For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 5: 4వ సెలబ్రిటీగా ఎంట్రీ ఇచ్చిన ఐడల్ సింగర్ శ్రీరామ చంద్ర.. రొమాంటిక్ పాటతో సరికొత్తగా

  |

  మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 4వ మరోసారి నాగార్జున హోస్ట్ తో అంగరంగ వైభవంగా మొదలయ్యింది. వంద రోజులపాటు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ తో కొనసాగనున్న ఈ షోలో కి విబిన్నమైన సెలబ్రిటీలు కంటెస్టెంట్ గా అడుగులు పెట్టారు. ఇక ఎవరు ఎలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్తారు అనేది ఒకసారి అంచనాలు పెంచేసింది. ఎందుకంటే ఈ సారి నిర్వాహకులు నెవర్ బిఫోర్ నేను ఇలా కంటెస్టెంట్ హౌస్ లోకి పంపించారు. దాదాపు సగం మంది టాప్ సెలబ్రిటీలు కావడంతో ఈసారి పోటీ తీవ్రత ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. నాగార్జున కూడా తన హోస్టింగ్ తో చాలా డిఫరెంట్ గా కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

  ఇక నాలుగవ కంటెస్టెంట్ గా సీనియర్ సింగర్ రామచంద్ర హౌస్ లోకి అడుగు పెట్టాడు. మన్మథుడులోని నేను నేనుగా లేనే.. అనే పాటతో సరికొత్తగా ఎంట్రీ ఇస్తూ గాత్రంతోనే ఎట్రాక్ట్ చేశాడు. అలాగే మాయదారి మైసమ్మ అంటూ కొన్ని తీన్ మార్ స్టెప్పులు కూడా వేశాడు. అలాగే ఇక్కడా అందరిని తన తెలుగు పాటలతో సరికొత్తగా ఎంటర్టైన్ చేస్తానని నాగార్జునకు వివరణ ఇచ్చారు. అనంతరం హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చి శ్రీ రామచంద్ర అందరిని సరదాగా పరిచయం చేసుకున్నారు.

  శ్రీరామచంద్ర మాట్లాడుతూ.. నేను ఇక్కడ నాలానే ఉంటాను. ఇక మన్మథుడు అనే పదంపై నాగార్జున రామచంద్ర పై సరదాగా కౌంటర్ ఇచ్చారు. హౌజ్ లోపల అలానే ఉంటావా అని అడిగారు. ఇక బిగ్ బాస్ హౌజ్ లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఇప్పటివరకు నేను 500 పాటలు పాడాను. కానీ హిందీలో ఎక్కువగా పాడాను. మళ్ళీ తెలుగు వాళ్లకు బిగ్ బాస్ అనంతరం ఎక్కువగా దగ్గరవుతానని అనుకుంటున్నాను. మా బామ్మ గారు ఎప్పుడు కనిపించిన తెలుగు పాటలు ఎప్పుడు పాడతావని అడుగుతున్నారు. అందుకే ఈసారి తెలుగులో ఎక్కువగా పాడాలని అనుకుంటున్నాను అని చెప్పాడు. అంతే కాకుండా అమని పాడవే అంటూ నాగార్జున కోసం ఒక పాట పాడారు.

  సంగీత ప్రపంచంలో మంచి కీర్తిని సంపాదించుకున్న శ్రీరామ చంద్ర నటుడిగా కూడా అడుగులు వేశాడు. అతను ఇండియన్ ఐడల్ విజేతగా నిలిచిన అనంతరం కొంత గ్యాప్ అయితే తీసుకున్నాడు. అప్పట్లో కొన్ని రియాలిటీ షోలలో కూడా పాల్గొన్నాడు. తెలుగులో ప్రఖ్యాత గాన వృత్తితో పాటు, అతను 2013 లో తెలుగు సినిమా శ్రీ జగద్గురు ఆది శంకరలో కూడా నటుడిగా కనిపించాడు.

  Bigg boss telugu 5 Contestant sri ramachandra Introduction

  గతంలో చాలామంది సింగర్స్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వారికంటూ ఒక ప్రత్యేకమైన స్థాయిని పెంచుకున్నారు ఇక ఈసారి శ్రీరామచంద్ర కూడా అదే తరహాలో అడుగులు వేసేందుకు సిద్ధం అయ్యాడు. ఖాళీగా ఉండకుండా బిగ్ బాస్ తోనే తన కెరీర్ ను సరైన ట్రాక్ లోకి తెచ్చుకోవాలని అనుకుంటున్నాడు. ఇక మంచి పాటతో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సీనియర్ సింగర్ ఈ తరహాలో అడుగులు వేస్తాడో చూడాలి. చూడ్డానికి చాలా సున్నిత గా కనిపించే శ్రీ రామచంద్ర వివాదాస్పదమైన టాస్క్ లలో కూడా ఎలా కనిపిస్తాడు అని ఓ వర్గం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

  రేపటి నుంచి హౌజ్ అసలు ఆట మొదలు కానుంది. మొదటి వారమే ఈసారి ఎంటర్టైన్మెంట్ షోస్ పెంచేవిధంగా బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది గతంలో ఎప్పుడూ లేని విధంగా విభిన్నమైన స్వభావాలు కలిగిన సెలబ్రెటీలు కంటెస్టెంట్ గా సెలెక్ట్ చేసినట్లు పాజిటివ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి. మరి ఈ సెలబ్రెటీ లో ఎలాంటి గొడవలతో ముందుకు వెళ్తారు చూడాలి.

  Harbhajan Singh లో ఇంత గొప్ప సింగర్ ఉన్నాడా.. రోజా మూవీ లో పాట పాడిన బజ్జీ

  మీడియాలో వైరల్ అవుతున్న మరొక ముఖ్యమైన విషయం లోకి వెళితే ఈసారి ఓపెనింగ్ ఈవెంట్ కోసం ఏ స్థాయిలో ఖర్చు పెడుతున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది. గత సీజన్లో మొదటి ఎపిసోడ్ కోసం దాదాపు రెండు కోట్లకు పైగా ఖర్చు చేశారని టాక్ వచ్చింది. కంటెస్టెంట్స్ స్పెషల్ ఎంట్రీలు అప్పట్లో ఏ రేంజ్ ఆకట్టుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సారి కూడా ప్రతి ఒక్కరూ వారి టాలెంట్ తోనే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అందుకే వారి కోసం అంతకంటే ఎక్కువగా ఖర్చు చేశారని తెలుస్తోంది

  English summary
  Bigg boss telugu 5 Contestant sri ramachandra Introduction, ఇక -- కంటెస్టెంట్ గా సీనియర్ సింగర్ రామచంద్ర హౌస్ లోకి అడుగు పెట్టాడు. ఇండియన్ ఐడల్‌ విజేతగా నిలిచిన శ్రీరామ చంద్ర అప్పట్లో భారీ స్థాయిలో క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. సంగీత ప్రపంచంలో మంచి కీర్తిని సంపాదించుకున్న శ్రీరామ చంద్ర నటుడిగా కూడా అడుగులు వేశాడు. అతను ఇండియన్ ఐడల్ విజేతగా నిలిచిన అనంతరం కొంత గ్యాప్ అయితే తీసుకున్నాడు
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X