Just In
- 21 min ago
RRR యూనిట్‌కు భారీ షాకిచ్చిన నటి: కొత్త రిలీజ్ డేట్‌ను అలా లీక్ చేసింది.. డిలీట్ చేసే లోపే పట్టేశారుగా!
- 10 hrs ago
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్‌లో నలుగురు దర్శకులు!
- 11 hrs ago
అది ఒత్తిడితో కూడుకున్న పని.. వారి వల్లే సాధ్యమైంది.. దూసుకెళ్తోన్న శివజ్యోతి
- 12 hrs ago
నాగ్‌తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
Don't Miss!
- Lifestyle
శనివారం దినఫలాలు : వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అదృష్టం కలిసి వస్తుంది...!
- News
మూడ్ ఆఫ్ ది నేషన్ 2021: రైతుల ఆందోళనను మోడీ సర్కారు బాగా నియంత్రించింది
- Finance
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు: వెండి రూ.1,000కి పైగా డౌన్
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నువ్వు నాకు బాస్‌వి కాదు.. నన్ను అడగటానికి నువ్వెవరు.. అరియానాపై మోనాల్ గజ్జర్ ఫైర్
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో దాదాపు ముగింపు దశకు చేరుకొంటున్నది. నాలుగో సీజన్‌కు సంబంధించిన గ్రాండ్ ఫినాలేకు రంగం సిద్ధమవుతున్నది. ఈ క్రమంలో కంటెస్టెంట్లు టైటిల్‌పై గురి పెట్టి తమ ఆట తీరును, వ్యూహాలను మార్చుకొంటున్నారు. తాజాగా విడుదలైన 85వ రోజు ప్రోమోలో ఒకరిపై మరొకరు భగ్గుమనే రీతిలో కొట్లాడుకొన్నారు. 13వ నామినేషన్ ప్రక్రియకు సంబంధించిన మరింత సమాచారం..

అరియానా ప్రశ్న.. మోనాల్ అసహనం
నామినేషన్ ప్రక్రియ సందర్భంగా మోనాల్ గజ్జర్‌ను అరియానా నామినేట్ చేస్తూ రెండు పాయింట్లు చెప్పినట్టు కనిపించింది. అయితే మొదటి పాయింట్‌కు మోనాల్ సమాధానం చెప్పిన తర్వాత.. రెండో పాయింట్‌పై క్లారిటీ ఇవ్వమని అరియానా సూచించింది. అయితే అలా అరియానా చేసిన కామెంట్‌పై మోనాల్ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. కౌంటర్ ఇచ్చింది.

ఏం చెప్పాలో నాకు నేర్పించకు
ఏం చెప్పాలో.. ఏం చెప్పకూడదో నీవు నాకు చెప్పకూడదు అంటూ అరియానాకు మోనాల్ ఎదురు ప్రశ్న వేశారు. అయితే నాకు ఏం చెప్పాలో.. చెప్పకూడదో అనేది నేను అడుగుతున్నాను. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే అంటూ అరియానా బెట్టు చేసింది. దాంతో నీకు అన్ని విషయాలు చెప్పడానికి నీవు నా బాస్‌వి కాదు అంటూ ఇంగ్లీష్‌లో అరిచింది.

తెలుగులో మాట్లాడు అంటూ అవినాష్
మోనాల్, అరియానా మధ్య ఇంగ్లీష్‌లో సంభాషణ జరుగుతుండగా తెలుగు.. తెలుగు అంటూ ముక్కు అవినాష్ జోక్యం చేసుకొన్నాడు. దాంతో నేను మాట్లాడుతుండగా అడ్డుపడకు అంటూ మోనాల్ వార్నింగ్ ఇచ్చినట్టు బిహేవ్ చేసింది. దాంతో నేను తెలుగులో మాట్లాడమని అడుగుతున్నాను అంటూ అవినాష్ అనగానే మోనాల్ మరింత రెచ్చిపోయింది. దాంతో సోహెల్ ఆమె కోపాన్ని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించాడు.

అందరూ మాట్లాడే వాళ్లే.. మోనాల్ ఫైర్
అయితే నేను మాట్లాడుతున్నప్పుడు ఎవరూ ఆపకూడదు. ప్రతీ ఒక్కరు మాట్లాడేవారే అంటూ గట్టిగా మోనాల్ అరిచింది. ఇలాంటి పరిస్థితుల మధ్య నామినేసన్ ప్రక్రియ వాడిగా వేడిగా జరిగింది. ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి అఖిల్, మోనాల్, అభిజిత్, హారిక, అవినాష్ నామినేట్ అయ్యినట్టు సమాచారం.