Don't Miss!
- Finance
RTGS సేవల్లో అంతరాయం, ఆర్బీఐ తాజా ట్వీట్ ఏమంటే?
- Sports
వావ్.. మోర్గాన్‌పై నేను టాస్ గెలవడమా? నమ్మలేకపోతున్నా: విరాట్ కోహ్లీ
- News
కమలా.. నువ్వు చావబోతున్నావ్ -యూఎస్ ఉపాధ్యక్షురాలి హత్యకు పన్నాగం -ఫ్లోరిడా నర్సు అరెస్ట్
- Lifestyle
కరోనా వ్యాక్సిన్ ముఖ్యంగా మహిళలకు ఎలాంటి దుష్ప్రభావాలు కలిగిస్తుందో మీకు తెలుసా?
- Automobiles
కారులో ఉన్న పాడిల్ షిఫ్ట్ ఫీచర్ యొక్క ప్రయోజనాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బిగ్‌బాస్ విన్నర్ అభిజీత్‌కు స్టార్ హీరో బంపర్ ఆఫర్స్.. వరుసగా మూడు సినిమాలు!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 టైటిల్ విన్నర్ గా నిలిచిన అభిజిత్ ఏ స్థాయిలో క్రేజ్ అందుకున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఏ కంటెస్టెంట్ కూడా అందుకొని విధంగా 4వ సీజన్ లో అత్యదిక ఓట్లు కూడా సంపాదించాడు. కేవలం లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ ద్వారా వచ్చిన గుర్తింపుతో బిగ్ బాస్ వరకు వెళ్లిన ఈ కుర్రాడు విన్నర్ గా నిలుస్తాడాని ఎవరు ఉహీంచలేదు. ఇక బిగ్ బాస్ ముగిసి నెలలు గడుస్తున్నా సినిమాలకు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు. అయితే ఒక బడా ప్రొడక్షన్ హౌజ్ లో అభి మూడు సినిమాలకు కమిట్మెంట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

తొందరపడకుండా..
బిగ్ బాస్ సీజన్ 4 తెలుగులో అందరికంటే ఎక్కువగా క్రేజ్ అందుకున్న అభి త్వరలోనే హీరోగా బిజీ కానున్నాడట. ఆఫర్స్ చాలానే వస్తున్నాయట. త్వరలోనే అప్డేట్స్ ఇవ్వబోతున్నాను అంటూ ఒక ప్రకటన కూడా చేశాడు. వీలైనంత వరకు తొందరపడకుండా బిగ్ బాస్ ద్వారా వచ్చిన ఫేమ్ ను కాపాడుకోవాలని అనుకుంటున్నాడు.

అందుకే చాలా జాగ్రత్తగా
అయితే ఇప్పటివరకు బిగ్ బాస్ ద్వారా విన్నర్ గా నిలిచిన కంటెస్టెంట్ సినీ కెరీర్ లో పెద్దగా సక్సెస్ అయ్యింది లేదు. కానీ అభిజిత్ కు దక్కిన రెస్పాన్స్ మామూలుగా లేదు. కరెక్ట్ గా రెండు సినిమాలు పడితే అతని స్థాయి మరో రేంజ్ కు వెళుతుంది. అందుకే చాలా జాగ్రత్తగా కథలను సెలెక్ట్ చేసుకుంటున్నట్లు సమాచారం.

యూ ట్యూబ్ ద్వారా..
బిగ్ బాస్ షో ముగిసిన తరువాత కొన్ని రోజుల వరకు అభిజిత్ గ్యాప్ లేకుండా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొన్నాడు. ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ ఎలాగైతే యూ ట్యూబ్ ఛానెల్స్ తో ఆడియెన్స్ కు రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నారో అలాగే అభిజిత్ కూడా వారానికో వీడియో పోస్ట్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతున్నాడు. ఇటీవల ఫ్రీడమ్ అండ్ పులి కాన్సెప్ట్ లో ఫారెస్ట్ లో చక్కర్లు కొట్టిన వీడియో ఒకటి తన ఛానెల్ లో పోస్ట్ చేశాడు.

ఆ ప్రొడక్షన్ లో మూడు సినిమాలు
అయితే అభిజిత్ అక్కినేని వారి హోమ్ బ్యానర్ అన్నపూర్ణ ప్రొడక్షన్ హౌజ్ లోనే మూడు సినిమాలు చేయడానికి కమిట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అభి కోసం నాగార్జున కూడా కథలు వింటున్నాడట. మీడియం బడ్జెట్ లో సినిమాలను నిర్మించి అభికి బ్రేక్ ఇవ్వాలని నాగార్జున ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరి అభిజిత్ ఈ ప్రొడక్షన్ లో ఎలాంటి సినిమాలు చేస్తాడో చూడాలి.