For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: షో చరిత్రలోనే తొలిసారి.. ఆ కంటెస్టెంట్ చెత్త రికార్డు.. ఇలా అయితే ఎలిమినేషన్ తప్పదా!

  |

  గతంలో ఎన్నడూ చూడని కంటెంట్.. సరికొత్త టాస్కులు.. కంటెస్టెంట్ల మధ్య గొడవలు.. గ్రూపు తగాదాలు.. ప్రేమ కహానీలు.. అప్పుడప్పుడూ రొమాన్స్ వీటన్నింటి కలయికే బిగ్ బాస్ షో. తెలుగు బుల్లితెర చరిత్రలోనే భారీ స్థాయిలో ప్రేక్షకాదరణు అందుకున్న కార్యక్రమంగా రికార్డులు క్రియేట్ చేసిందిది. ఇలా ఒకటి కాదు రెండు ఏకంగా నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. దీంతో ఎన్నో అరుదైన ఘనతలను కూడా అందుకుంది. ఇక, ఇటీవలే మొదలైన ఐదో సీజన్ కూడా ఆసక్తికరంగానే సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా బిగ్ బాస్ షోలో ఊహించని పరిణామం జరిగింది. దీంతో ఓ కంటెస్టెంట్ బలవ్వాల్సి వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

   ఎలా అనుకున్నారో.. అలాగే మొదలు

  ఎలా అనుకున్నారో.. అలాగే మొదలు

  బిగ్ బాస్‌కు తెలుగులో దక్కేంత ఆదరణ మరే భాషలోనూ రావడం లేదు. అందుకే గతంలో వచ్చిన నాలుగు సీజన్లు సూపర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఇటీవలే మొదలైన ఐదో సీజన్‌లో మరింత మజాను అందించబోతున్నారు. అంచనాలకు అనుగుణంగానే సరికొత్త టాస్కులు, రొమాన్స్, లవ్, ఎమోషన్స్, గొడవలు ఇలా ఎన్నో రకాల అంశాలతో షోను ఆసక్తికరంగా మార్చేశారు.

  షర్ట్ విప్పేసి షాకిచ్చిన బిగ్ బాస్ సరయు: బ్రాతో ఘాటు ఫోజులిస్తూ.. వామ్మో చూస్తే తట్టుకోలేరు

  ఫోకస్ అయిన కంటెస్టెంట్లలో అతడు

  ఫోకస్ అయిన కంటెస్టెంట్లలో అతడు

  ఐదో సీజన్‌లో 19 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. వారిలో ఎక్కువ మంది పాపులర్ అయిన వాళ్లే ఉన్నారు. తమ తమ విభాగాల్లో పలువురు మంచి గుర్తింపును దక్కించుకున్న వాళ్లు వచ్చారు. అందులో కొందరు మాత్రమే స్పెషల్ అట్రాక్షన్‌ అయ్యారు. వారిలో ప్రముఖ మోడల్ జస్వంత్ పడాల అలియాస్ జెస్సీ ఒకడు. ఆరంభంలోనే అతడు బాగా ఫోకస్ అయిపోయాడు.

  ఆ గొడవతో కామ్.. వరస్ట్ పెర్ఫార్మర్‌గా

  ఆ గొడవతో కామ్.. వరస్ట్ పెర్ఫార్మర్‌గా

  సీజన్ ఆరంభంలోనే మంచి గుర్తింపును అందుకున్న జస్వంత్ పడాల.. మొదటి వారంలో ఆనీ మాస్టర్‌తో గొడవ పడిన తీరుతో విమర్శలను ఎదుర్కొన్నాడు. దీంతో ఆ తర్వాత అతడు చాలా సైలెంట్ అయిపోయింది. టాస్కుల్లో కూడా సరిగా ఆడలేకపోయాడు. దీంతో అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ కారణంతోనే అతడిని చెత్త ఆటగాడి ఎంచుకుని జైలుకు పంపారు.

  మహేశ్ బాబు కోసం రాజమౌళి డేరింగ్ స్టెప్: స్టోరీ విషయంలో ప్లాన్ మార్చేసి.. స్వయంగా రంగంలోకి!

  విమర్శలకు అలా బదులిచ్చిన జెస్సీ

  విమర్శలకు అలా బదులిచ్చిన జెస్సీ

  గత వారం 'అమెరికా అబ్బాయి.. హైదరాబాద్ అమ్మాయి' టాస్క్ జరిగింది. ఇందులో చక్కగా ఆడిన కంటెస్టెంట్లు కెప్టెన్సీ టాస్కుకు ఎంపికయ్యారు. అందులో జస్వంత్ పడాల ఒకడు. రవి, శ్వేత వర్మ, శ్రీరామ చంద్రలతో కలిసి కెప్టెన్సీ కోసం పోటీ పడిన అతడు.. ఊహించని విధంగా విజయం సాధించాడు. తద్వారా తనపై వచ్చిన విమర్శలకు ఈ విధంగా సమాధానం చెప్పాడతను.

  కంటెస్టెంట్ల తప్పులతో జెస్సీకి దెబ్బ

  కంటెస్టెంట్ల తప్పులతో జెస్సీకి దెబ్బ

  గత వారం జస్వంత్ పడాల కెప్టెన్ అయిన తర్వాత కంటెస్టెంట్లు అందరూ అతడిని లైట్ తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా కెమెరాలకు కనిపించే విధంగా పొరపాట్లు కూడా చేశారు. దీంతో పలుమార్లు బిగ్ బాస్ నుంచి వార్నింగ్ వచ్చింది. ఫలితంగా తనను తానే స్వయంగా శిక్షించుకున్నాడు. ఆ తర్వాతా అలాగే జరగడంతో బరువు తగ్గే టాస్కు నుంచి ఎలిమినేట్ అయిపోయాడు.

  Bigg Boss: నాలుగో వారం ఆ ఇద్దరిలో ఒకరు ఔట్.. ఒక్కరోజులో మారిన ఓటింగ్.. టైటిల్ ఫేవరెట్లకు బిగ్ షాక్

  చెత్త పెర్ఫార్మర్‌గా ఎంపికైన జస్వంత్

  చెత్త పెర్ఫార్మర్‌గా ఎంపికైన జస్వంత్

  నాలుగో వారానికి సంబంధించి ఉత్తమ, చెత్త కంటెస్టెంట్లను ఎంచుకునే ప్రక్రియ శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది. ఇందులో చాలా మంది మానస్‌ను బెస్ట్ పెర్ఫార్మర్‌గా ఎంపిక చేసుకున్నారు. అదే సమయంలో జస్వంత్‌ను వరస్ట్ పెర్పార్మర్‌గా సెలెక్ట్ చేశారు. దీంతో అతడు మరోసారి జైలు పాలయ్యాడు. బిగ్ బాస్ షో చరిత్రలోనే రెండు సార్లు జైలుకెళ్లిన మొదటి కంటెస్టెంట్ జెస్సీనే.

  ఇలా అయితే ఎలిమినేషన్ తప్పదా!

  ఇలా అయితే ఎలిమినేషన్ తప్పదా!

  వాస్తవానికి జస్వంత్‌ పడాల కెప్టెన్‌గా హౌస్‌ను చక్కగా నడిపించడానికి ప్రయత్నించాడు. కానీ, కంటెస్టెంట్లు అందరూ కావాలనే తప్పుల మీద తప్పులు చేసినట్లు కనిపించారు. వాళ్లు చేసిన పొరపాటుకు అతడు బలయ్యే పరిస్థితి వచ్చింది. కొందరైతే కావాలనే జెస్సీని టార్గెట్ చేసినట్లు కూడా అర్థం అయింది. ఇలా అయితే ఈ కుర్రాడు ఎలిమినేట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది.

  English summary
  Telugu Top Rreality TV Series Bigg Boss Recently Started 5th Season. In Recent Episode.. aswanth Padala Went to Jail for the Second Time.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X