For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 5: అర్ధరాత్రి నా బెడ్ వరకు రా.. శ్రీరామచంద్రనీ రొమాన్స్‌తో ఇబ్బంది పెట్టిన కంటెస్టెంట్

  |

  బిగ్ బాస్ ఇంట్లో టాస్క్ లు గొడవలు ఎన్ని ఉన్నా కూడా రొమాన్స్ కేటగిరిలో కొంతమంది ఎక్కువగా క్రేజ్ అందుకుంటూ ఉంటారు. కెమిస్ట్రీ ఏ మాత్రం వర్కవుట్ అయినా కూడా కంటెస్టెంట్స్ ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకుంటారు. కేవలం బిగ్ బాస్ హౌస్ లోనే కాకుండా బయటకు వెళ్లిన తరువాత కూడా అదే తరహాలో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5లో కొందరి మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అవుతోంది. శత్రువులను ఇబ్బంది పెట్టడానికి కూడా అప్పుడప్పుడు రొమాన్స్ ఆయుధాన్ని బాగానే వాడుతున్నారు. గత కొన్ని రోజులుగా మనస్ శ్రీరామచంద్రల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే రీసెంట్ గా మానస్ మరోసారి తన ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టడం చాలా డిఫరెంట్ గా అనిపించింది. మరొక అమ్మాయిని ట్రాక్ లోకి తెచ్చి సింగర్ శ్రీరామచంద్రను కూడా దెబ్బ కొట్టిన విధానం హైలెట్ అవుతుంది. దానికి తోడు లహరి కూడా ఈ గేమ్ లో తనదైన శైలిలో ట్రాక్ ప్లే చేయడంతో ఆట మరో కీలక మలుపు తిరిగే అవకాశం ఉందని అర్థమవుతోంది.

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

  రొమాన్స్ ఉచ్చులో..

  రొమాన్స్ ఉచ్చులో..

  బిగ్ బాస్ హౌస్ లో పెళ్లి కానీ అమ్మాయి అబ్బాయిల మధ్య ఉండే కెమిస్ట్రీ మరో లెవెల్ లో ఉంటుంది ప్రతిసారి ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయితే కామన్ గా నడుస్తూ వస్తున్నదే. ఒక అమ్మాయి కారణంగా ఇద్దరు మగాళ్ళు అదేపనిగా కొట్టుకోవడం కంటిన్యూ అవుతోంది. ఇక ఈసారి కూడా ఆ ఉచ్చులో ఇరుక్కున్నది ఎవరనేది హాట్ టాపిక్ గా కనిపిస్తున్న సమయంలో మానస్ శ్రీరామచంద్ర మధ్య ఆట పోటాపోటీగా నిలిచే అవకాశం ఉన్నట్లు అనిపిస్తోంది. బిగ్ బాస్ ప్రణాళికలకు కూడా వారిద్దరూ బలిపశువులుగా మారే అవకాశం ఉన్నట్లు అర్థమవుతోంది.

  ప్లే బాయ్ తరహాలో..

  ప్లే బాయ్ తరహాలో..

  బిగ్బాస్ సీజన్ 5 మొదలైనప్పుడు కంటెస్టెంట్స్ విషయంలో ఆడియన్స్ కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈసారి కాస్త ఉన్నతమైన సెలబ్రిటీలతోనే బిగ్ బాస్ మొదలవుతుందని అందరూ అనుకున్నారు. కానీ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి కంటెస్తెంట్స్ విషయంలో నిర్వాహకులు నిరాశ పరిచారు అనే కామెంట్స్ బాగానే వచ్చాయి. అయినప్పటికీ బిగ్ బాస్ నిర్వాహకులు టాస్క్ విషయంలో మాత్రం అస్సలు తగ్గడం లేదు. అక్కడే అసలైన ఎంటర్టైన్మెంట్ అందిస్తూ వస్తున్నారు. ఇక లవ్ బర్డ్స్ విషయంలో కూడా ప్రత్యేకమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే హామీదాతో శ్రీరామచంద్ర లవ్ ట్రాక్ మొదలైంది. ఇక మధ్యలో మానస్ కూడా ప్లే బాయ్ తరహాలో ట్రాక్ ప్లే చేసే ప్రయత్నం చేస్తిన్నాడు.

   అర్ధరాత్రి మానస్, లహరి మాటలు

  అర్ధరాత్రి మానస్, లహరి మాటలు

  ఆ సంగతి పక్కన పెడితే ఎక్కువగా శ్రీ రామచంద్ర లవర్ బాయ్ గా కనిపించే ప్రయత్నం చేస్తున్నాడు. అతనికి పోటీగా మానస్ కూడా అప్పుడప్పుడు రొమాన్స్ తో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నాడు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో అయితే లహరిని మధ్యలోకి లాగిన మనస్ అతడికి మండిపోయేలా చేశాడు. అర్ధరాత్రి కిచెన్ లోకి గిన్నెలు కడుగుతున్న సమయంలో లహరి దగ్గరకు వచ్చి ఇలాంటి టైం లో ఎవరు ఏ పని చేస్తున్న కూడా నేను వస్తాను అంటూ లహరి కాస్త క్యూట్ గా మాట్లాడింది. ఇక దూరం నుంచి శ్రీరామచద్ర వారిని గమనిస్తున్నారు.

  Recommended Video

  Bigg Boss Telugu 5 : Sarayu ఎలిమినేషన్.. జంటల రొమాన్స్ అదుర్స్ !! || Filmibeat Telugu
  కౌగిలింతల వరకు..

  కౌగిలింతల వరకు..


  ఇక అలానే మాట్లాడుకుంటూ లహరి మనస్ ఇద్దరు కూడా కౌగిలింతల వరకు వచ్చారు. ఇక లహరి అయితే మాటల డోస్ పెంచుతూ.. ఒకసారి నా బెడ్ వరకు రా అంటూ మరింత రొమాంటిక్ గా మాట్లాడింది. మైక్ తీసేసి మరి ఇద్దరూ కౌగిలింతలో మునిగితేలారు. శ్రీ రామచంద్ర చూస్తున్నాడని మనస్ మరింత ఎక్కువగా లహరితో రొమాన్స్ చేశాడు అనిపించింది చూస్తుంటే త్వరలోనే మానస్ శ్రీరామచంద్రల మధ్య గొడవలు తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుందని అర్థమవుతుంది. మరి వీరి మధ్య లో బిగ్ బాస్ ఎలాంటి ట్విస్టులు క్రియేట్ చేస్తాడో చూడాలి.

  English summary
  Bigg Boss Telugu 5 manas lahari romantic dose sreeramachandra upset ,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X