For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 5: ఇయనలాంటోడే ఏం చేయలేక మంగళవారం అన్నాడంటా.. లోబో హాట్ సెటైర్లు

  |

  డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న రోబో ప్రతి రోజు ఏదో ఒక విషయం తో హైలెట్ అవుతున్నాడు. బిగ్ బాస్ సీజన్ 5 లో ఎంటర్టైన్మెంట్ బాధ్యతలు ఎక్కువగా అతనే తీసుకున్నట్లుగా అర్థమవుతోంది. అతను ఏం మాట్లాడినా కూడా హౌస్ లో అందరు నవ్వుతున్నారు. అంతే కాకుండా కొన్ని సార్లు లోబో కాస్త సీరియస్ కూడా అవుతున్నాడు. ఇక అతను వేస్తున్న డబుల్ మీనింగ్ సెటైర్లు కూడా హైలెట్ అవుతూ వస్తున్నాయి. రీసెంట్ గా బాత్రూంలు కడుగుతున్న లోబో ఎవరూ ఊహించని విధంగా ఒక మాట అనేశాడు. షణ్ముఖ్ మధ్యలో వచ్చిన తను కూడా అతను ఏమాత్రం లెక్క చేయలేదు. ఇంట్లో వాళ్లందరికీ కూడా లోగో ఒక హెచ్చరిక చేసే ప్రయత్నం కూడా చేశాడు.

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

   ఎక్కువ రోజులు కొనసాగే అవకాశం

  ఎక్కువ రోజులు కొనసాగే అవకాశం

  సినిమాల్లోనే కాకుండా టెలివిజన్ రంగంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నటువంటి లోబోకు అభిమానులు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఓ వర్గం యువతకు లోబో అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. సోషల్ మీడియాలో కూడా అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. కాబట్టి ఈసారి బిగ్ బాస్ హౌస్ లో అతను ఎక్కువ రోజులు కొనసాగే అవకాశం ఉంటుంది.

   ప్రియతో కనెక్ట్ అవ్వని లోబో

  ప్రియతో కనెక్ట్ అవ్వని లోబో

  లోబో తనదైన శైలిలో డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో ఇప్పటికే కంటెస్టెంట్స్ లను కూడా ఆకట్టుకున్నాడు. ఎలాంటి పని చేసినా కూడా కంటెస్టెంట్స్ అందరూ కూడా సరదాగానే తీసుకుంటున్నారు. కానీ కొందరు మాత్రం ఇంకా కనెక్ట్ కావడం లేదనే చెప్పాలి. సీనియర్ ఆర్టిస్ట్ ప్రియ కూడా ఇదివరకే లోబో బాషా తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నామినేట్ కూడా చేసింది. ఆ విషయంలో ఇద్దరికీ కొంత నిశ్శబ్ద యుద్ధం జరుగుతోందని చెప్పవచ్చు. స్మోకింగ్ జోన్ లో సరయుతో మాట్లాడుతూ.. ప్రియ అస్సలు కనెక్ట్ అవ్వడం లేదని లోబో కామెంట్ చేశాడు.

  మజాజ్ చేయకని షణ్ముఖ్ పై లోబో ఆగ్రహం

  మజాజ్ చేయకని షణ్ముఖ్ పై లోబో ఆగ్రహం

  ఇక బాత్రూం లో శుభ్రం చేస్తున్న సమయంలో లోబో కంటెస్టెంట్స్ ఎవరు కూడా సరైన పద్ధతిలో ఉండటం లేదని ఫిర్యాదు చేశాడు. ఎక్కడపడితే అక్కడ బట్టలు పడేస్తున్నారు అని ముఖ్యంగా బనీన్లు డ్రాయర్లు పద్ధతి లేకుండా పడేస్తున్నారు అని కంప్లీట్ చేశాడు. ఈ విషయంలో బిగ్ బాస్ సీరియస్ గా తీసుకోవాలని లోబో కెమెరా ముందు వివరణ ఇచ్చాడు. అదే సమయంలో యశ్వంత్ పక్కనే ఉండి నవ్వుతూ సలహా ఇస్తుండగా లోబో అప్సెట్ అయ్యాడు. మజాక్ చేయకు అంటూ స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చాడు.

   ఏం చేయలేక మంగళవారం అన్నాడంటా

  ఏం చేయలేక మంగళవారం అన్నాడంటా

  ఇక మాట్లాడుతున్న సమయంలోనే బాత్రూంలో కి అప్పుడే మానస్ వచ్చాడు. ఇక అతడిపై కూడా లోబో ఒక సెటైర్లు వేయడం హైలెట్ గా నిలిచింది. మాటల్లోనే ఈయనలాంటోడే ఏం చేయలేక మంగళవారం అన్నాడంటా.. అని ఒక డబుల్ మీనింగ్ డైలాగ్ కూడా వదిలాడు. అది అర్థం కాని మానస్ నవ్వుకుంటూ వెళ్లిపోయారు.

  కట్ చేసి పడేస్తా..

  కట్ చేసి పడేస్తా..

  ఇక ఆ తర్వాత లోబో కంటెస్టెంట్స్ బట్టలు ఎక్కడ పడితే అక్కడ వేయడంపై అందరికీ ఒక హెచ్చరిక చేశాడు. బట్టలు ఎలా పడితే అలా వేయవద్దని అందరూ మడత పెట్టుకోవాలని, అలాగే బయట ఆరవేసుకోవాలని అన్నాడు. ఇక బాత్రూమ్ లో అరవేసిన ఒక టవల్ ని ఇప్పటికే కట్ చేసి తుడవడానికి సెట్ చేసినట్లు చెప్పాడు. ఇక శ్వేతా ట్రాక్ పాయింట్ మడత పెట్టకుండా వేయడం లోబో ఆమెను కూడా హెచ్చరించారు. ఎక్కడ పడితే అలా పెడితే మరో ఈ సారి చింపేస్తాను అని కూడా లోబో వార్నింగ్ ఇచ్చాడు.

  #5MuchDrama between #Lobo & #Siri also between #Kajal & #Lahari

  English summary
  Bigg Boss Telugu 5 Lobo double meaning dialouges on actor maanas,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X