For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 5: RJ కాజల్ టాలెంట్ కు నోరెళ్లబెట్టిన నాగార్జున.. వెంటనే ఐ లవ్ యూ అంటూ..

  |

  బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ప్రేక్షకులను అలరించడానికి పవర్ఫుల్ గా కంటెస్టెంట్స్ తో సిద్ధమైంది. గత కొన్ని రోజులుగా ఈ షోకు సంబంధించిన ప్రోమోలు కథనాలు ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక స్టార్ మా లో ప్రసారాం అవుతున్న 5వ సీజన్ రియాలిటీ షో కోసం మరోసారి అక్కినేని నాగార్జున హోస్ట్ గా దర్శనమివ్వడంతో ఈసారి కూడా షో హిట్టవుతుందని చెప్పవచ్చు. గ్రాండ్‌గా మొదలైన ఈ సీజన్ మొదటిరోజు మూడు గంటల పాటు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ను అందించింది. ఇక ఒక్కొక్కరుగా కంటెస్టెంట్స్ వారి స్టైల్ లోనే హౌజ్ లోకి అడుగు పెట్టారు. రేడియో జాకి కాజల్ కూడా సరికొత్త ఎమోషనల్ వీడియోతో తనను తాను పరిచయం చేసుకుంది.

  ఎమోషనల్ వీడియోతో

  ఎమోషనల్ వీడియోతో

  ఒకరోజు ముందుగానే మొదలైన ఈ షోలో మొదట ఇంటరాక్షన్‌తో సహా మిగిలిన సీక్వెన్స్‌లను షూట్ చేశారు. ఇక ఆ ఎపిసోడ్ ఆదివారం ప్రసారం అయ్యింది. ఇక 17వ కంటెస్టెంట్ గా RJ కాజల్ అడుగు పెట్టారు. ఒక పంజరం నుంచి వచ్చి అనుకున్న కలను సాధించిన సరికొత్త కథ అంటూ తన కథను ఎమోషనల్ గా తెలిపింది. అలాగే తన ఎంట్రీ AVలో తన ప్రేమ కథను కూడా వివరించింది.

  ఐ లవ్ యూ చెప్పిన నాగార్జున

  ఐ లవ్ యూ చెప్పిన నాగార్జున

  ఇక నాగార్జున దగ్గరకు రాగానే తన జీవితం గురించి చెప్పుకుంది. కెరీర్ మొదట్లోనే RJగా నా ప్రయాణం స్టార్ట్ అయినప్పుడు మీ డాన్ సినిమా ప్రమోషన్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ కు వచ్చి ఇంటర్వ్యూ కూడా చేశాను. అప్పుడు మీరు నా లిజెనర్స్ కోసం ఐ లవ్ యూ అన్నారు. అది నా కోసం అనుకున్నాను. ఇక ఇప్పుడు హౌజ్ లో నుంచి వెళ్లిపోయేసరికి అందరితోనే కాకుండా మీతో కూడా ఐ లవ్ యూ చెప్పించుకుంటాను అని కాజల్ వివరణ ఇచ్చింది. ఇక నాగార్జున కూడా అప్పుడే కాజల్ కు ఐ లవ్ యూ చెప్పేశాడు.

  సింగర్ జానకి గాత్రంతో..

  సింగర్ జానకి గాత్రంతో..

  ఆ తరువాత కాజల్ టాలెంట్ గురించి తెలుసుకున్న నాగార్జున ఆ గుట్టు లాగేందుకు ప్రయత్నం చేశారు. ఎందుకంటే కాజల్ మిమిక్రి, ఇమేటెట్ కూడా కూడా అద్భుతంగా చేయగలదని అదే చేయమని అడిగారు. ఇక సింగర్ జానకి గాత్రాన్ని ఇమేటెట్ చేసిన కాజల్ నాగార్జునను షాక్ అయ్యేలా అబ్బురపరిచింది. ఇక షోలో కూడా అదే తరహాలో ఉండాలని నాగార్జున ఆశించారు.

  డబ్బింగ్ చెబుతూ..

  డబ్బింగ్ చెబుతూ..

  విజయవాడ నుండి వచ్చిన ఈ రేడియో జాకీ-యాంకర్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. RJ తో పాటు, కాజల్ తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్‌లను నిర్వహించేది. తన మధురమైన గాత్రానికి పేరుగాంచిన కాజల్ తన డబ్బింగ్ స్వర్ణంతో 2009 లో తెలుగు సినిమా 'నిన్ను కలిషాక'తో ప్రారంభమైంది. ఆమె అనేక ముఖ్యమైన సినిమాలలో హీరోయిన్స్ కు అలాగే ఇంపార్టెంట్ ఫీమేల్ పాత్రలకు కూడా డబ్బింగ్ చెప్పింది..

  బిగ్ బాస్ లోకి సరికొత్తగా

  బిగ్ బాస్ లోకి సరికొత్తగా

  కాజల్ కూడా వ్లాగ్‌ లు మరియు ఫుడ్ ఛాలెంజ్ వీడియోలతో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ గా ఉంటుంది. ఇక తరచుగా సోషల్ మీడియాలో తన లిప్-సింక్ మరియు డ్యాన్స్ వీడియోలతో అభిమానులను అలరిస్తుంది. కొంతమంది సెలబ్రెటీలను కూడా తరచుగా ఇంటర్వ్యూలు చేస్తు ఫాలోవర్స్ ను కూడా పెంచుకుంది. ఇక బిగ్ బాస్ లోకి సరికొత్తగా ఎంట్రీ ఇచ్చిన కాజల్ ఏ విధంగా నిలదొక్కుకుంటుందో చూడాలి. గత సీజన్‌లాగే, 16 మంది పోటీదారులూ హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో తప్పనిసరిగా రెండు వారాల క్వారంటైన్‌కు పంపబడ్డారు. వారి ఆరోగ్యం క్రమం తప్పకుండా క్లినికల్ పర్యవేక్షణలో ఉంచారు. ఇక మొత్తానికి మరోసారి కోవిడ్ టెస్టులు నిర్వహించిన తరువాతే హౌజ్ లోకి పంపారు.

  Harbhajan Singh లో ఇంత గొప్ప సింగర్ ఉన్నాడా.. రోజా మూవీ లో పాట పాడిన బజ్జీ
  భారీ స్థాయిలో బిగ్ బాస్ ఫస్ట్ ఎపిసోడ్

  భారీ స్థాయిలో బిగ్ బాస్ ఫస్ట్ ఎపిసోడ్

  వైరల్ అవుతున్న మరొక ముఖ్యమైన విషయం లోకి వెళితే ఈసారి ఓపెనింగ్ ఈవెంట్ కోసం ఏ స్థాయిలో ఖర్చు పెడుతున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది. గత సీజన్లో మొదటి ఎపిసోడ్ కోసం దాదాపు రెండు కోట్లకు పైగా ఖర్చు చేశారని టాక్ వచ్చింది.కంటెస్టెంట్స్ స్పెషల్ ఎంట్రీలు అప్పట్లో ఏ రేంజ్ ఆకట్టుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సారి కూడా ప్రతి ఒక్కరూ వారి టాలెంట్ తోనే హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు సమాచారం.

  English summary
  Bigg boss telugu 5 Contestant RJ Kajal special talent ,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X