For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 5: దేశవ్యాప్తంగా క్రేజ్ అందుకున్న టాప్ సింగర్.. మళ్ళీ ఇన్నాళ్లకు కంటెస్టెంట్ గా..

  |

  బిగ్ బాస్ తెలుగు సీజన్ కోసం ఓ వర్గం ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గడిచిన నాలుగు సీజన్స్ కూడా బుల్లితెరపై భారీ స్థాయిలో క్రేజ్ అందుకున్నాయి. మొదట్లో ఈ షో అసలు తెలుగులో హిట్ అవుతుందా లేదా అనే అనుమానాలు చాలానే వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ స్టార్ డమ్ తో మొదట్లోనే చాలా బలంగా పునాది వేశాడు. దీంతో ఆ తర్వాత అదే స్థాయిలో నాని నాగార్జున కూడా బిగ్ బాస్ స్థాయిని మరింత పెంచేశారు.

  అయితే అందరికంటే ఎక్కువగా నాగార్జున ఇదివరకే రెండు సీజన్స్ కు హోస్ట్ గా వ్యవహరించి మంచి గుర్తింపు అందుకున్నాడు. మరో సీజన్ కు కూడా ఆయనే హోస్ట్ గా ఉండబోతున్నట్లు ఒక ప్రోమో ద్వారా క్లారిటీ ఇచ్చేశారు. ఇక ఈ సారి అయితే షో చాలా విభిన్నంగా ఉండబోతోందని తెలుస్తోంది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతుంది. దేశవ్యాప్తంగా గుర్తింపు అందుకున్న ఒక స్టార్ సింగర్ కూడా ఈసారి కంటెస్టెంట్ గా పాల్గొన్నట్లు తెలుస్తోంది.

  హోస్ట్ కోసం.. స్టార్ హీరోలతో సంప్రదింపులు

  హోస్ట్ కోసం.. స్టార్ హీరోలతో సంప్రదింపులు

  బిగ్ బాస్ సీజన్ 5 కోసం మొదట చాలామంది హీరోలతో సంప్రదింపులు జరిపారు. ఎందుకంటే ఈసారి నాగార్జున రాకపోవచ్చని అనుకున్నారట. నాగ్ కూడా కుదరకపోవచ్చని కొంత అనుమానాలు వ్యక్తం చేశారట. దీంతో రానా దగ్గుబాటి వంటి వారిని కూడా సెలెక్ట్ చేసుకోవాలని అనుకున్నారు. కానీ మళ్ళీ నాగార్జున ట్రాక్ లోకి రావడంతో నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే గత రెండు సీజన్స్ కు భారీ స్థాయిలో రేటింగ్స్ రావడానికి నాగార్జున ఎంతగానో హెల్ప్ అయ్యారు. అందుకే నాగార్జునను ఐదో సీజన్ కు కూడా హోస్ట్ గా ఫిక్స్ చేశారు.

  కంటెస్టెంట్స్ లిస్ట్..

  కంటెస్టెంట్స్ లిస్ట్..

  బిగ్ బాస్ సీజన్ 5కు సంబంధించిన కొన్ని ప్రోమోలను రీసెంట్ గా విడుదలైన విషయం తెలిసిందే. ప్రోమోలతో అయితే నాగార్జున మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. షోలో కంటెస్టెంట్స్ గా ఎవరెవరు పాల్గొంటారు అనేది ఎంతో ఆసక్తిగా మారింది. గత కొన్ని రోజుకుగా 20 మందికి పైగా కంటెస్టెంట్స్ ల పేర్లు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యూ ట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్, యాంకర్ రవి, ఇషా చావ్లా, సురేఖ వాణి వంటి వారు కూడా ఉన్నట్లు టాక్ వస్తోంది. ఈ సెలబ్రిటీలు నిత్యం ఎంటర్టైన్మెంట్ వరల్డ్ లో బిజీగా ఉండేవారు. కాబట్టి తప్పకుండా షోకు ఈసారి భారీ స్థాయిలో క్రేజ్ రావడం పక్కా అని చెప్పవచ్చు.

  భారీగా రెమ్యునరేషన్

  భారీగా రెమ్యునరేషన్

  అయితే కొందరికి మాత్రం అడిగినంత పారితోషికం ఇవ్వడానికి నిర్వాహకులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ 5 తెలుగు సెప్టెంబర్ నెలలో ప్రారంభమవుతుందని సమాచారం.

  బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం ఆల్ మోస్ట్ కంటెస్టెంట్స్ లిస్టును ఒకే చేసినట్లు అయితే టాక్ వస్తోంది. ఇక ఈ రియాలిటీ షో కోసం ఇప్పటికే కొంతమంది కంటెస్టెంట్స్ ను క్వారంటైన్ లోకి పంపినట్లు సమాచారం.

  స్టార్ సింగర్ శ్రీరామ చంద్ర

  స్టార్ సింగర్ శ్రీరామ చంద్ర

  ఇక ప్రస్తుతం ఒక స్టార్ సింగర్ పేరు కూడా గట్టిగానే వైరల్ అవుతోంది. 2013 లో ఇండియన్ ఐడల్ టైటిల్ గెలుచుకున్న యువ తెలుగు ప్లేబ్యాక్ సింగర్ శ్రీరామ చంద్ర బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో కంటెస్టెంట్ గా కూడా పాల్గొంటారట. కేవలం పాడటమే కాకుండా, శ్రీరామ చంద్ర పలు సినిమాల్లో మంచి నటనతో మెప్పించాడు కూడా. శ్రీ జగద్గురు ఆది వంటి సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించాడు.

  English summary
  Bigg Boss Telugu 5: Indian Idol sri ramachandra winner to enter the house
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X