twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్‌బాస్.. నరకం చూపించకు.. టాస్కులు మరీ అంత దారుణమా? మండిపడుతున్న నెటిజన్లు

    |

    బిగ్‌బాస్ తెలుగు 4 షో విషయానికి వస్తే.. ఇప్పడిప్పుడే గాడిన పడుతున్నదనే ఫీలింగ్ కలిగిన నేపథ్యంలో గత రెండు రోజులుగా పెట్టిన నస ప్రేక్షకుల సహనానికి అద్దం పట్టింది. గత మూడు రోజులుగా ఇంటిలో కొనసాగుతున్న టాస్కులు అతి పేలవంగా మారాయనే వాదన నెటిజన్లు, బుల్లితెర ప్రేక్షకుల్లో కలిగింది. మానవులు, రాక్షసుల టాస్క్‌ ఆసక్తికరంగా లేకపోవడం అందుకు కారణమని ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత మూడు రోజుల్లో జరిగిన విషయాలను పరిశీలిస్తే..

    ఏడోవారంలో మరీ దారుణంగా

    ఏడోవారంలో మరీ దారుణంగా

    లాక్‌డౌన్‌లో బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్ ఉంటుందా? ఉండదా? అనే సందేహాల మధ్య రియాలిటీ షోను ప్రారంభించారు. ఇంటి బయట కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అత్యంత జాగ్రత్తలు తీసుకొని ప్రారంభించిన ఈ షో ప్రేక్షకుల అంచనాల మేరకు లేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అనేక గందరగోళాల మధ్య ఈ షో ఏడో వారానికి చేరుకొన్నది. అయితే ఏడు వారాలుగా ఒకటో, అరో టాస్కులు తప్ప మిగితావన్నీ దారుణంగా ఉన్నవానే అభిప్రాయాల మధ్య షో సాగుతున్నది.

    అర్ధం పర్ధం లేకుండా నస పెట్టి

    అర్ధం పర్ధం లేకుండా నస పెట్టి

    బిగ్‌బాస్ హౌస్‌లో ఏడోవారానికి సంబంధించి లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా మానవులు, రాక్షసులు అనే టాస్క్‌ను మొదలుపెట్టారు. 44, 45 రోజుల్లో మొత్తం ఆ టాస్క్‌ను కొనసాగించారు. అర్ధంపర్ధం లేని గేమ్ నియమాలు, ఆసక్తికరంగా లేని కంటెంట్‌తో విసుగుపుట్టించారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. సుధీర్ఘంగా ఇంటిలో సాగిన టాస్క్‌లో గేమ్‌ను ఇంట్రెస్టింగ్‌గా మలచలేకపోవడమే కారణంగా మారింది.

    జబర్దస్త్ అవినాష్ పెర్ఫార్మెన్స్‌తోనే

    జబర్దస్త్ అవినాష్ పెర్ఫార్మెన్స్‌తోనే


    రాక్షసులు, మానవులు టాస్క్ అత్యంత నీరసంగా సాగుతున్న క్రమంలో కూడా జబర్దస్త్ అవినాష్ చూపించిన ప్రదర్శన హైలెట్‌గా మారింది. అవినాష్‌కు తోడుగా అరియానా గ్లోరి కూడా జతకలవడంతో గత రెండు రోజుల ఎపిసోడ్‌ కాస్త ఉపశమనం ఇచ్చింది. అవినాష్ పెర్ఫార్మెన్స్ పీక్‌లో లేకపోతే దారుణమైన ఫలితాన్ని బిగ్‌బాస్ అందుకొనే ప్రమాదం ఉండేది అనే విషయం చర్చనీయాంశమైంది.

    అరుపులు, కేకలు తప్ప..

    అరుపులు, కేకలు తప్ప..

    టాస్కుల సందర్భంగా హౌస్‌లోని సభ్యులు పెద్దగా ఆసక్తి చూపకోవడంతో రెండు జట్ల మధ్య వినోదం కరువైంది. అంతేకాకుండా సెలబ్రిటీలతో ఆడించిన టాస్కుల్లో కంటెంట్ లేకపోవడంతో అరుపులు, కేకలు తప్ప ఏమీ కనిపించలేదు. సెలబ్రిటీలు ఆడే తీరు కూడా ప్రేక్షకులకు అసహనాన్ని పుట్టిస్తున్నది. ఇంటి సభ్యులు మాట్లాడే భాష మరీ అభ్యంతరకరంగా మారుతున్నది.

    Recommended Video

    #RamaRajuForBheem : Komaram Bheem NTR Teaser, Jr.NTR RRR First Look | #BheemforRamaraju, #RRR
    మంచి రేటింగ్‌ వస్తున్నప్పటికీ..

    మంచి రేటింగ్‌ వస్తున్నప్పటికీ..


    లాక్‌డౌన్‌లో వినోదం కరువైన ప్రేక్షకులకు బిగ్‌బాస్ ద్వారా కాస్త ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందనుకొనే ప్రేక్షకులకు బిగ్‌బాస్ నిరాశనే కలిగిస్తున్నాడు. గేమ్ ఫార్మాట్ ఇలానే ఉంటే ఇప్పుడున్న ఆదరణ కరువయ్యే ప్రమాదం కనిపిస్తున్నది. పెద్దగా పేరు లేని సెలబ్రిటీలతో గేమ్ నడిపిస్తున్నప్పటికి.. మంచి రేటింగ్ రావడం విశేషంగా మారింది. ప్రేక్షకుల ఆదరణను పరిగణనలోకి తీసుకొని సరైన కంటెంట్ జొప్పిస్తే షో రానున్న రోజుల్లోనైనా షో జనరంజకంగా మారే అవకాశం ఉంది.

    English summary
    Bigg Boss Telugu 4 Seasons 44th day update: Ariana Teases Amma Rajasekhar. Demons and Human team participated in luxury budget task. But This show tested patience of the audience since two days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X