For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బిగ్‌బాస్‌ తాటతీసిన పునర్నవి.. శ్రీముఖి, మహేష్‌‌కు దారుణ శిక్ష

  |
  Bogg Boss Telugu 3 : Episode 53 Highlights || బిగ్‌బాస్‌ తాటతీసిన పునర్నవి

  బిగ్‌బాస్‌ తెలుగు రియాలిటీ షో బుధవారం కొంత సరదాగా, మరికొంత గందరగోళంగా మారింది. ఇంటి సభ్యులందరూ ఇంట్లో దెయ్యం నాకేం భయం అనే టాస్క్‌ను హ్యాపీగా ఆడారు. టాస్క్‌లో భాగంగా మనుషులు దెయ్యాలుగా, దెయ్యాలు మనుషులుగా మారడంతో గేమ్ ముగిసింది. టాస్క్ ముగిసిన తర్వాతనే అసలు విషయం బోధపడింది. బిగ్‌బాస్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ పునర్నవి ఫైర్‌బ్రాండ్‌గా మారింది. ఇంతకు అలా ఉగ్రరూపం దాల్చడానికి కారణం ఏమిటంటే..

  టాస్క్‌పై పునర్నవి ఫైర్

  టాస్క్‌పై పునర్నవి ఫైర్

  ఇంట్లో దెయ్యం టాస్క్‌ రూల్స్ చెత్తగా ఉన్నాయి. అసలు గేమ్ సరిగా లేదు. చెత్త రూల్స్ పెట్టి బాధపెట్టారు. గంటసేపు నీళ్లలో పెట్టారు. నన్ను ఎక్కడెక్కడో టచ్ చేశారు. అయినా నేను టాస్క్‌లో భాగమని ఊరుకొన్నాను. బిగ్‌బాస్ నువ్వు అని సమయాల్లో కరెక్ట్ కాదు. బ్లడీ టాస్క్ అంటూ దుయ్యబట్టింది. అందుకే నేను లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఆడను స్పష్టం చేసింది.

  రవికృష్ణ, మహేష్‌ను బోల్తా కొట్టించి

  రవికృష్ణ, మహేష్‌ను బోల్తా కొట్టించి

  ఇంట్లో టాస్క్‌తోపాటు ఎపిసోడ్ ప్రారంభమైంది. ఉదయం పాటలో భాగంగా బాబా భాస్కర్ పాడిన పాటకు రవికృష్ణ స్టెప్పులు వేయడంతో ఆయన మరణించినట్టు బిగ్‌బాస్ ప్రకటించారు. ఇక మహేష్ విట్టాకు కొన్ని దుస్తులు మార్చడంలో రాహుల్ సక్సెస్ అయ్యాడు. దాంతో మహేష్‌ కూడా మరణించినట్టు ప్రకటించారు.

  శ్రీముఖి, పునర్నవి, మహేష్ చెత్తగా

  శ్రీముఖి, పునర్నవి, మహేష్ చెత్తగా

  మనుషులందరూ దెయ్యాలుగా.. దెయ్యాలందరూ మనుషులుగా మారడంతో బిగ్‌బాస్ గేమ్ ముగిసిందని ప్రకటించారు. గేమ్ ఫలితం ప్రకటిస్తానని చెప్పి.. కాసేపు తర్వాత ఇంట్లో సభ్యులందరిని సమావేశపరిచారు. టాస్క్ సక్సెస్‌పుల్‌గా పూర్తి చేసిన సభ్యులకు ధన్యవాదాలు. బాబా భాస్కర్, రాహుల్, వితిక బెస్ట్‌గా ఆడారని, పునర్నవి, మహేష్ విట్టా, శ్రీముఖి చెత్తగా ఆడారని శిక్షవిధించారు.

  లగ్జరీ బడ్జెట్ టాస్క్ కట్

  లగ్జరీ బడ్జెట్ టాస్క్ కట్

  టాస్క్‌లో చెత్తగా ఆడిన పునర్నవి, మహేష్ విట్టా, శ్రీముఖికి లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఉండదని బిగ్‌బాస్ ఆదేశాలు జారీ చేశాడు. టాస్క్ నియమాలను ఉల్లంఘించి గేమ్‌ను చెత్తగా చేసినందుకు పునర్నవి, మహేష్ విట్టా, శ్రీముఖికి శిక్ష విధించాడు. ఆ శిక్షలో భాగంగా బూట్లు తుడిచి పాలిష్ చేయాలని శిక్ష విధించాడు.

  పునర్నవి, మహేష్ మొండిగా

  పునర్నవి, మహేష్ మొండిగా

  బూట్లు తుడిచి పాలిష్ చేయమనే శిక్షను పునర్నవి, మహేష్ మొండిగా వ్యతిరేకించారు. మహేష్ అయితే మేము ఇలాంటి చెత్త పనులు చేయడానికి వచ్చామా? నేను చేయను అంటే చేయను అని అన్నాడు. ఇలాంటి చెత్త పనులు చేయడానికి మేము బిగ్‌బాస్ ఆడిషన్ రాలేదు. అప్లికేషన్ పెట్టుకొంటే వచ్చాం. మాకు గతిలేక రాలేదు అంటూ మహేష్ గరం అయ్యాడు.

  చేయని తప్పుకు శిక్షనా?

  చేయని తప్పుకు శిక్షనా?

  ఇక పునర్నవి ఇంకా మొండిగా వ్యవహరించింది. ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు శిక్ష అనుభవించాలి. నేను చేసిన తప్పేమిటో చెప్పాలి. కావాలంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్లేందుకు రేను రెడీ. నేను ఈ విషయంలో భయపడేది లేదు. ఏం చేసుకొంటారో చూద్దాం అంటూ బిగ్‌బాస్‌కు సవాల్ విసిరింది.

  బిగ్‌బాస్ వార్నింగ్

  బిగ్‌బాస్ వార్నింగ్

  తన ఆదేశాలను ఉల్లంఘించిన పునర్నవి, మహేష్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. బిగ్‌బాస్ ఆదేశాలను తప్పుకుండా అందరూ పాటించాలి. పాటించని వ్యక్తులను వచ్చేవారం నేరుగా నామినేట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చాడు. అయినా పునర్నవి దిగిరాలేదు. ఇంటి సభ్యుల్లో హిమజ, వితిక, శిల్ప చక్రవర్తి బతిమిలాడినా పట్టించుకోలేదు. అలానే మొండిగా వ్యవహరించింది.

  శ్రీముఖి బూట్లు తుడిచి

  శ్రీముఖి బూట్లు తుడిచి

  చివర్లో మహేష్ శిక్షను అనుభవించడానికి సిద్ధం అయ్యాడు. దాంతో శ్రీముఖి, మహేష్ ఇంటి బయట ఉన్న లాన్‌లో బూట్లు తుడుస్తూ పాలిష్ చేశారు. బాబా భాస్కర్, తదితరులు కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. అయితే ఎలాంటి శిక్షను అనుభవించడానికైనా రెడీ.. నా తప్పు లేనప్పుడు నేను శిక్ష అనుభవించను. బిగ్‌బాస్ గేమ్ రూల్స్ బాగాలేదు. బ్లడీ టాస్క్ అంటూ పునర్నవి ఫైర్ అయింది.

  English summary
  Bigg Boss 3 Telugu reality show 53 day with high emotional content. on 6th weekend funny, furious moments registred in the house. Latest elimination of Ali Reza given shock to television audience. On monday, Celebraties are in shock. But they overcome from that, participated in nomination for the Elimination.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X