For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss 5: ఏమీ లేని ఆకు ఎగిరెగిరి ప‌డుతుంది.. శ్రీరామ్‌ను చూసి ఆర్జే కాజల్ అలాంటి సామెత!

  |

  గడిచిన ఐదు రోజుల్లో ఎలా ఉన్నా కూడా శనివారం ఆదివారం మాత్రం వీలైనంత ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అందించడానికి నాగార్జున ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే కంటెస్టెంట్స్ చేసిన తప్పులను కూడా సరిదిద్దుతూ ఒక క్రమ పద్ధతిలో వెళ్ళేలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే గతంలో మాదిరిగా మాత్రం నాగార్జున ఈ సారి అనుకున్నంత స్థాయిలో అయితే ఆకట్టుకోవడం లేదు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.

  ముఖ్యంగా కంటెస్టెంట్స్ తప్పు చేసినప్పుడు గతంలో నాగార్జున కడిగిపారేశారు కానీ ఈసారి మాత్రం ఆయన కంటెస్టెంట్స్ పై పెద్దగా ప్రశ్నించవడం లేదని ఓ వర్గం నెటిజన్లు భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఎంటర్టైన్మెంట్ అందించడంలో మాత్రం నాగార్జున సరికొత్తగా ముందుకు వెళుతున్నారు. ఇక శనివారం రోజు 'మెడ‌లో మోత‌- స‌రిపోయే సామెత' గేమ్ పాడించడం విధానం మంచి ఫన్ క్రియేట్ చేసింది.

  ఎవరైతే స్నేహాంగా ఉంటారో..

  ఎవరైతే స్నేహాంగా ఉంటారో..

  కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎంత స్నేహంగా ఉన్నప్పటికీ ఏదో ఒక సందర్భంలో గొడవలు పడక తప్పదు. ఇప్పుడు కలిసికట్టుగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో మాత్రం టాస్క్ లు జరిగేటప్పుడు త్యాగాలు చేసే అవకాశం ఉండదు. తప్పకుండా గేమ్ కోసం పోరాడుతూనే ఉండాలి. బిగ్ బాస్ కూడా అలాంటి ట్విస్టులు ఎక్కువగా పెడుతూ ఉంటాడు. ఎవరైతే ఎక్కువగా స్నేహాంగా ఉంటారో వారి మధ్యలోనే ఊహించని విధంగా చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు.

  మెల్లగా తప్పించుకుంటున్నారు

  మెల్లగా తప్పించుకుంటున్నారు

  ఇక ప్రస్తుతం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒక్కో తరహా స్వభావాన్ని కలిగి ఉన్నారు. దాదాపు అందరి బుద్ధులు ఎలా ఉంటాయో ఇప్పటికే జనాలకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక మెల్లగా జనాలకు నచ్చని వారు హౌస్ లో ఎలిమినేట్ అవుతున్నారు. కొందరు మాత్రం తృటిలో తప్పించుకుంటున్నారు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక నాగార్జున మాత్రం శని ఆదివారం రోజు కంటెస్టెంట్స్ అందరిని ప్రశ్నిస్తూనే మరోవైపు మంచి వినోదభరిత వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు.

  ఏమీ లేని ఆకు ఎగిరెగిరి..

  ఏమీ లేని ఆకు ఎగిరెగిరి..

  హౌస్ లో కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒకరిపై ఒకరు వారికి సెట్టయ్యే సామెతలు సెలెక్ట్ చేసుకోవాలి. నాగార్జున సామెతలు చెప్తే అందుకు సంబంధించిన ప్లేట్‌ను ఎవ‌రికి సూటవుతుందో వారి మెడ‌లోనే వేయాల్సి ఉంటుంది. అయితే అందులో ఎక్కువగా కాజల్ సామెత వైరల్ గా మారింది. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి ప‌డుతుంది అన్న సామెత శ్రీరామ్‌కు తగిలిచడం విశేషం.

   కుక్క తోక వంక‌ర..

  కుక్క తోక వంక‌ర..

  కంద‌కు లేని దుర‌ద క‌త్తిపీట‌కు ఎందుకు అన్న సామెత‌ను ప్రియాంక సిరికి సెట్ చేసింది. అనంతరం శ్రీరామ్‌ కాజల్ ను ఉద్దేశిస్తు అంతంత కోడికి అద్ద‌సేరు మ‌సాలా అనే సామెత కరెక్ట్ అని చెప్పాడు. ఇక సన్నీ జెస్సికి.. కుక్క తోక వంక‌ర సామెత‌ను జెస్సీకి సెట్ చేశాడు. అబ‌ద్ధం ఆడినా అతికిన‌ట్లు ఉండాల‌ని మానస్, ర‌వికి అంకితమిచ్చాడు. ఇక లోబోకు దున్న‌పోతు మీద వ‌ర్షం కురిసిన‌ట్లు సామెత సెట్ట‌వుతుంద‌ని విశ్వ వివరణ ఇచ్చారు. రానురాను రాజు గుర్రం గాడిదైంది అన్న‌దాన్ని కాజ‌ల్‌ కు ఆనీ మాస్టర్ అంకితమిచ్చింది. పైన ప‌టారం, లోన లొటారం అన్న సామెతను జెస్సి స‌న్నీకిచ్చాడు.

  Recommended Video

  Manchi Rojulochaie చిన్న సినిమానే.. కానీ కంటెంట్ లో పెద్ద సినిమా..!!
  ఏకులా వ‌చ్చి మేకులా..

  ఏకులా వ‌చ్చి మేకులా..

  ఏకులా వ‌చ్చి మేకులా త‌గులుకున్నాడ‌ని షన్ను ర‌వి గురించి క్లారిటీ ఇచ్చాడు. ఇక సిరి షన్నుపై ఫోకస్ చేసి అంద‌ని ద్రాక్ష ప‌ళ్లు పుల్ల‌న అన్న‌ ప్లేటును అతని మెడ‌లో వేసింది. ఓడ ఎక్కేవ‌ర‌కు ఓడ మ‌ల్ల‌న్న‌, ఓడ దిగిన త‌ర్వాత బోడ మ‌ల్ల‌న్న అంటూ రవి మాన‌స్‌ పై కామెంట్ చేశాడు. అనంతరం లోబో చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకుని ఏం లాభం అంటూ ఆనీకి సెట్టని అన్నాడు. ఈ విధంగా కంటెస్టెంట్స్ విభిన్నమైన సామెతలతో మంచి ఫన్ క్రియేట్ చేశారు.

  English summary
  Bigg boss telugu 5 contestants shocking Proverbs to others
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X