బిగ్‌బాస్ విజేత ఎవరు? చివరి వారంలో రికార్డుస్థాయి ఓట్లు.. ఎవరికి ఎంత అంటే!

బిగ్‌బాస్ తెలుగు 4 రియాలిటీ షో క్లైమాక్స్ దశకు చేరుకొన్నది. ఇక నాలుగైదు రోజుల్లో విజేత ఎవరో తేలిపోనున్నది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఓటింగ్ లైన్స్‌ మొదలైన భారీగా ఓట్లు పోలువుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలో టాప్ 5 కంటెస్టెంట్లకు ఓట్ల శాతం ఎలా నమోదైందంటే?

మొదటి నుంచి అధిపత్యంతో

మొదటి నుంచి అధిపత్యంతో

బిగ్‌బాస్‌ తెలుగు 4 షోలో అభిజిత్, అరియానా గ్లోరి, సోహెల్ సయ్యద్, అఖిల్ సార్థక్, హారిక దేత్తడి టాప్ 5లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మొదటి నుంచి ఓట్ల విషయంలో ఆధిపత్యం సాధిస్తున్న అభిజిత్ చివరి వారంలో కూడా ఎవరికి అందనంత ఎత్తులో కొనసాగుతున్నట్టు తెలిసింది.

కంటెస్టెంట్ల భారీ తేడా నమోదు

కంటెస్టెంట్ల భారీ తేడా నమోదు

టాప్ 5 కంటెస్టెంట్లలో అభిజిత్‌ ఇతర కంటెస్టెంట్లతో పోల్చుకొంటే ఓట్ల శాతంలో భారీ వ్యత్యాసం కనిపిస్తున్నదనే స్పష్టంగా తెలుస్తున్నది. ఇప్పటికే మెజారిటీ ప్రేక్షకుల్లో అభిజిత్‌ విజేతగా నిలుస్తాడనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. దాదాపు అన్ని రకాల ఒపీనియన్ పోల్స్‌లో అభిజిత్‌కే సానుకూలత వ్యక్తమవుతున్నట్టు తెలుస్తున్నది.

అభిజిత్‌కు భారీ మద్దతు

అభిజిత్‌కు భారీ మద్దతు

ఇక అభిజిత్‌కు సెలబ్రిటీల నుంచి కూడా భారీగా మద్దతు లభిస్తున్నది. నాగబాబు, విజయ్ దేవరకొండ లాంటి సినీ తారలు అభిజిత్‌కు బహిరంగంగా మద్దతు తెలిపితే.. రాంగోపాల్ వర్మ లాంటి ప్రముఖులు అరియానాకు ఓటు వేయమని సలహా ఇస్తున్నారు. ఈ క్రమంలో చివరి వారం ఓటింగ్ చాలా కీలకంగా మారింది.

Recommended Video

Bigg Boss Telugu 4 : Vijay Devarakonda Supports His Life Is Beautiful Co Star Abhijeet
ఓట్ల శాతం ఇలా...

ఓట్ల శాతం ఇలా...

ఇక ఓటింగ్ విషయానికి వస్తే... అభిజిత్ టాప్ పొజిషన్‌లో కొనసాగుతున్నాడనేది సమాచారం. ఇప్పటి వరకు పోలైన ఓట్లలో అభిజిత్‌కు 50 నుంచి 55 శాతం, అరియానాకు 15 నుంచి 20 శాతం మధ్య, సోహెల్‌కు 10 నుంచి 14 శాతం మధ్య, అఖిల్‌కు 10 నుంచి 15 శాతం మధ్య, హారికకు 5 నుంచి 10 శాతం మధ్య ఓట్లు పోలైనట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X