Just In
- 39 min ago
నా పేరు రంగడు వీడి పేరు.. హద్దులు దాటుతోన్న హైపర్ ఆది డబుల్ మీనింగ్
- 1 hr ago
అది కంట్రోల్ చేయడమే నా పేరుకు అర్థం.. ఎద అందాలతో చిచ్చుపెట్టిన ఊర్వశీ
- 2 hrs ago
ఇదెక్కడి వింతరా బాబు.. సుత్తితో కొట్టేసుకుంటోన్న హీరో.. వీడియో వైరల్
- 2 hrs ago
నాగ చైతన్య, సాయి పల్లవి లవ్ స్టోరీ: ముహూర్తం ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్
Don't Miss!
- Finance
ఆనంద్ మహీంద్ర గిప్ట్: ఆరుగురు టీమిండియా ప్లేయర్లకు కార్లు బహుమానం..
- News
ఎవరి ప్రాపకం కోసం ఎన్నికలు .. ఎస్ఈసీ నిమ్మగడ్డపై విరుచుకుపడిన స్పీకర్ తమ్మినేని సీతారాం
- Sports
ఏదైనా చేసుకోండి.. మేం మాత్రం అక్కడికి వెళ్లం! బీసీసీఐకి రవిశాస్త్రి హెచ్చరిక!
- Automobiles
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
- Lifestyle
సెక్స్ సమయంలో మీరు ఈ పని చేస్తే ఏమి జరుగుతుంది?
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అఖిల్ నీకో దండం.. షాకిచ్చిన మోనాల్ గజ్జర్.. అభిజిత్ కోసం త్యాగం
బిగ్ బాస్ దాదాపు ఫైనల్ స్టేజ్ లోకి వచ్చేసింది. ఇంకా కొన్ని వారాలు మాత్రమే మిగిలి ఉంది. కంటెస్టెంట్స్ మిగిలింది ఏడుగురు మాత్రమే. ఇక హౌజ్ లో ఉన్న కంటెస్టెంట్స్ చాలా వరకు ప్రతిరోజూ ఎదో ఒక విధంగా కష్టపడుతున్నవారే. ఇక సోమవారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్టులో మోనాల్ అంతకు మించిన ట్విస్ట్ ఇచ్చినట్లు అర్ధమవుతోంది. షోకి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేసిన స్టార్ మా ఒక్కసారిగా హైప్ క్రియేట్ చేసింది.

నాగార్జున రేపిన చిచ్చులతో..
బిగ్ బాస్ హౌజ్ లో గత వారం కుటుంబ సభ్యుల రాకతో చాలా ఎమోషనల్ అయిన కంటెస్టెంట్స్ ఇప్పుడు మాత్రం శత్రువులుగా మారారు. నాగార్జున రేపిన చిచ్చులతో శనివరమే హౌజ్ లో ఒక రకంగా కంటెస్టెంట్స్ లలో కోపాలు బయటకు వచ్చాయి. ఇక ఇప్పుడు నామినేషన్ ప్రక్రియకు సమయం ఆసన్నమైందని మరింత కోపాగ్నిని బయటపెడుతున్నారు.

ఎవరు తీసుకున్న గొయ్యిలో వారే..
బిగ్ బాస్ కూడా నామినేషన్ ప్రక్రియలను కూడా చాలా వినూత్నంగా ప్లాన్ చేస్తున్నాడు. మొదటి వారం నుంచి కూడా ప్రతి టాస్క్ లో ఎవరో ఒకరు హైలెట్ అవుతూనే ఉన్నారు. ఇక సోమవారం ఎపిసోడ్ నామినేషన్ సమయంలో బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ మామూలుగా లేదు. ప్రతిసారి ఓట్లతో సెలెక్ట్ చేసి కంటెస్టెంట్స్ ని నామినేట్ చేసేవారు. కానీ ఈ సారి ఎవరు తీసుకున్న గొయ్యిలో వారే తెలియకుండా పడేలా ప్లాన్ చేసినట్లు అర్ధమవుతోంది.

ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్
బజార్ మొగగానే కంటెస్టెంట్స్ బయట ఉన్న టోపీలను ధరించాలి. హారిక తప్పితే డేంజర్ జోన్ లో ఉన్న అందరూ ఒక్కసారిగా బయటకు పరిగెత్తి టోపీలను పెట్టుకున్నారు. అప్పుడే బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. ఇక రెడ్ కలర్ టోపీలను ధరించిన అవినాష్, అభిజిత్, అఖిల్ , అరియానా నామినేట్ అయినట్లు చెప్పారు బిగ్ బాస్.

బిగ్ బాస్ ను తప్పుబట్టిన అవినాష్
ఇక అదృష్టవశాత్తూ గ్రీన్ కలర్ టోపీలను ధరించారు మోనాల్, సోహైల్. దీంతో మొదట అవినాష్ షాక్ అయ్యాడు. గేమ్ సరిగ్గా అడలేమన్నట్లుగా ఇంటికి వెళ్లిపోవాలా అని నామినేషన్ ప్రక్రియను తప్పుపట్టాడు అవినాష్. దీంతో అభిజిత్ కూడా ఇది మన తలరాత బ్రదర్ అంటూ కౌంటర్ ఇచ్చాడు. అయితే నామినేషన్ ప్రక్రియ ఇంకా పూర్తవ్వలేదన్న బిగ్ బాస్ బయట ఉన్నవారిని స్వాప్ చేసుకోవచ్చని షాక్ ఇచ్చాడు.

బల్లగుద్ది చెబుతున్నా మోనాల్: అవినాష్
దీంతో అవినాష్ మోనాల్ ని టార్గెట్ చేస్తూ.. బల్లగుద్ది చెబుతున్నా నీ కంటే నేను 100% కాదు 200% ఈ షోకి అర్హుడినని ఆమెను త్యాగం చేయాల్సిందిగా షాక్ ఇచ్చాడు. ఇక మోనాల్ కూడా అదే తరహాలో.. నువ్వు నిజంగా అలా అయితే అక్కడే ఉండు..మీరు అంత మంచి గేమ్ అడుతున్నప్పుడు భయమెందుకు.. నువ్వే ఉంటావ్. నేనైతే ఇక్కడి నుంచి కదిలేది లేదని కౌంటర్ ఇచ్చింది.

అఖిల్ కూడా మోనాల్ వైపే..
ఇక అరియానా, అఖిల్ కూడా కూడా మోనాల్ ని టార్గెట్ చేశారు. అఖిల్ అయితే నేను నీ కొసం చాలా చేశానని గత విషయాలను గుర్తు చేశాడు. దీంతో మోనాల్ స్పందిస్తూ.. ఎప్పుడు అది చేశాను ఇది చేశాను అని చెబుతూనే ఉంటావు.. నా కోసం చాలా మంచి చేశావ్ చాలా థాంక్యూ అని కౌంటర్ ఇచ్చింది.

అభిజిత్ కోసం మోనాల్ త్యాగం.. అఖిల్ షాక్
ఇక చివరలో మోనాల్ ఇచ్చిన ట్విస్టు మామూలుగా లేదు. అఖిల్ కోసం ఆమె త్యాగం చేయడానికి సిద్ధమవుతుందని అనుకుంటే అభిజిత్ కోసం త్యాగం చేయడానికి సిద్ధమైంది. ఇప్పటివరకు బిగ్ బాస్ హిస్టారిలో ఇది నెవర్ బిఫోర్ ట్విస్ట్ అనేలా ఉంది. ఒక్కసారిగా అభిజిత్ గుండె బద్దలైంది.. షాక్ అవుతూ కను గుడ్లు బయటకు తీస్తూ మోనాల్ ని చూశాడు. అసలు ఈ రోజు ఏం జరగనుందనే ఉత్కంఠకు ప్రోమో ఒక్కసారిగా హైప్ క్రియేట్ చేసింది. చూడాలి మరి ఏం జరుగుతుందో..