Don't Miss!
- Lifestyle
సంబంధంలో ఉంటూ మిమ్మల్ని మీరు కోల్పోకుండా ఉండటం ఎలాగో తెలుసా?
- News
తారకరత్న ఆరోగ్యంపై చంద్రబాబు; బెంగళూరు ఆస్పత్రికి రేపు వెళ్లనున్న ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
Bigg Boss 5: ఎలిమినేషన్‌ను ముందే ఊహించిన ప్రియాంక.. అప్పుడు నేను ఉండను అంటూ..
బిగ్ బాస్ హౌస్ లో ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా కంటెస్టెంట్స్ బయట ప్రపంచానికి మాత్రం ఏదో ఒక సందర్భంలో నెగటివ్ గా కనిపిస్తూ ఉంటారు. కొన్నిసార్లు సరైన దారిలో వెళ్లడానికి పోరాడినప్పటికీ కూడా పరిస్థితులు ఏమాత్రం అనుకూలించవు. బిగ్ బాస్ అంటేనే గొడవలతో కాంట్రవర్సీ తో ముందుకు సాగుతూ ఉండాలి. ఇక్కడ స్నేహాలకు ఎక్కువ రోజులు తావుండదు. ఎంత తిట్టుకున్నా కొట్టుకున్నా కూడా టాస్క్ ల దగ్గరికి వచ్చేసరికి కంటెస్టెంట్స్ శత్రువులుగా మారి పోతూ ఉంటారు. ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతారు అనే విషయంలో కొన్ని సార్లు అనుమానాలు వస్తూ ఉంటాయి. అయితే వారికి వారే ఊహించుకోవడం కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎలిమినేషన్ పై ప్రియాంక కూడా ముందే ఉంచుకుంటుంది.
Photo Courtesy: Star మా and Disney+Hotstar

సహనాన్ని కోల్పోతున్నారు
8వ వారంలో బిగ్ బాస్ షో లో సరికొత్త టాస్క్ లు మంచి ఎంటర్టైన్మెంట్ తో క్రియేట్ చేశాయి. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి బిగ్ బాస్ ఆ విషయంలో కాస్త డోస్ పెంచాడు అనే చెప్పాలి. ఫిజికల్ గా కంటెస్టెంట్స్ చాలా బలంగా పోరాడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో లో చాలా మంది వారి సహనాన్ని కూడా కోల్పోతూ వస్తున్నారు ముఖ్యంగా సన్నీ గత వారం నుంచి కూడా తన శత్రువుల సంఖ్యను కూడా పెంచుకొంటూ వస్తున్నాడు.

కెప్టెన్ గా షణ్ముఖ్
ఇక ఈ వారంలో కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఐదుగురు కంటెస్టెంట్స్ పోటీకి వెళ్లగా చివరికి షణ్ముఖ్ కెప్టెన్ గా నిలిచాడు. ప్రియాంక ఈసారైనా క్యాప్టెన్ గా గెలవాలని అనుకుంది. కానీ ఆమె గతంలో త్యాగాలు చేసి అనవసరంగా కెప్టెన్ అయ్యే అవకాశాన్ని కోల్పోయింది. ఇక ఈ సారి ఇతరుల డామినేషన్ తో మరో సారి ఛాన్స్ మిస్సయ్యింది. ఆమె కెప్టెన్ అయితే చాలా మంది మద్దతు ఇస్తారు. దాదాపు అందరి తోనూ ప్రియాంక ఫ్రెండ్లిగానే కొనసాగుతోంది.

గోడవలతో హైలెట్
బిగ్ బాస్ లో ఎక్కువ కాలం ఫ్రెండ్లీగా కొనసాగడం కూడా పెద్ద మైనస్ అని చెప్పవచ్చు. కెమెరాలు కూడా ఎక్కువగా గొడవపడే వారి వైపే ఫోకస్ చేస్తూ ఉంటాయి. ఆ విషయంలో సన్నీ గత రెండు వారాల నుంచి బాగా హైలెట్ అవుతున్నాడు. గొడవ పడిన తర్వాత అతనికి ఒక విధంగా అభిమానుల సంఖ్య ఎక్కువ అయ్యిందనే చెప్పాలి. పెద్దగా తప్పు లేకపోవడంతో సన్నీ వారియర్ గా నిలిచాడు. ఈవారం కెప్టెన్సీ టాస్క్ లో పోటీ పడిన సన్నీ శ్రీరామ్ తో కూడా గొడవకు దిగాడు. ఆఖరికి తన మొదటి స్నేహితుడు జెస్సితో కూడా కయ్యానికి కాలు దువ్వడం విశేషం.
Recommended Video

ప్రియాంక ఎలిమినేషన్
బిగ్ బాస్ నుంచి ఎప్పుడు ఎవరు వెళ్ళిపోతారు అనే విషయంలో అనేక రకాల అనుమానాలు వస్తూ ఉంటాయి. అయితే ఎలిమినెట్ అయ్యే ఒక రెండు రోజులు ముందే న్యూస్ లీక్ అవుతుంది. ఇక కంటెస్టెంట్స్ ఎవరికి వారు ఎలిమినేషన్ గురించి అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇక ప్రియాంక అయితే తాను పదవ వారం ఇంట్లో నుంచి వెళ్లి పోవడం ఖాయమని ఓపెన్ గా చెప్పేసింది. మానస్ తో ముచ్చట్లు పెట్టిన ప్రియాంక తప్పకుండా నేను వెళ్లి పోయే అవకాశం ఉంది అని చెప్పడంతో అందుకు మానస్ ఆమెకు సపోర్ట్ చేశాడు. అలాంటిది ఏమీ జరగదని కాకపోతే టార్గెట్ చేయడం పక్క అని వివరణ ఇచ్చాడు. మరి ప్రియాంక అనుమానాలు ఎంత వరకు నిజం అవుతాయో చూడాలి.