For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 5 నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్: అసలైంది రివీల్ చేసిన బిగ్ బాస్!

  |

  బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ షో ఆధారంగా ప్రారంభమైన కార్యక్రమమే 'బిగ్ బాస్'. హిందీలో ఎప్పుడో మొదలైన ఈ షో.. విజయవంతంగా సీజన్ల మీద సీజన్లు పూర్తి చేసుకుంటోంది. ఈ క్రమంలోనే మరికొన్ని భాషల్లోకి కూడా ఇది పరిచయం అయింది. ఐదేళ్ల క్రితం తెలుగులోకి వచ్చింది బిగ్ బాస్. దీనికి మన ప్రేక్షకులు భారీ స్థాయిలో స్పందనను అందించారు. దీంతో ఈ షో సూపర్ డూపర్ హిట్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో త్వరలోనే ఐదో సీజన్‌ను కూడా మొదలెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఆ సంగతులు మీకోసం!

  నాలుగు సీజన్లు.. ముగ్గురు హీరోలు

  నాలుగు సీజన్లు.. ముగ్గురు హీరోలు

  తెలుగులో బిగ్ బాస్ షో నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అందులో మొదటి దానిని ఎన్టీఆర్, రెండో నాని, మూడు, నాలుగు సీజన్లను అక్కినేని నాగార్జున హోస్ట్ చేశారు. ఇవన్నీ ఒక దానికి మించి ఒకటి సూపర్ హిట్ అయ్యాయి. అంతేకాదు, టీఆర్పీలో నేషనల్ రికార్డులు కూడా బద్దలయ్యాయి. దీంతో మన తెలుగు బిగ్ బాస్‌కు దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.

  డైరెక్టర్ సుకుమార్ గొప్ప మనసు: సొంత ఊరి కోసం చాలా మంచి పని.. జనసేన ఎమ్మెల్యేతో కలిసి ఇలా!

  ఐదో సీజన్‌కు లైన్ క్లియర్ అయింది

  ఐదో సీజన్‌కు లైన్ క్లియర్ అయింది

  తెలుగులో బిగ్ బాస్ మొదలైనప్పటి నుంచి ప్రతి ఏడాది షో జరుగుతోంది. అయితే, ఈ సారి కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇది జరిగే పరిస్థితులు లేవన్న టాక్ వినిపించింది. దీంతో అభిమానులంతా నిరాశకు లోనయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ ఐదో సీజన్ త్వరలోనే ప్రారంభం అవుతుందని తెలిసింది. దీనికి లైన్ క్లియర్ అవడంతో ఇప్పుడు ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు.

   కంటెస్టెంట్ల ఎంపిక.. ఈ సారి ఎక్కువ

  కంటెస్టెంట్ల ఎంపిక.. ఈ సారి ఎక్కువ

  కోవిడ్ పరిస్థితుల వల్ల బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఎంపిక ఎలా జరుగుతుందని అంతా అనుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. నిర్వహకులు దాదాపు 50 మందితో సంప్రదింపులు జరిపారట. అందులో షార్ట్ లిస్టును కూడా తయారు చేశారని తెలుస్తోంది. ఈ జాబితాలోని సభ్యులతో జూమ్ కాల్ ద్వారా ఇంటర్వ్యూలు జరిపారు. అందులో 18 మందిని ఎంపిక చేయనున్నారట.

  ఒక్కొక్క పేరు బయటకు... వీళ్లంతా

  ఒక్కొక్క పేరు బయటకు... వీళ్లంతా

  బిగ్ బాస్ షోపై వచ్చే ఊహాగానాలు మరే షోపై కనిపించవు. ఈ విషయం గతంలో చాలా సార్లు సుస్పష్టం అయింది. దీనికి కారణం సీక్రెట్‌గా ఉన్న విషయాలు లీక్ అవడమే. మరీ ముఖ్యంగా ఈ సీజన్‌లో సిరి హన్మంత్, నవ్య స్వామి, శ్రీహాన్, గీతా సింగ్, షణ్ముక్ జశ్వంత్, హేమచంద్ర, మంగ్లీ, జబర్ధస్త్ నరేష్, రఘు మాస్టర్, టిక్ టాక్ దుర్గారావు పాల్గొనబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

  బిగ్ బాస్ నుంచి అదిరిపోయే అప్డేట్

  బిగ్ బాస్ ఐదో సీజన్ ఎప్పుడు మొదలవుతుందా అని ప్రేక్షకులంతా వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. అదే సమయంలో దీనికి సంబంధించిన ఏదైనా అప్‌డేట్ వస్తే బాగుండు అని అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా బిగ్ బాస్ ఐదో సీజన్‌ నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. తాజాగా నిర్వహకులు ఓ వీడియోను విడుదల చేసి సీజన్‌పై ప్రకటన చేసేశారు.

  దివి వాద్యా ఎద భాగంలో టాటూ: అందాలను అలా చూపిస్తోన్న బిగ్ బాస్ బ్యూటీ

  అసలైనది రివీల్ చేసేసిన బిగ్ బాస్

  అసలైనది రివీల్ చేసేసిన బిగ్ బాస్

  బిగ్ బాస్ సీజన్‌ ఆరంభానికి ముందు లోగోను విడుదల చేస్తుంటారు. ప్రతి ఏడాది సరికొత్తగా దాన్ని డిజైన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఐదో సీజన్‌కు సంబంధించిన లోగోను స్టార్ మా విడుదల చేసింది. ఎంతో కొత్తగా కనిపించిన ఈ లోగో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలోనే త్వరలోనే వచ్చేస్తున్నాం అని ప్రకటించారు. దీంతో షో ప్రియులు పండుగ చేసుకుంటున్నారు.

  English summary
  Bigg Boss is the Telugu Top Rreality TV Series. This Show Makers Planing for 5th One. Now This Season Logo Was Released.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X