twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 5 కంటెస్టెంట్లకు ఇలా ఓటు చేయండి.. మీ ఫేవరేట్‌ను ఎలా సేఫ్ చేయాలంటే?

    |

    బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఇక ఆట జోరు కొనసాగుతుండగానే.. ఇంటి నుంచి కంటెస్టెంట్లను పంపించే వేట కూడా వెంటనే మొదలుపెట్టారు. తొలి వారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఆరుగురు నిలవడంతో ఈ వారం నామినేషన్, ఓటింగ్ వ్యవహరం క్రేజీగా మారింది. తొలివారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఉన్న కంటెస్టెంట్లకు ఎలా ఓటింగ్ వేయాలంటే..

    తొలివారంలో ఆరుగురిపై ఎలిమినేషన్ కత్తి

    తొలివారంలో ఆరుగురిపై ఎలిమినేషన్ కత్తి

    తొలివారంలో యాంకర్ రవి, ఆర్జే కాజల్, హమీదా, సరయు, జస్వంత్, మానస్‌ నామినేట్ అయ్యారు. ప్రస్తుత బిగ్‌బాస్‌లో ఈ ఆరుగురు కూడా టాప్ సెలబ్రిటీలు కావడం, అలాగే వారికి వ్యక్తిగతంగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా టాప్ ఫాలోయింగ్ ఉండటంతో ఎవరు సేఫ్ అవుతారనే విషయం ఆసక్తిగా మారింది. మీకు నచ్చిన కంటెస్టెంట్లను రక్షించుకోవాలంటే అభిమానులు ఎలా ఓటింగ్ చేయాలంటే..

    రెండు పద్దతుల ద్వారా ఓటింగ్

    రెండు పద్దతుల ద్వారా ఓటింగ్

    బిగ్‌బాస్ తెలుగు 5 షోలో ఎలిమినేషన్ కోసం నామినేట్ అయిన వారికి ఓటు వేయడానికి నిర్వాహకులు రెండు రకాల పద్దతులను అనుసరిస్తున్నారు. డిస్నీ+హాట్ స్టార్ యాప్ నుంచి ఓటు చేయడం ఒక పద్దతి అయితే.. కంటెస్టెంట్లకు కేటాయించిన టోల్ ఫ్రీ నంబర్ ద్వారా మిస్ కాల్ ఇవ్వడం రెండో పద్దతిగా నిర్ణయించారు.

    డిస్నీ+హాట్ స్టార్ యాప్‌ ద్వారా

    డిస్నీ+హాట్ స్టార్ యాప్‌ ద్వారా

    బిగ్‌బాస్ తెలుగు 5 నామినేషన్లలో ఉన్న కంటెస్టెంట్లకు ఓటు వేసి సేవ్ చేయడానికి డిస్నీ+హాట్ స్టార్‌ యాప్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. యాప్‌లో బిగ్‌బాస్ తెలుగు షోకు సంబంధించిన వివరాలు ఉంటాయి. బిగ్‌బాస్ కు సంబంధించిన లేటేస్ట్ ఎపిసోడ్ క్లిక్ చేస్తే అందులో Vote ని కనిపిస్తుంది. Voting for Today is now open అనే మెసేజ్ కనిపిస్తుంది. దానికి క్లిక్ చేస్తే మీరు కొత్త యూజర్ అయితే లాగిన్ చేసుకోమని అడుగుతుంది. అల్రెడీ మీరు యూజర్ అయి ఉంటే.. మీకు డైరెక్ట్‌గా నామినేషన్‌లో ఉన్న కంటెస్టెంట్ల ఫోటోలు కనిపిస్తాయి. మీకు ఇష్టం ఉన్న వ్యక్తులను ఎంచుకొని ఓటు చేయాల్సి ఉంటుంది.

    టోల్ ఫ్రీ నంబర్‌తో మిస్ కాల్ ద్వారా

    టోల్ ఫ్రీ నంబర్‌తో మిస్ కాల్ ద్వారా

    ఇక రెండో పద్దతిన నేరుగా మీ మొబైల్ ద్వారా ఆయ కంటెస్టెంట్లకు సంబంధించిన టోల్ ఫ్రీ నంబర్లకు మిస్ కాల్‌కు ఇవ్వవచ్చు.
    1. యాంకర్ రవికి ఓటు వేయాలంటే 8886658219 మొబైల్ నంబర్‌కు డయల్ చేసి మిస్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది.
    2. ఆర్జే కాజల్‌కు ఓటు వేయాలంటే.. 8886658217 మొబైల్ నంబర్‌కు డయల్ చేసి మిస్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది.
    3. రోయిన్ హమీదాకు ఓటు వేయాలంటే.. 8886658211 మొబైల్ నంబర్‌కు డయల్ చేసి మిస్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది.
    4. కంటెస్టెంట్ 7 ఆర్ట్స్ సరయుకు ఓటు వేయాలంటే.. 8886658213 మొబైల్ నంబర్‌కు డయల్ చేసి మిస్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది.
    5. మోడల్ జస్వంత్‌కు ఓటు వేయాలంటే.. 8886658208 మొబైల్ నంబర్‌కు డయల్ చేసి మిస్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది.
    6. యాక్టర్ మానస్‌కు ఓటు వేయాలంటే.. 8886658216 మొబైల్ నంబర్‌కు డయల్ చేసి మిస్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది.

    Recommended Video

    Maha Samudram Movie Team On 'Cheppake Cheppake' Song
    ప్రస్తుతం నమోదైన ఓటింగ్

    ప్రస్తుతం నమోదైన ఓటింగ్

    లేటేస్ట్ ఓటింగ్ నమోదైన ప్రకారం.. యాంకర్ రవి 30 శాతం ఓట్లతో మొదటి స్థానంలో ఉన్నారు. మానస్ 20 శాతం ఓట్లతో రెండోస్థానంలో, ఆర్జే కాజల్ 15 శాతానికి పైగా ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. జస్వంత్ పడాలా నాలుగో స్థానంలో, హమీతా ఖాతూన్ ఐదో స్థానంలో, సరయూ ఆరో స్థానంలో నిలిచినట్టు తెలుస్తున్నది.

    English summary
    bigg boss telugu 5 vote: Disney+ Hot star app and Missed call option with Toll free mobile numbers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X