For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg boss telugu 5: చీకట్లో టెన్షన్ పెట్టిన నాగార్జున.. ఎలిమినేషన్స్ లో న్యూ ట్విస్ట్!

  |

  బిగ్ బాస్ హౌస్ లో ఎప్పటికప్పుడు కంటెస్టెంట్స్ అందరూ కూడా ఊసరవెల్లి తరహాలో రంగులు బాగానే మారుస్తున్నారు. ఇప్పటికే నటరాజ్ మాస్టర్ హౌస్ లో ఒక గుంట నక్క ఉందని తేల్చి చెప్పేశారు. అయితే ఆ గుంటనక్క ఎవరు అనేది త్వరలోనే తెలుస్తుందని నాగార్జునకు వివరణ ఇచ్చారు. ఇక హౌస్ లో కూడా ఒక ఊసరవెల్లి దాక్కొని ఉందని చెప్పిన మాస్టారు త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయని కంటెస్టెంట్ కు ఝలక్ ఇచ్చాడు. ఇక ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. ఈరోజు ఇద్దరూ డేంజర్ జోన్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికీ ఒకరి పేరు సోషల్ మీడియాలో గట్టిగానే వైరల్ అవుతోంది. తప్పకుండా వారు వెళ్లి పోతారు అని జోరుగా కథనాలు కూడా వినబడుతున్నాయి. కొన్ని క్షణాల క్రితమే విడుదల చేసిన ప్రోమోలో కూడా ఎలిమినేషన్ చేసే ప్రక్రియతో నాగ్ అందరిని ఒక్కసారిగా భయపెట్టారని అనిపిస్తోంది.

   డేంజట్ జోన్ లో లహరి ప్రియ

  డేంజట్ జోన్ లో లహరి ప్రియ

  బిగ్ బాస్ హౌస్ లో ఎప్పటికప్పుడు వాతావరణం మారుతూనే ఉంటుంది. క్షణాల్లోనే కంటెస్టెంట్స్ మధ్యలో అభిప్రాయభేదాలు కూడా మారిపోతూ ఉంటాయి. ఇక ఎన్ని గొడవలు అయినా కూడా కంటెస్టెంట్స్ అందరూ నామినేషన్స్ లోని వారి పగను తీర్చుకుంటారు. టాస్క్ లో ఒకవేళ మిస్సయిన కూడా నామినేషన్ ఆయుధాలను గట్టిగానే వాడుతున్నారు. ఈ వారం ప్రియ, లహరి ఇద్దరు కూడా డేంజర్ జోన్ లో ఉన్నారు.

  బ్రతికిపోయినా ఆ ముగ్గురు

  బ్రతికిపోయినా ఆ ముగ్గురు

  ఈ వారం ఎలిమినేట్ అయ్యే ప్రక్రియలో మొదట మానస్, శ్రీ రామచంద్ర, ప్రియాంక, లహరి, ప్రియ నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఇక శనివారం రంగంలోకి దిగిన నాగార్జున మొదట ముగ్గురిని వివిధ ప్రక్రియలతో సేవ్ చేశారు. ఓట్ల లెక్కింపు ఆధారంగా ముగ్గురిని డేంజర్ నుంచి బయటకు లాగారు మిగిలిన ప్రియ, లహరి ఇద్దరు కూడా ఈరోజు నామినేషన్స్ చివరి ప్రక్రియను ఎదుర్కొంటున్నారు.

  చీకట్లో భయపెట్టిన నాగార్జున

  చీకట్లో భయపెట్టిన నాగార్జున


  నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో నాగార్జున చాలా డిఫరెంట్ గా ఎలిమినేషన్ ప్రక్రియను కొనసాగించనున్నారు. ముందుగా లైట్లు ఆఫ్ చేసే రెండు రెడ్ కలర్ లైట్లను చేతిలో పట్టుకున్నారు. ఇక ఆ రెండింటిలోనూ ప్రియ, లహరి పేర్లు రాసి ఉన్నాయి. రెండు లైట్లలో ముందుగా ఎవరి పేరు ఉన్న రెడ్ లైట్ వస్తుందో.. వారు ఈ వారం నుంచి సేవ్ అయినట్లు లెక్క. రెడ్ లైట్ ఉన్నవారు ఈరోజు ఇంటి నుంచి బయటకు వెళ్లి పోవాల్సి ఉంటుంది. హౌస్ లో బయట నుంచి వెళ్లిపోయింన ఒక సీన్ ను కూడా హైలెట్ చేశారు.

  Bigg Boss Telugu 5, Episode 19 Highlights || Filmibeat Telugu

  ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..

  అయితే గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం గ్లామర్ బ్యూటీ లహరి ఎలిమినెట్ అయినట్లు తెలుస్తోంది. గతవారం లహరి రవి ప్రియ వివాదంలో బాగానే హైలెట్ అయ్యింది. కానీ రవి ప్లాన్ వలన ఆమె ఆర్టిస్ట్ ప్రియను తప్పుగా అర్థం చేసుకొని గొడవ కూడా పెట్టుకుంది. యాంకరింగ్ అవకాశం కోసమే రవి వెనకాల పడుతున్నట్లు సీన్ క్రియేట్ అవ్వడం అందరినీ షాక్ కు గురి చేసింది. అలాగే బాత్ రూమ్ దగ్గర లైట్ ఆఫ్ చేసుకుని హగ్ చేసుకోవడం కూడా జరిగిందని ప్రియ చేసిన కామెంట్స్ కూడా వైరల్ అయ్యాయి. ఆ సీన్ వల్లనే లహరి బాగా హైలెట్ అయ్యింది. అయినప్పటికీ ఆమె శనివారం హౌస్ లో నుంచి బయటకు వెళ్లి పోయే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఈ ఊహగానాలు ఎంత వరకు నిజం అవుతాయో చూడాలి.

  English summary
  Bigg boss telugu 5 latest promo priya lahari eliminating process,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X