For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ రాబట్టిన యాంకర్ రవి.. ప్రైజ్‌మనీ కంటే ఎక్కువే..

  |

  బిగ్ బాస్ సీజన్ 5 మొదలైనప్పటి నుంచి కూడా విన్నర్ ఎవరు అవుతారు అనే విషయంలో అనేక రకాల రూమర్స్ వచ్చాయి. దాదాపు టాప్ 5 కంటెస్టెంట్స్ లిస్ట్ పై కూడా ఒక క్లారిటీ అయితే వచ్చింది. ముఖ్యంగా అందులో యాంకర్ రవి ఉంటాడు అని అందరికి ఒక క్లారిటీ అయితే ఉంది. ఇక బిగ్ బాస్ చివరి దశకు వచ్చే తరుణంలో అతనే వెళ్లిపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక రవికి రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారు అనేది హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో అనేక రకాల రూమర్స్ అయితే వస్తున్నాయి.

  ఎవరు ఊహించని విధంగా

  ఎవరు ఊహించని విధంగా

  గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక టాప్ యాంకర్ హౌస్ లో టాప్ 5లో నిలవకపోవడం వండర్ అనే చెప్పాలి. యాంకర్ రవి ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ అందరికంటే కూడా సీనియర్ సెలబ్రెటీ అని చెప్పవచ్చు. తప్పకుండా అతనికి శ్రీరామ్ కు అలాగే కాజల్ కు కూడా పోటీ గట్టిగా ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఎవరు ఊహించని విధంగా యాంకప్ రవి 12వ వారం ఎలిమినేట్ అయ్యాడు.

  ఎన్ని తప్పులు చేసినా

  ఎన్ని తప్పులు చేసినా

  ఇక యాంకర్ రవి మధ్యలో అయితే చాలా పొరపాట్లు చేశాడు. ముఖ్యంగా అమ్మతోడు అంటూ మాట మార్చిన విషయం ఆ తరువాత తప్పును కప్పి పుచ్చలని చేసిన ప్రయత్నాలు అతనిపై నెగిటివ్ టాక్ ను వచ్చేలా చేశాయి. అయినప్పటికీ కూడా రవి ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా పోరాటం చేశాడు. తప్పు తెలుసుకొని వెంటనే ఒప్పేసుకున్నాడు. ఆ తరువాత అతను ఆలోచించిన విధానం కూడా ఆటలో రంగును మార్చేశాయి.

  గుంట నక్కగా..

  గుంట నక్కగా..

  గుంట నక్కగా పేరును అందుకున్న రవి చాలామందిని తనవైపుకు తిప్పుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్లు కామెంట్స్ అయితే వచ్చాయి. ముఖ్యంగా కంటెస్టెంట్స్ అందరు కూడా అతన్ని గుంట నక్క అనేశారు. ఇక కాజల్ తో కూడా అతనికి బాండింగ్ చాలావరకు చెడిపోయింది. లోబో కూడా హౌస్ లో ఉన్నంత సేపు పదేళ్ల స్నేహాన్ని పక్కన పెట్టేశాడు. ఆ విషయంలో రవి నడుచుకున్న తీరుకు మంచి మార్కులే పడ్డాయి.

  గట్టి పోటీని ఇచ్చిన రవి

  గట్టి పోటీని ఇచ్చిన రవి

  ఇక ఫైనల్ గా రవి 12వ వారం ఎలిమినేట్ అవ్వడం ఓ వర్గం ప్రేక్షకులకు ఏ మాత్రం నచ్చలేదు. కానీ బిగ్ బాస్ లో మాత్రం ఎంత పెద్ద స్టార్ సెలబ్రెటీ అయినా కూడా ఎలిమినేట్ అవ్వాల్సి వస్తే తప్పకుండా హౌస్ లో నుంచి బయటకు వెళ్లిపోవాల్సిందే. రవి వెళ్లిపోయే సమయంలో కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. రవి అందరితోను తీవ్రంగానే పోటీ పడ్డాడు. అయినప్పటికీ వాళ్ళతో మంచి బాండింగ్ అయితే ఏర్పడింది.

  వారానికి రవికి ఇచ్చిన పారితోషికం

  వారానికి రవికి ఇచ్చిన పారితోషికం

  ఇక బిగ్ బాస్ ద్వారా రవికి వచ్చిన పారితోషికం ఎంత అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక యాంకర్ రవికి నిర్వాహకులు అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారన్నది అందరికి తెలిసిన విషయమే. వారానికి రూ. 7 లక్షల నుంచి రూ.8 లక్షల మధ్యలో ఇస్తున్నట్లు తెలుస్తోంది.

  Bigg Boss Telugu 5 : Mommy's Warning.. Shannu & Siri Self Goal || Filmibeat Telugu
  మొత్తం వచ్చింది ఎంతంటే?

  మొత్తం వచ్చింది ఎంతంటే?

  ఇక 12 వారాలకు గాను రవికి మొత్తంగా 90లక్షల వరకు అందినట్లు సమాచారం. అంటే దాదాపు కోటి దగ్గరకు వచ్చేసింది. టాప్ 5లో లేకపోయినా కూడా రవికి బిగ్ బాస్ ప్రైజ్ మనీ కంటే ఎక్కువగానే అందింది. ఇక బిగ్ బాస్ విన్నర్ కు మొత్తంగా 50లక్షలతో పాటు ఒక సొంత ఇంటిని నిర్మించుకునేందుకు ఆఫర్ కూడా ఇవ్వబోతున్నట్లు నాగార్జున క్లారిటీ ఇచ్చారు.

  English summary
  Bigg boss telugu 5 anchor ravi total remuneration for 12 weeks..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X