For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss 5: నీ ప్రాబ్లమ్ ఏంటి.. కావాలంటే వెళ్లిపోవచ్చు.. రవి పరువుపోయేలా నాగార్జున కౌంటర్

  |

  బిగ్ బాస్ షోలోకి ఒకసారి అడుగు పెట్టిన తర్వాత సెలబ్రెటీలు కొన్నిసార్లు వారి హోదాను కోల్పోయేలా పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. బయట ప్రపంచంలో వారు ఎలా కనిపించినప్పటికీ కూడా బిగ్ బాస్ హౌస్ లో మాత్రం కొన్ని పరిస్థితులు చెడ్డవాడిగా మారుస్తాయి. తప్పు చేయకపోయినా కూడా మరికొన్ని సార్లు చీవాట్లు కూడా అందుతుంటాయి. ఫైనల్ గా జనాలు ఏమనుకుంటున్నారు అనే ఈ విషయంపై ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు.

  ఇక ఈ సారి బిగ్ బాస్ హౌస్ లో అందరి కంటే కాస్త ఎక్కువ క్రేజ్ ఉన్నటువంటి వారిలో యాంకర్ రవి ఊహించని చేదు అనుభవాలు ఎదుర్కొంటున్నాడు. శనివారం ఎపిసోడ్ లో నాగార్జున కూడా మరో సారి అతని పరువు పోయేలా కౌంటర్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

   వర్కౌట్ అవ్వడం లేదు

  వర్కౌట్ అవ్వడం లేదు

  బిగ్ బాస్ సీజన్ 5 మొదలైనప్పుడు కంటెస్టెంట్స్ విషయంలో ప్రేక్షకులు భారీ స్థాయిలో అంచనాలు అయితే పెట్టుకున్నారు. కానీ షో నిర్వాహకులు మాత్రం అంచనాలకు తగ్గట్లుగా సెలబ్రెటీలను సెలెక్ట్ చేయలేదు అనే కామెంట్స్ వచ్చాయి. కానీ యాంకర్ రవి షణ్ముఖ్ రావడం వర్గం వారిని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ ఇద్దరు కూడా మొదటినుంచి విభిన్నమైన తరహాలో వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అది ఏమాత్రం వర్కౌట్ కావడం లేదు.

   యాంకర్ రవికి చేదు అనుభవాలు

  యాంకర్ రవికి చేదు అనుభవాలు

  ముఖ్యంగా యాంకర్ రవి మంచి దారిలోనే వెళ్లాలని అనుకున్నప్పటికీ కూడా పరిస్థితులు అన్నీ రివర్స్ అవుతున్నాయి. అంతేకాకుండా అతను ఇతరులను ప్రభావితం ఎక్కువగా చేస్తున్నాడు అని షణ్మఖ్ అయితే చాలా సార్లు కామెంట్ చేశాడు. అంతేకాకుండా జెస్సి కూడా అదే తరహాలో స్పందించాడు. ఆఖరికి అన్నయ్య అని పిలిచిన విశ్వ కూడా రవిపై పలుమార్లు నెగటివ్ కామెంట్స్ కూడా చేశాడు. ఇక నట్రాజ్ మాస్టర్ అయితే ఏకంగా గుంటనక్క మోసగాడు అంటూ కౌంటర్ ఇచ్చాడు.

  రవి పరువు పోయేలా..

  రవి పరువు పోయేలా..

  గుంట నక్క అనే పదంతో యాంకర్ రవి చాలా ఇబ్బంది పడ్డట్లు అర్థమైంది. ఇక లహరి ప్రియా గొడవలో కూడా యాంకర్ రవి పై ఒక్కసారిగా నెగటివ్ కామెంట్స్ చాలానే వచ్చాయి. అంతేకాకుండా అప్పుడు అమ్మతోడు అంటూ ఒట్టు వేయడం కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నాగార్జున విషయంలో రవి పరువు పోయేలా కొన్ని వీడియోలను కూడా బయట పెట్టాడు. అప్పటి నుంచి రవి మళ్లీ క్షమాపణలు చెప్పి మెల్లగా ముందుకు సాగుతున్నప్పటికీ గత వారం అతను చేసిన కొన్ని కామెంట్స్ కు నాగార్జున కౌంటర్ ఇచ్చారు.

  ఎమోషనల్ అవ్వడంతో..

  ఎమోషనల్ అవ్వడంతో..

  సిరి షణ్ముఖ్ ల వద్ద గత వారం తన కుటుంబ సభ్యుల గురించి చెప్పుకుంటూ రవి బాధపడ్డాడు ఇంట్లో వాళ్ళు చాలా గుర్తుకు వస్తున్నారు అని బిగ్ బాస్ లోకి అతను డబ్బులు గెలుచుకోవడానికి రాలేదని కూడా చెప్పాడు. తనను నమ్ముకుని ఒక భార్య కూతురు తో పాటు తల్లిదండ్రులు కూడా ఉన్నారు అని ఎమోషనల్ గా ఫీల్ అవుతూ వివరణ ఇచ్చాడు.

  అయితే ఆ విషయంలో నాగార్జున అతనికి ఎవరూ ఊహించని విధంగా కౌంటర్ ఇచ్చాడు.

  వెళ్ళాలి అంటే వెళ్లిపోవచ్చు

  వెళ్ళాలి అంటే వెళ్లిపోవచ్చు

  అసలు నీ ప్రాబ్లం ఏంటి రవి.. బాగా స్లో అయ్యావు.. నీ ఫ్యామిలీని మిస్ అవుతున్నాను అని చెప్పావు. కానీ బిగ్ బాస్ నీకు ఎప్పుడు ఏం కావాలో అన్నీ ఇస్తున్నారు. ఇంటి నుంచి లెటర్ వచ్చింది. బొమ్మలు కూడా వచ్చాయి. అయినా కూడా నువ్వు అలా మాట్లాడడం ఏమిటో అర్థం కావడం లేదు. అయినా ఇక్కడ నీకు ఒక్కడికే ఫ్యామిలీ ఉందా.. మిగతా వారికి ఎవరికి లేదా? బిగ్ బాస్ ఇప్పుడు నీకోసం కొత్త రూల్స్ పాటించాలా? ఎప్పుడు ఇన్ఫర్మేషన్ పంపాలో బిగ్ బాస్ కు బాగా తెలుసు.

  నీ ఒక్కడి కోసం ఇక్కడ రూల్స్ మళ్ళీ మార్చే అవకాశం ఉండదు. ఎలాంటి పరిస్థితుల్లో నైనా ఇక్కడే ఉండాలి అని చెప్పడమే బిగ్ బాస్ గేమ్ ఉద్దేశం. ముందుగానే నేను ఈ గేమ్ ఆడతానని ఒప్పుకొని హౌస్ లోకి అడుగుపెట్టారు కదా. అయినా డబ్బు కోసం రాలేదని అంటున్నావ్.. వెళ్లాలంటే నీ ఇష్టం ప్రకారం గా వెళ్ళిపోవచ్చు. గేట్స్ కూడా ఓపెన్ చేయిస్తాను అంటూ నాగార్జున పరువూ పోయెలా రవి కి కౌంటర్ ఇచ్చాడు.

  English summary
  Bigg boss telugu 5 nagarjuna counter on anchor ravi
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X