For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss telugu 5: 19 కంటెస్టెంట్స్ జీతాలు.. ఎంటర్టైన్మెంట్ డోస్ పెరిగితే మరింత ఎక్కువగా?

  |

  బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొదలైనప్పటి నుంచి కూడా ఈసారి ఎవరు గెలుస్తారు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే పోటీదారులు ప్రతి ఒక్కరు కూడా వారికంటూ ప్రత్యేకమైన క్రేజ్ ఉన్న వారే. అలాగే మరి కొందరు ఇప్పటికే సోషల్ మీడియాలో స్పెషల్ గా ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ బేస్ ను అయితే సంపాదించుకున్నారు. చూస్తుంటే మొదటి ఈ వారంలోనే రేటింగ్స్ భారీగా వచ్చే అవకాశం ఉందని అనిపిస్తోంది. ఇక ఈ సారి హౌస్ లోకి అడుగు పెట్టిన సెలబ్రిటీలు ఏ స్థాయిలో అందుకుంటున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా కొంతమంది ప్రముఖ సెలబ్రిటీలు కూడా హౌస్ లోకి రావడం విశేషం. వారికి సంబంధించిన రెమ్యునరేషన్ వివరాలు కూడా ఇంటర్నేట్ ప్రపంచంలో వైరల్ అవుతున్నాయి. ఒకసారి ఆ విషయంపై లుక్కేస్తే..

  ఆ ముగ్గురికి గట్టిగానే

  ఆ ముగ్గురికి గట్టిగానే

  బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన 19 మంది కంటెస్టెంట్స్ లో కొందరు అయితే భారీ స్థాయిలో ఆదాయాన్ని పెంచుకునే ప్యాకేజీని కూడా మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది ఫైనల్ వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు కూడా సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా యాంకర్ రవి లోబో షన్ముఖ్ జశ్వంత్ వంటి పోటీదారులు చాలా రోజులు వరకు సందడి చేయబోతున్నట్లు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇక వారికి రెమ్యునరేషన్ కూడా నిర్వాహకులు భారీగా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

   నాలుగు లక్షల వరకు

  నాలుగు లక్షల వరకు

  మొత్తంగా కంటెస్టెంట్స్ ను మూడు కేటగిరీలుగా విభజించిన నిర్వాహకులు అందులో ఒక్కొక్కరికి ఒక విధమైన ప్యాకేజీ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. బయట ఒక రోజు లెక్కన జీతాలు కూడా అందుకునే వారికి బిగ్ బాస్ వాళ్ళు ఒక వారానికి రెమ్యునరేషన్ అనేలా డీల్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మొదటి కేటగిరిలో ఉన్నటువంటి లోబో, యాంకర్ రవి, అని మాస్టర్, షణ్ముఖ్ జశ్వంత్ వడ్డీ సెలబ్రిటీలకు దాదాపు నాలుగు లక్షల వరకు ముట్ట చెబుతున్నట్లు సమాచారం. ఈ పేమెంట్స్ కేవలం ఒక వారానికి మాత్రమే. అయితే ఎంటర్టైన్మెంట్ డోస్ పెంచిన వారికి ముందు ముందు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

  రెండవ క్యాటగిరిలో ఉన్నవారికి

  రెండవ క్యాటగిరిలో ఉన్నవారికి

  బిగ్ బాస్ నిర్వాహకులు కంటెస్టెంట్స్ తో చాలా కష్టమైన టాస్కూలు ఇవ్వడానికి సిద్ధం అవుతారు కాబట్టి ప్రిపరేషన్ విషయంలో అయితే వారిని పూర్తిగా సంతృప్తిపరిచే విధంగా డీల్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. భారీ ఆదాయం దక్కితే ఎవరైనా సరే షోలో వారి విశ్వరూపాన్ని చూపించడానికి వీలుగా ఉంటుంది. అందుకే స్టార్ మా నిర్వాహకులు ఆ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదట. సెకండ్ క్యాటగిరిలో సీనియర్ యాక్టర్ ఉమా దేవి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియా రామచంద్ర వంటి వారికి వారానికి లక్ష నుంచి రెండు లక్షల వరకు ఇస్తున్నట్లు సమాచారం.

  #5MuchDrama between #Lobo & #Siri also between #Kajal & #Lahari
  వారికి మాత్రం చాలా తక్కువగా..

  వారికి మాత్రం చాలా తక్కువగా..

  ఇక మిగతా కంటెస్టెంట్స్ VJ సన్నీ, విశ్వ, నటరాజ్ మాస్టర్, సరయు, శ్వేత వర్మ, వంటి వారికి ఒక వారానికి రూ. 40వేల నుంచి 60 వేల వరకు చెల్లిస్తున్నట్లు సమాచారం. టాస్క్ ల విషయంలో ఎవరు కూడా అస్సలు తగ్గకూడదని కారణం చేత బిగ్ బాస్ నిర్వహకులు కొందరికి అడిగినంత ఇస్తున్నట్లు సమాచారం. ఇక షోకు ఎవరివల్ల అయినా సరే రేటింగ్ పెరిగితే వారి ఆదాయాన్ని పెంచే విధంగా మరొక ఆఫర్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారట. మరి ఫైనల్ వరకు ఎవరెవరు నిలుస్తారో తెలియాలి అంటే మరికొన్ని రోజుల వరకు ఆగాల్సిందే.

  English summary
  Bigg boss telugu 5 contestants total salary details
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X