For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 5: నాగార్జున కు అడ్డంగా దొరికిన కాజల్.. గర్ల్ ఫ్రెండ్ ఎవరో ఒప్పేసుకున్న షన్ను!

  |

  తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ మొదటి వారం విజయవంతంగా పూర్తి అయ్యి చివరి అంకానికి చేరుకుంది. ఆదివారం నాడు షో మొదలు కాగా ఇప్పటికి ఐదు రోజులు పూర్తయ్యాయి. ఇక ఈ రోజు శనివారం కావడంతో ప్రతి రోజు ప్రసారమయ్యే దానికంటే ఒక గంట ముందుగానే ప్రసారమైంది బిగ్ బాస్. ఇక ఈ రోజు నాగార్జున షో హోస్ట్ గా హాజరు కావడంతో హౌస్ మేట్స్ అందరిలో ఆసక్తి నెలకొంది. నాగార్జున పలు వివరాలు వెలుగులోకి తీసుకువచ్చారు. నాగార్జున హాజరైన మొదటి శనివారం హౌస్ ఎలా సాగింది అనే వివరాల్లోకి వెళితే

  జైల్లో ఏడ్చిన జెస్సి

  జైల్లో ఏడ్చిన జెస్సి


  హౌస్ లోకి ఎంటర్ అయిన నాగార్జున శుక్రవారం నాడు ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అని చెబుతూ ప్రేక్షకులతో కలిసి హౌస్ లో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పలు ఆసక్తికర సన్నివేశాలు కనిపించాయి. హౌస్ మేట్స్ అందరూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ వారి వారి మధ్య ఉన్న సమస్యలను క్లియర్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపించారు. ఎవరైనా ఏమైనా అంటే బాధపడతారు అనే ఉద్దేశంతో మళ్ళీ వారితో వెళ్లి మాట్లాడుతున్నట్లుగా కనిపించింది. అయితే ఎప్పటిలాగే జెస్సీ జైలులో ఉన్నప్పుడు సరయూ తనను కావాలనే ఇరికించింది అని సిరికి, కాజల్ కి చెబుతూ కన్నీళ్ళ పర్యంతం అవుతాడు.

  బిడ్డకు విడుదల

  బిడ్డకు విడుదల

  ఈ విషయం తెలుసుకున్న సరయు కూడా అక్కడికి వెళ్లి మాట్లాడుతుంది. అసలు నీ ప్రాబ్లం ఏమిటి అని అడుగగా నేను మా ఇంట్లో అక్కతో ఎలా మాట్లాడానో నీతో కూడా అలాగే మాట్లాడానని కాకపోతే నువ్వే దానిని తీసుకోలేకపోయావు అని అంటాడు. మీరు కనుక నాకు చెప్పి ఉంటే ఇది రిపీట్ అయ్యే అవకాశం ఉండి ఉండకపోవచ్చు అని అంటాడు. అయితే ఎట్టకేలకు జెస్సీకి జైలు నుంచి విడుదల లభిస్తుంది. ఇక నాగార్జున వచ్చే సమయం కావడంతో హౌస్ మేట్స్ అందరు కూడా నీట్ గా రెడీ అయ్యి నాగార్జున కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక అసలు పంచాయతీ మొదలు పెట్టిన నాగార్జున మొదటి వారం కావడంతో కాస్త లైట్ గానే వదిలేద్దాం అని అంటాడు.

  ధైర్యం చెబుతూ - దండిస్తూ

  ధైర్యం చెబుతూ - దండిస్తూ

  ముందుగా ఆనీ మాస్టర్ తో మొదలు పెట్టి ప్రతి ఒక్కరిని హౌస్ లో ఎలా గడిచింది అనే విషయాల మీద ప్రశ్నలు సంధించారు నాగార్జున. చివరిగా జెస్సీ విషయంలో కూడా ఆయన టెన్షన్ పడవద్దు అని జేస్సీకీ అభయం చెప్పాడు. కొన్ని కొన్ని సందర్భాలలో తనకు ఏం చేయాలో అర్థం కావడం లేదని తెగేసి చెప్పడంతో అన్ని విషయాల్లోనూ ధైర్యంగా ఉండాలని నాగార్జున ధైర్యం చెప్పాడు. ఇక ఆ తరువాత అసలైన ఆట మొదలు పెట్టాడు. కాజల్ నీకు వంట రాదా? అని అడిగితే నాకు రాదు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. నాకు ఏదైతే విషయం మీద పట్టు ఉందో ఆ విషయం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని భావిస్తున్నాను అని ఆమె చెప్పే ప్రయత్నం చేస్తుంది.

  దొంగ దొరికిపోయావు

  దొంగ దొరికిపోయావు

  అయితే అందుకు నాగార్జున కౌంటర్ వేస్తూ నువ్వు ఇలా అంటున్నానని నీ ఇంస్టాగ్రామ్ చెక్ చేశాను అందులో అన్ని వంటలే కదా నువ్వు దొంగవి అన్నట్టుగా మాట్లాడి షాకిచ్చాడు. అయితే దానిని కూడా కాజల్ కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది. తాను లాక్డౌన్ సమయంలో ఇంట్లో ఏం చేయాలో తెలియక కొన్ని వీడియోలు చూసి ఆ వంటలు చేసి వీడియోలు గా మార్చి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశానని అంటుంది. అయితే ఇప్పుడు వీళ్ళు కూడా మీకు సహాయం చేస్తారు ఇక మీద వంట మీద దృష్టి పెట్టండి అన్నట్లుగా నాగార్జున వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఈ వ్యవహారం గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ నిర్వాహకులు సోషల్ మీడియాను కూడా బాగా ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది.

  ఎవరు సెట్ ఎవరు కట్

  ఎవరు సెట్ ఎవరు కట్


  ఇక మరో పక్క హౌస్ లో ఎవరు సెట్ ఎవరు కట్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకువచ్చారు. ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఏర్పాటు చేసి ఎవరితో బాండింగ్ ఏర్పడిందో వాళ్ళకి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టమని చెబుతారు. అలాగే ఎవరు నచ్చలేదో వాళ్ళ ఫోటో చింపేయాలని కోరతారు. ఈ వ్యవహారం కూడా ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఎక్కువ మందికి కాజల్ టార్గెట్గా మారారు. అయితే ఈ వ్యవహారంలో కూడా సిరి అలాగే సరియు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సరయు తనకు ఎవరూ నచ్చలేదని తనకుతానే కట్టుకుంటా అని చెప్పి చేతికి బ్యాండ్ వేసుకుంటుంది. అంతే కాక తనకు సిరి నచ్చలేదని చెప్పి అందరి సపోర్ట్ తో ఆట ఆడడం కాదు దమ్ముంటే ఎలాంటి సపోర్టు లేకుండా ఆట ఆడాలని డిమాండ్ చేస్తుంది.

  ఏడ్చేసిన సిరి

  ఏడ్చేసిన సిరి

  అయితే అసలు తను హౌస్ కెప్టెన్ అవ్వాలని ఉద్దేశం తనకు లేదని వాళ్లంతట వాళ్లే సపోర్ట్ చేస్తే నేనేం చేయాలని సిరి ప్రశ్నిస్తూ ఏడ్చేచేస్తుంది. మళ్లీ సరయు కల్పించుకుని నువ్వు అంతా ముందు సెట్ చేసుకుని వచ్చి తర్వాత గేమ్ ప్లాన్ వర్క్ అవుట్ చేస్తే ఉపయోగం లేదు అన్నట్లుగా మాట్లాడుతుంది. దీంతో నాగార్జున ఈ విషయాన్ని సద్దుమణిగేలా చేశారు. ఇక ఆ తర్వాత షణ్ముఖ్ జస్వంత్ తన గర్ల్ ఫ్రెండ్ విషయం కూడా వెలుగులోకి వచ్చింది. అసలు ఎవరు ఈ గర్ల్ ఫ్రెండ్ అని నాగార్జున అడగడంతో స్వయంగా షణ్ముఖ్ జస్వంత్ దీప్తి సునైనా అని ఒప్పుకున్నాడు. ఇక ఆరుగురు ఎలిమినేషన్ ప్రక్రియకు దగ్గరగా ఉండగా అందులో రవి, హమీద ఇద్దరు ఈరోజు ఎపిసోడ్ లో సేఫ్ అయ్యారు. మిగతా నలుగురు రేపు ఎలిమినేషన్ రౌండ్ లో ఎవరు ఎలిమినేట్ అవుతున్నాతో చూడాల్సి ఉంది.

  English summary
  bigg Boss Telugu 5 entered into its first weekend, host Nagarjuna hosted the Saturday episode to chill up the contestants in house.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X