ఏడుస్తూనే అఖిల్‌కు దేత్తడి.. అలాంటి పరిస్థితి అంటూ.. అభిజిత్ దారిలో హారిక
బిగ్‌బాస్ తెలుగు ఇంటిలో 79వ రోజున భావోద్వేగాలు కనిపించాయి. బిగ్‌బాస్ ఇచ్చిన ట్విస్టుకు అందరూ కంగుతినే పరిస్థితి వచ్చింది. ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం పోటీలో నిలిచిన అఖిల్, అవినాష్‌కు ఓటు వేసే విషయంలో కొందరు ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా హారిక మాట్లాడుతూ..

సంఘర్షణకు గురయ్యాను అంటూ
అఖిల్, అవినాష్‌లో ఎవరికి ఓటు వేయాలనే విషయంలో నేను చాలా సంఘర్షణకు గురయ్యాను. నేను ఎందుకు ఈ నిర్ణయం తీసుకొన్నానో కాస్త టైమ్ పడుతుంది. కెప్టెన్‌గా నాకు రెండు రోజులుగా షాక్ మీద షాక్ ఇస్తున్నారు. మీరు చేసిన మీరు రానున్న రోజుల్లో సపోర్టు చేస్తారో లేదోనని భయపడి తీసుకొన్న నిర్ణయం కాదు అని దేత్తడి హారిక అన్నారు.

గంటన్నరపాటు ఆలోచించాను
ఎవరికి ఓటు వేయాలనే విషయంపై గంటన్నరపాటు ఆలోచించాను. ఆలోచించింది ఒకటి.. నిర్ణయం తీసుకొన్నది మరోకటి. నా మనసుకు నచ్చిన నిర్ణయాన్ని అమలు చేయకపోతే నేను ఈ ఇంటి నుంచి వెళ్లిపోయే సమయంలో నాకు ఎలాంటి పశ్చత్తాపం ఉండదు అని హారిక తెలిపారు.

ఆ రోజు మోనాల్‌కు సపోర్టు చేశా
గతంలో అవినాష్, మోనాల్ గజ్జర్‌ను సేవ్ చేసే విషయంలో ఓ నిర్ణయం తీసుకొన్నాను. అవినాష్ వచ్చి అడిగిన మోనాల్‌కే బట్టలు, షూస్ వేయాలని అనుకొన్నాను. కానీ అవినాష్ చెప్పిన ఓ మాట నా మనసులో బలంగా నాటుకుపోయింది. అలాంటి పరిస్థితి నా జీవితంలో ఎదురైంది. అది ఎంత దారుణంగా ఉంటుందో నాకు తెలుసు అంటూ హారిక పేర్కొన్నారు.

నా మనస్పూర్తిగా అఖిల్‌కు ఓటు
ఇప్పుడు అఖిల్, అఖిల్ అంటూ ఓటు వేయాలని మనసులో అనుకొన్నాను. అవినాష్ కంటే నాకు అఖిల్ క్లోజ్. కానీ అవినాష్‌కు చేసిన ప్రామిస్‌ను పూర్తి చేయడానికి ఇది ఓ అవకాశం అనుకొంటున్నాను. నా మనస్పూర్తిగా నేను అవినాష్‌కు ఓటు వేయాలని అనుకొంటున్నాను అని హారిక చెప్పారు.
Recommended Video

భావోద్వేగానికి గురైన హారిక దేత్తడి
అఖిల్‌కు సహాయం చేయాలని అనిపిస్తున్నది. కానీ చేయలేకపోతున్నాను అంటూ భావోద్వేగానికి గురయ్యారు. దాంతో అభిజిత్, సోహెల్ వచ్చి ఓదార్చారు. దాంతో తేరుకొని.. అవినాష్ విషయంలో నేను ప్రామిస్‌ను మధ్యలోనే ఆపేశాను. అది పూర్తి చేయకపోతే నాకు కంప్లీట్ నెస్ ఉండదు. కాబట్టి నేను అవినాష్‌కు ఓటు వేస్తున్నాను అంటూ హారిక తెలిపారు. దాంతో అవినాష్‌కు ఎవిక్షన్ ఫ్రీ పాస్ లభించింది. దాంతో ఎలిమినేషన్ కాకుండా రెండు వారాల పాటు ఆ పాస్‌ను ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











