Lahari Shari in Bigg Boss Telugu 5 :ఎవరీ లహరి? అప్పుడే నాగ్ కు పువ్వుతో గేలం వేసిందిగా!

తెలుగు ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఎట్టకేలకు ఈరోజు మొదలైపోయింది. ఈ రోజు రోజు కర్టెన్ రైజర్ ఈవెంట్ లో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయిన కంటెస్టెంట్ ల పరిచయ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ షోలో మూడవ కంటెస్టెంట్ గా లహరి షారి ఎంటర్ అయ్యారు. అసలు ఆమె ఎవరు? ఆమె స్వస్థలం ఏమిటి ? సినిమాల్లోకి ఎలా వచ్చారు ? ఎలా క్రేజ్ సంపాదించారు అనే వివరాలు మీ కోసం

ఎవరీ లహరి షారి

ఎవరీ లహరి షారి

లహరి షారి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నటి, ఆమె యాంకర్ గా మోడల్ గా కూడా పని చేస్తున్నారు. అయితే ఆమె ప్రధానంగా తెలుగు పరిశ్రమలో పేరు తెచ్చుకోవడానికి చూస్తున్నారు. ఆమె జూన్ 5, 1995ణ హైదరాబాద్, తెలంగాణలో జన్మించింది. 2014 లో, లహరి 'సారీ నాకు పెళ్లైంది' సినిమాతో నటిగా తన కెరీర్‌ను ప్రారంభించింది.

టెలివిజన్ కేరీర్

టెలివిజన్ కేరీర్

ఇక ఆ తరువాత 2016 లో, ఆమె ఈటీవీ తెలుగులో 'సెలబ్రేషన్స్' షోతో టెలివిజన్‌లో తన కెరీర్‌ను ప్రారంభించింది. తరువాత, ఆమె 'మహా' న్యూస్ ఛానెల్‌లో చేరారు మరియు 2017 నుంచి 2019 వరకు అందులోనే ప నిచేశారు. ఈ సమయంలో ఆమె మంచి పేరు తెచ్చుకోవడమే కాక మరియు అవసరమైన గుర్తింపు పొందింది.

ఆ చానల్స్ లో తరువాత సినిమాలు

ఆ చానల్స్ లో తరువాత సినిమాలు

ఆమె తదుపరి స్టూడియో ఎన్ న్యూస్ అనే ఒక న్యూస్ ఛానెల్‌లో 2019 లో క్రియేటివ్ హెడ్‌గా చేరింది. అదే సమయంలో, లహరి అర్జున్ రెడ్డి (2017), మళ్ళీ రావా (2017), పటేల్ SIR (2017), అజ్ఞాతవాసి (2018), పేపర్ బాయ్ (2018), శ్రీనివాస కళ్యాణం (2018), U (2018) కథే హీరో వంటి వివిధ సినిమాల్లో కూడా కనిపించారు. ఆ తరువాత ఆమె తిప్పరా మీసం (2019), మరియు జోంబీ రెడ్డి (2021) వంటి సినిమాల్లో కూడా కనిపించారు.

నాగార్జునకే పువ్విచ్చి

నాగార్జునకే పువ్విచ్చి

ఇక ఆమె మూడో కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టింది. అడుగుపెట్టి పెట్టడంతోనే తన జీవితానికి సంబంధించిన కొన్ని వివరాలు పంచుకునే ప్రయత్నం చేసింది. ఎంతో కష్టపడి ఇక్కడిదాకా వచ్చానని ఆమె పేర్కొంది. ఇక వచ్చి రావడంతోనే నాగార్జునకు ఒక గులాబీ పువ్వు ఇచ్చి ఆయనను ఫిదా చేసే ప్రయత్నం చేసింది, అయితే నాగార్జునకు ఆ గులాబీ పువ్వు ఇస్తూ ఇది చాలా అరుదైనది అని అందుకే ఈ రంగులో ఉంది అని చెప్పి వైలెట్ కలర్ గులాబీ ఇస్తుంది.

Recommended Video

Harbhajan Singh లో ఇంత గొప్ప సింగర్ ఉన్నాడా.. రోజా మూవీ లో పాట పాడిన బజ్జీ
అప్పుడే మొదలు పెట్టేశావా?

అప్పుడే మొదలు పెట్టేశావా?

తర్వాత మరో గులాబీ పువ్వు కూడా ఇవ్వడంతో నాగార్జున మళ్లీ ఆ రెండింటినీ ఆమెకిచ్చి లోపల ఎవరైనా నచ్చితే ఇవ్వాలని లేదా తీసుకొని వచ్చి తనకు ఇవ్వాలని అంటారు. లోపల ఎవరు నచ్చినా నచ్చక పోయినా మీకు ఇవ్వడం కన్ఫామ్ అని ఆయన దగ్గరే ఉంచేస్తుంది. చివరికి ఒక పువ్వు తీసుకోమని అనడంతో ఆ పువ్వు తీసుకుని లోపలికి వెళ్తుంది. ఇప్పటికే లోపలికి వెళ్లిన సన్నీ తన డ్రీమ్ గర్ల్ పోలికలు లహరిలో ఉన్నాయేమో చూసే ప్రయత్నం చేస్తాడు. దీంతో అప్పుడే మొదలు పెట్టేశావా అంటూ సన్నీని ఏడిపించే ప్రయత్నం చేస్తుంది లహరి. మరి చూడాలి లహరి ఏమేరకు ఆకట్టుకుంటుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X