For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg boss Telugu 5: మరో పెద్ద చిచ్చు మొదలైంది.. వరస్ట్ పెర్ఫార్మర్ ఎవరు.. కాజల్ vs ప్రియ మాటల యుద్ధం!

  |

  బిగ్ బాస్ సీజన్ వన్ తెలుగు రియాల్టీ షో మెల్ల మెల్లగా ఎంటర్టైన్మెంట్ డోస్ ను పెంచుతోంది. నాగార్జున చెప్పినట్లుగానే ఈసారి 5 మచ్ ఫన్ అందించబోతున్నారు అని అర్థమవుతుంది. బిగ్ బాస్ కూడా కంటెస్టెంట్స్ మధ్యలో పెడుతునన్న టాస్క్ లు రోజు రోజుకు హౌస్ లో పరిస్థితులను ఒక్కసారిగా మార్చేస్తున్నాయి. కంటెస్టెంట్ మధ్య గొడవలు జరగడానికి పెద్దగా సమయం అయితే పట్టడంలేదు. మొన్నటివరకు కొంతవరకు లిమిట్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఫిజికల్ టాస్క్ లు వచ్చే సరికి ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.

  ఎవరికి వారు గాయాలను కూడా లెక్కచేయకుండా పోటీకి సిద్ధమవుతున్నారు. ఇక ఈ వారం కంటెస్టెంట్ మధ్య బిగ్ బాస్ మరికొంత చిచ్చు పెంచినట్లు అర్థమవుతోంది. ఈరోజు బిగ్ బాస్ వరస్ట్ పెర్ఫార్మర్ ను సెలెక్ట్ చేసుకోమ్మని చెప్పాడు. ఇక ప్రియా కాజల్ మధ్యలో కూడా మాటల యుద్ధాలు మొదలైనట్లు అర్థమవుతోంది.

  బాల్ పట్టు లగ్జరీ బడ్జెట్ కొట్టు

  బాల్ పట్టు లగ్జరీ బడ్జెట్ కొట్టు

  ఇక ఈ వారం టాస్క్ లో బాల్ పట్టు లగ్జరీ బడ్జెట్ కొట్టు అనే అతను మొదలుపెట్టిన బిగ్ బాస్ విభిన్నమైన వారికి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. కెప్టెన్ విశ్వ, లోబో కూడా పోటాపోటీగా లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో పోరాడినట్లు అర్థమవుతోంది. ఇక ఈసారి లగ్జరీ బడ్జెట్ లో ఎంతమంది సంతృప్తి చెందుతారు అనేది చూడాలి ఇదివరకే ఈ బడ్జెట్ టాస్క్ ల విషయంలో నట్రాజ్ మాస్టర్ రవితో గొడవ కూడా పెట్టుకున్నాడు. అలాగే మరికొందరు అసలు టాస్క్ లో ఛాన్స్ ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మరి ఈసారి ఎవరికీ అవకాశం ఇస్తారో చూడాలి.

  నటరాజ్ మాస్టర్ ఏమంటాడో?

  నటరాజ్ మాస్టర్ ఏమంటాడో?

  ఇక అందరూ సంతోషంగా ఉన్న సమయంలోనే అసలైన చిచ్చులు రాజేసే బిగ్ బాస్ వరస్ట్ పెర్ఫార్మర్ ఎవరు అనే విషయం లో కూడా ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు. ఇంట్లో వాళ్ళు అందరూ కలిసి ఏకాభిప్రాయంతో ఈ వారం వరస్ట్ పెర్ఫార్మర్ ఎవరు అనేది బిగ్ బాస్ కు చెప్పాలని తెలియజేశాడు. ఇక మొదట సన్ని నటరాజు మాస్టర్ సెలెక్ట్ చేసుకోవడంతోనే ఆట సరికొత్త మలుపు తిరగబోతోంది అని అర్థమవుతుంది. ఎందుకంటే నటరాజ్ మాస్టర్ ప్రతిసారి ఊహించని విధంగా షాక్ ఇస్తున్నాడు. మరి ఈసారి ఎలా కౌంటర్ ఇస్తాడో చూడాలి.

  ఇంత రాక్షసత్వంగా ఎవరూ ఆడరు

  ఇంత రాక్షసత్వంగా ఎవరూ ఆడరు

  ఇక సన్నిని, హామీదాకు మరో సారి గొడవ జరిగినట్లు అర్థమవుతోంది. ఇక విశ్వ ప్రియాంకను సెలక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రియాంక కూడా తను ఎంత మాత్రం వరస్ట్ అంటే ఒప్పుకోనని ఇతరులతో చెప్పడంతో మరింత హాట్ టాపిక్ గా మారింది. ఇక మరోసారి శ్వేత కూడా సున్నితంగా తన శత్రువులకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆమె ఎక్కువగా సిరిని ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇంత రాక్షసత్వంగా ఎవరూ ఆడరు అంటూ కౌంటర్ కూడా ఇచ్చింది.

  ప్రియ vs కాజల్

  ప్రియ vs కాజల్

  ఇక ఇదివరకే ఫిజికల్ టాస్క్ లో రవి రామచంద్రల మధ్య గొడవలు అయితే గట్టిగానే జరిగాయి. దీంతో ఇద్దరూ ఒకరినొకరు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉన్నట్లు అర్థమవుతోంది. ఈ సెలక్షన్ విషయాన్ని పక్కన పెడితే కాజల్ మరోసారి ఒక గొడవతో హౌస్ లో హాట్ టాపిక్ గా నిలిచింది. ప్రియతో ఆమె ఒక్కసారిగా వాగ్వివాదానికి దిగింది. సంబంధం లేని విషయాలను చెప్పడంతో దానికి దీనికి సంబంధం లేదు అంటూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా చేసింది.

  Maro Prasthanam Movie Team Chit Chat | Tanish, Muskan Sethi

  కాజల్ తప్పుడు స్ట్రాటజీ అంటూ..

  నీకు సంస్కారం ఉందని నేను అనుకునే దాన్ని అంటూ ప్రియ కౌంటర్ ఇవ్వగా మళ్లీ అదే తరహాలో కాజల్ కూడా నేను కూడా మీ సంస్కారానికి వదిలేస్తున్నాను అంటూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. మళ్లీ అది తప్పుడు స్ట్రాటజీ అంటూ ప్రియ గట్టిగా అరిచేసింది. అంతేకాకుండా అబద్ధాన్ని కూడా నిక్కచ్చిగా చెబుతావు అంటూ అది చాలా తప్పు అనే ప్రియా హెచ్చరిక జారీ చేసింది. అసలు వీరి మధ్య గొడవ ఎందుకు మొదలైంది అనేది తెలియాలి అంటే ఈరోజు ఫుల్ ఎపిసోడ్ పై ఒక లుక్ వేయాల్సిందే.

  English summary
  Bigg boss telugu 5 latest promo second week worst performer selection
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X