For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg boss 5 నాగ్ మాస్ వార్నింగ్స్ తో హౌస్ లో హీట్.. లోబోకి ఒక రేంజ్ లో వార్నింగ్?

  |

  బిగ్ బాస్ విజయవంతంగా నాలుగో వారం చివరికి చేరుకుంది.. అయితే ప్రతి శని ఆదివారాల్లో నాగార్జున హౌస్ మేట్స్ కి కనిపిస్తూ కనువిందు చేస్తారు అన్న సంగతి తెలిసిందే. హౌస్ లో ఉన్న సభ్యులు కాకుండా మరో ముఖం ఎరుగని కంటెస్టెంట్లు అందరూ కేవలం నాగార్జున ముఖాన్నే చూస్తారు కాబట్టి ఆయనను చూడగానే హౌస్ మేట్స్ అందరూ ఆనంద పడడం కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆయన వచ్చినట్టే వచ్చి వారం మొత్తం మీద ఎవరు ఎలాంటి తప్పులు చేశారు అనే విషయం మీద క్లాస్ పీకుతారు కూడా. అలాగే ఈ రోజు కూడా సీరియస్ గా ఉన్న ఒక ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమో ఆసక్తికరంగా సాగుతుంది. షన్ను, సిరి, జస్వంత్, లోబోలతో నాగార్జున మాట్లాడుతూ ఉండడం కూడా కనిపించింది. ఆ వివరాల్లోకి వెళితే

  నాగ్ ఎంట్రీ

  నాగ్ ఎంట్రీ

  కొద్ది రోజుల క్రితమే ప్రారంభమైన తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ నాలుగో వారం కూడా ముగింపుకు చేరింది. ఇప్పటికే ముగ్గురు కంటెస్టెంట్లు ఎలిమినేటి కాగా ఇప్పుడు ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా రేపు ఒక కంటెస్టెంట్ బయటకు వచ్చేస్తారు. అయితే ఈ రోజు నుంచి కంటెస్టెంట్ లను నాగార్జున సేవ్ చేయడం ప్రారంభిస్తారు దీంతో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనేది ఆసక్తికరంగా మారనుంది. ఈ వారం ఎలిమినేషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కావడంతో ఎవరు బయటకు రాబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ రోజుకు సంబంధించిన ప్రోమో కొద్ది సేపటి క్రితం విడుదలైంది.

  షన్నుకి షాక్

  షన్నుకి షాక్


  ప్రతి వారంలాగానే ఈ వారం కూడా నాగార్జున హౌస్ మేట్స్ మీద ఫైర్ అయ్యారు. షణ్ముఖ్ చేత ఒక పచ్చి మిరపకాయ తినిపించిన నాగార్జున ఎప్పుడూ కూర్చునే ఉంటున్నావు అని అసలు ఆట ఏం ఆడుతున్నామని షణ్ముఖ్ ను నేరుగా ప్రశ్నించారు. నాగార్జున ప్రశ్నకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో పడిపోయాడు షణ్ముఖ్. ఇక పక్కనే ఉన్న సిరిని ఉద్దేశిస్తూ సిరి నువ్వు నీ ఆట ఆడమ్మా నువ్వు ఎందుకు వేరే వాళ్ల మీద ఆసక్తి చూపిస్తున్నావు అని ప్రశ్నించారు.

  సిరి వల్ల జశ్వంత్

  సిరి వల్ల జశ్వంత్


  నీవల్ల జశ్వంత్ కూడా ఇబ్బంది పడుతున్నాడని నాగార్జున అనడంతో సిరి ఏం చేయాలో తెలియక తెల్ల ముఖం వేసింది. మరోపక్క జశ్వంత్ మాట్లాడుతూ నేను ఒక కెప్టెన్గా ఫెయిల్ అయ్యాను అని అనడంతో అది సరే కానీ తప్పు చేసిన వాళ్లు మాత్రం ఒప్పుకోవడం లేదు కదా అని నాగార్జున ప్రశ్నిస్తాడు. అయితే హౌస్ లో రెండు సార్లు కూడా జస్వంత్ ని ఇబ్బంది పెట్టిన పర్సన్ లోబో అనే సంగతి దాదాపు అందరికీ తెలిసిందే.

  బరాబర్ చేశా

  బరాబర్ చేశా

  అలా లేచిన లోబో మాట్లాడుతూ నా వరకు నేను ఏం చేశాను అది నాకు కరెక్ట్ గానే అనిపించింది అని బారాబర్ గా చేశాను అని అది జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనేది వాళ్ళ ఇష్టం అని చెప్పుకొచ్చాడు. అయితే అరవడం కూడా బరాబర్ ఏనా అని నాగార్జున ప్రశ్నించారు. అలాగే అరుస్తావా అని ప్రశ్నించడంతో ఆ లవ్ పదం అనగానే నేను సహనం కోల్పోయానని లోబో అంటాడు. సరే నీ ఒక్కడికే ప్రేమ ఉంది వీళ్ళు ఎవరికీ లేదు కదా అని నాగార్జున చురకలంటించారు.

  లోబోకి నాగార్జున వార్నింగ్


  అంత గట్టి గట్టిగా అరుస్తూ గొంతు చించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని ప్రశ్నించగా నేను ఏమీ గొంతు చించుకోనే లేదు అని అంటాడు లోబో. అవునా అలాగా అంటూ వీడియో ప్లే చేయించారు నాగార్జున. అందులో లోబో గట్టి గట్టిగా అరుస్తూ నట్లు గా కనిపించింది. మరి ఇది ఏంటి అని ప్రశ్నించగా సారీ సార్ క్షమించండి అంటూ నాగార్జునకు లోబో సరెండర్ అయ్యాడు. అలాగే మాట మాట్లాడితే నేను బస్తీ నుంచి వచ్చాను అని అంటున్నావు అని ఇక్కడ బస్తీకి, విల్లాకు తేడా ఏమీ లేదని ఇది బిగ్ బాస్ హౌస్ ఎక్కడ అందరూ సమానమే అని నాగార్జున అన్నారు. మొత్తం మీద ఇవాల్టి ఎపిసోడ్ హాట్ హాట్ గా సాగనుంది అని చెప్పక తప్పదు.

  English summary
  In Bigg Boss Telugu 5 latest promo nagarjuna seen warning lobo, shanmukh and siri.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X