఫ్యాన్ లెటర్లతో సంతోషంగా

  ఆ తర్వాత ఇంటి సభ్యులందరికీ వచ్చిన లెటర్లను ఇవ్వగా ఒక్కొక్కరు చదివి సంతోషంలో మునిగిపోయారు. లెటర్లు చదువుతుండగా.. జెండర్ అనే విషయం నాకు నచ్చదని శ్రీముఖి చెప్పింది. బాబా మాస్కర్, ఊసరవెళ్లి అంటూ చేసిన కామెంట్స్‌కు బాబా భాస్కర్ థ్యాంక్స్ చెప్పారు. అలీని ఓ ఫ్యాన్ పొగడ్తలతో ముంచెత్తారు. రాహుల్‌ను ఉద్దేశించి అభిమాని చేసిన కాంప్లిమెంట్‌కు హ్యాపీగా ఫీలయ్యారు.

  సుమ మ్యూజిక్.. శ్రీముఖి స్టెప్పులు

  సుమ మ్యూజిక్.. శ్రీముఖి స్టెప్పులు

  ఇక ఇంట్లో వినోదానికి సుమ, ఇంటి సభ్యులు తెర లేపారు. రాహుల్, సుమ దరువు వేస్తుంటే.. శ్రీముఖి, అలీ రెజా, బాబా భాస్కర్ చిందేశారు. సినిమా చూపిస్తా మావ పాటకు పిచ్చి పిచ్చిగా డ్యాన్స్ చేసి శ్రీముఖి అదరగొట్టింది. అంతే మొత్తంలో బాబా భాస్కర్, అలీ రెజా కూడా తమ స్టెప్పులతో హంగామా చేశారు. అలా వారు చేస్తుంటే సుమ, రాహుల్ చేతులతో మ్యూజిక్ అందిస్తూ ఊగిపోయారు.

  ఇంట్లో దీపావళీ

  ఇంట్లో దీపావళీ

  ఆ తర్వాత బిగ్‌బాస్ సూచన మేరకు ఇంట్లో ఘనంగా దీపావళీ జరిపారు. బిగ్‌బాస్ పంపించిన దీపాలు, పటాసులతో ఎంజాయ్ చేశారు. దీపావళీ పండుగను ఎంజాయ్ చేస్తుండగానే సుమను ఇంటి నుంచి బయటకు వెళ్లమని బిగ్‌బాస్ ఆదేశించాడు. దాంతో సుమ బయటకు వెళ్లింది. సుమ బయటకు వెళ్లే ముందు ఇంటి సభ్యులు ఆమెను ఆటపట్టించారు.

  టారో రీడర్ ఇంట్లోకి

  టారో రీడర్ ఇంట్లోకి

  ఇలా ఇంటి సభ్యులు ఎంజాయ్ చేస్తుండగానే.. ఇంట్లోకి టారో రీడర్ (ఆస్ట్రోలాజిస్ట్) ను పంపించగా.. బాబా భాస్కర్ ఆమెను కలిశారు. టారో రీడర్ ఓ కార్డును తీసి బాబా జాతకంలోని కీలకమైన పాయింట్లను చెప్పింది. నీవు అనుకొన్న కలలు త్వరలోనే నెరవేరుతాయి. నా జీవితంలో కొన్ని అడ్డంకులు ఎలా తొలగిపోతాయని అడిగిన ప్రశ్నకు త్వరలోనే ఆ కార్యక్రమం నెరవేరుతుంది అని చెప్పింది.

  శ్రీముఖికి జాతకం

  శ్రీముఖికి జాతకం

  బాబా భాస్కర్ తర్వాత శ్రీముఖి వెళ్లగా.. నీ జీవితంలో మ్యాజిక్ మూమెంట్స్ మొదలయ్యాయి. మీకు అంతా మంచే జరుగుతుంది. నీ జీవితంలో తప్పు జరిగింది. దాని గురించి ఆలోచించకూడదు. నీకు నీవు సారీ చెప్పుకొని జీవితంలో ముందుకెళ్లమని శ్రీముఖికి సూచించింది. దాంతో అక్కడి నుంచి శ్రీముఖి బయటకు వెళ్లింది.

  అలీ రెజా గురించి

  అలీ రెజా గురించి

  అలీ రెజాకు తన జాతకాన్ని వివరించింది. పరిస్థితుల వల్ల నీకు కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయి. కానీ అలాంటివి పూర్తయ్యాయి. మీ ఆలోచన, ప్రవర్తన పద్దతిని మార్చుకొండి అంతా మీకు మంచే జరుగుతుంది. త్వరలోనే అంతా మంచే జరుగుతుంది. కాబట్టి కొన్ని మార్పులు మీలో చేసుకోవాలి అని సూచించారు.

  English summary
  Bigg Boss 3 Telugu reality completes 14th week. This weekend funny, furious moments registred in the house. Anchor Suma performace make funny. Sreemukhi steps for Cinema Chupista mama.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X