For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బిగ్‌బాస్ తెలుగు 4 గ్రాండ్ ఫినాలే లైవ్: దుమ్మురేపిన అందాల భామలు.. ప్రణిత, లక్ష్మీరాయ్, మోహ్రీన్

  |

  బిగ్‌బాస్ తెలుగు గ్రాండ్ ఫినాలే ఈవెంట్ స్టార్ మా టెలివిజన్‌లో ప్రారంభమైంది. హోస్ట్ నాగార్జున గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. తనదైన స్టైల్‌లో డ్యాన్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకొన్నాడు. వేదిక మీదకు వచ్చిన హోస్ట్ నాగ్ 16 మంది కంటెస్టెంట్లు డ్యాన్సులు చేస్తారని చెప్పడం జరిగింది. ఆ తర్వాత బిగ్‌బాస్ వేదిక మీద ఇంకా ఏం జరిగిందంటే..

  రికార్డు స్థాయి ఓట్లతో

  రికార్డు స్థాయి ఓట్లతో

  బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4కు రికార్డు స్థాయిలో ఓట్లను ప్రేక్షకులు ఓట్లు వేశారు. గత సీజన్ అంటే 3వ సీజన్‌కు 8 కోట్ల ఓట్లు వస్తే.. నాలుగో సీజన్‌కు 15 కోట్ల 65 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఇది బిగ్‌బాస్ షోపై ఉన్న ప్రేక్షకాదరణ సాక్ష్యం అని హోస్ట్ నాగార్జున తెలిపాడు.

  మోహబూబ్ దిల్‌సే, అమ్మా రాజశేఖర్ డ్యాన్సులు

  మోహబూబ్ దిల్‌సే, అమ్మా రాజశేఖర్ డ్యాన్సులు

  ప్రేమికుడు చిత్రంలోని ముక్కాబులా పాటతో మెహబూబ్ దిల్‌సే స్టేజ్‌ మీద ఎంట్రీ ఇచ్చాడు. అమ్మా రాజశేఖర్, దివి, లాస్య, నోయల్, అవినాష్, సూర్య కిరణ్, కుమార్ సాయి, జోర్దార్ సుజాత, స్వాతి దీక్షిత్ ఇంటి వేదికపై స్టెప్పులేసి హంగామా చేశారు.

   పలు జిల్లాల వాళ్లు నాతో ఫోటోలు

  పలు జిల్లాల వాళ్లు నాతో ఫోటోలు

  అవినాష్‌తో తొలుత హోస్ట్ నాగార్జున మాట్లాడించాడు. అవినాష్ మాట్లాడుతూ.. మీరు చెప్పినట్టే.. బిగ్‌బాస్‌కు ముందు, బిగ్‌బాస్ తర్వాత నా లైఫ్ చాలా వేరుగా ఉంది. ఇంతకు ముందు మా ఊరు వాళ్లే ఫోటోలు దిగేవారు. కానీ బిగ్‌బాస్ తర్వాత చాలా జిల్లాల వాళ్లు వచ్చి నాతో ఫోటో దిగుతున్నారు. నాతోనే కాకుండా నా తల్లితో కూడా ఫోటోలు దిగుతున్నారు అని అన్నారు.

  అవినాష్, మాస్టర్‌కు షాక్

  అవినాష్, మాస్టర్‌కు షాక్

  నోయల్ సీన్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌కు ముందు రాజమౌళి, సుకుమార్ ఇచ్చిన అవకాశాలతో నన్ను గుర్తు పట్టేవారు. బిగ్‌బాస్ తర్వాత నాకు మరింత పాపులారిటి సంపాదించుకొన్నారు. ఇంటిలో అవినాష్, మాస్టర్ అమ్మా రాజశేఖర్‌తో జరిగిన గొడవ వల్ల వాళ్లు ఏమైనా హర్ట్ అయితే అందుకు సారీ. అవినాష్ కామెడీ ఓ మెడిసిన్.. మాస్టర్ నా క్షమాపణ అంటూ నోయల్ సీన్ అన్నారు.

  ఇంట్లోకి రావొద్దన్నారు..

  ఇంట్లోకి రావొద్దన్నారు..

  మెహబూబ్ మాట్లాడుతూ.. బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చాక ఇంటికి ఫోన్ చేస్తే రావొద్దని చెప్పారు. ఇప్పుడు రాకు ఓ పది రోజుల తరువాత రా అని చెప్పారట. వారం తరువాత వెళ్లినా కూడా నా కోసం బైక్ ర్యాలీలు, మూడు వేల మంది వరకు వచ్చారు. కేక్ కటింగ్ అని చెప్పారు.. కానీ అక్కడికి వెళ్లాక షాక్ అయ్యాను. అందరూ నాకోసమే వచ్చారని తెలిసి ఎమోషనల్ అయ్యానంటూ మెహబూబ్ చెప్పుకొచ్చాడు.

  ఇంట్లో దొంగతనాలు చేసేది వారేనట!!

  ఇంట్లో దొంగతనాలు చేసేది వారేనట!!

  ఇంట్లో తనకు కిచెన్ అంటే ఇష్టమని సోహెల్ చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో దోశల టాపిక్ వచ్చింది. సోహెల్ పది, పదిహేను దోశలను తింటాడని మెహబూబ్ చెప్పుకొచ్చాడు. ఎగ్ దోశలు బాగా తింటాడని చెబుతూ.. ఇంట్లో తామే ఎగ్స్ దొంగతనాలు చేశామని, అది ఇన్నాళ్లూ ఎవ్వరికీ తెలీదని చెప్పుకొచ్చాడు. అదే సమయంలో అవినాష్ లేచి.. ఇంట్లో నా ఎగ్స్ ఎన్నో మిస్ అయ్యాయని వాపోయాడు. అలా మొత్తానికి సీజన్ ఎండింగ్‌లో దొంగలు బయటపడ్డారు.

  ప్రణీత సుభాష్ గ్రాండ్ ఎంట్రీ

  ప్రణీత సుభాష్ గ్రాండ్ ఎంట్రీ

  బిగ్‌బాస్ తెలుగు 4 గ్రాండ్ ఫినాలే వేదికపై ప్రణీత సుభాష్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. అత్తారింటికి దారేది చిత్రంలోని పాటకు డ్యాన్స్ చేస్తూ ఇంటిలో సందడి చేశారు. ప్రణిత జోష్ చేసిన డ్యాన్స్ అందర్నీ ఆకట్టుకొన్నది. అలా ప్రణీత తన అందాలతో ప్రేక్షకులను కొత్త అనుభూతికి గురిచేశారు.

  English summary
  Bigg boss telugu 4 grand finale updates: Abijeet duddala, Syed Sohel Ryan, Akhil Sarthak, Ariana Glory, Dettadi Harika are in Top 5. Host Nag is organised the Grand event in his style
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X