For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 5 promo: లోబో, ప్రియాంక, మానస్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. హామీదాకు న్యూ పవర్!

  |

  బిగ్గెస్ట్ రియాల్టీ షోగా రేటింగ్స్ అందుకుంటున్న బిగ్ బాస్ సీజన్ 5 మరోసారి రసవత్తరంగా మారేలా ఉన్నట్లు అనిపిస్తోంది. కంటెస్టెంట్స్ మధ్యలో పోటీ తీవ్రత గట్టిగానే పెరుగుతోంది. హౌస్ లోకి అడుగు పెట్టి మూడు రోజులు కూడా కాలేదు.. అప్పుడే ఎవరికి వారు ప్రణాళికలు రచించి ముందడుగు వేస్తున్నారు. ఒకరోజు బాగానే ఉంటూ.. మరొక రోజు గొడవలకు సిద్ధమవుతున్నారు.

  కొందరైతే క్షణాల్లో గొడవపడి అనంతరం మ్ ఆప్యాయంగా పలకరించుకుంటున్నారు. ఇక ఇక నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ తో పాటు బిగ్ బాస్ ఎప్పటికప్పుడు పవర్ రూమ్ తో ఆటను చేంజ్ చేస్తున్నాడు. అందుకు సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  తెలివిగా కొనసాగుతున్న బిగ్ బాస్

  తెలివిగా కొనసాగుతున్న బిగ్ బాస్

  బిగ్ బాస్ షోలో పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు అని ఎవరికి వారు ఒక అంచనాకు అయితే వస్తున్నారు. బయట ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా కూడా ఒకసారి హౌస్ లోకి అడుగు పెట్టాక ఎవరు కూడా ఆ మర్యాద ఇవ్వడం లేదని కూడా తెలిసిపోయింది. ఏదైనా సరే ఆటలో భాగం అనే ఆ విషయాన్ని ఒక్కొక్కరు అర్థం చేసుకునే పరిస్థితిలో కి వస్తున్నారు. ఇక బిగ్ బాస్ కూడా తెలివైన ఆటలతో షోను కొనసాగిస్తున్నాడు. మొదట ఒక ఎమోషనల్ బాండింగ్ క్రియేట్ చేస్తూ.. ఆ తరువాత కంటెస్టెంట్స్ మధ్యలో ఒక తెలియని చిచ్చును రాజేస్తున్నట్లు అర్ధమవుతుంది.

  ఓపికకు పరీక్ష..

  ఓపికకు పరీక్ష..

  నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో పరిస్థితులు ఏ విధంగా చోటుచేసుకుంటాయి అనేది ఆసక్తికరంగా మారింది. బిగ్ బాస్ సూపర్ పవర్ హౌజ్ తో కంటెస్టెంట్స్ ఓపికను ఎంతగానో పరీక్షిస్తాడు. ఎవరైతే పవర్ హౌస్ వద్ద ఉన్న స్కానర్ ను టచ్ చేస్తారో వారికి ఒక సూపర్ పవర్ ఇస్తున్నాడు. ఇక ఇప్పటికే సిరి మానస్ విశ్వ వారి తరహాలో ఒక్కొక్కరికి ఒక్కో విధంగా టాస్క్ ఇచ్చారు. ఇక అందులో కొందరు మాత్రమే టాస్క్ విజయవంతంగా పూర్తి చేస్తున్నారు.

  మానస్ - ప్రియాంక మధ్యలో..

  మానస్ - ప్రియాంక మధ్యలో..

  ఇక ఆట ఎలా కొనసాగుతున్నా కూడా కొందరి మధ్యలో మాత్రం ఎప్పటిలాగే ప్రేమ సన్నివేశాలు మొదలవుతున్నాయి. కేవలం అనుమానం వస్తే చాలు మిగతా కంటెస్టెంట్ వారిని లేపే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక ప్రస్తుతం జబర్దస్త్ ప్రియాంక అలాగే మానస్ కు మధ్యలో ఏదో నడుస్తోందని మిగతా కంటెస్టెంట్స్ హైప్ తో మాట్లాడుకుంటున్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా బిగ్బాస్ కొత్త తరహాలో రిలేషన్ లో కొనసాగిస్తున్నట్లు అర్థమవుతోంది అయితే వీరి మధ్యలో రోబో కూడా డా జత చేయడంతో ఎంటర్టైన్మెంట్ డోస్ మరింత ఎక్కువైంది.

  మధ్యలో ఎవరు వచ్చినా బకరా అవ్వడం పక్కా..

  మధ్యలో ఎవరు వచ్చినా బకరా అవ్వడం పక్కా..

  ముందుగా మనసు ప్రియాంక ఇద్దరు కూడా ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకున్నట్లు కనిపిస్తున్నారు. తన దగ్గర ఉన్న ఒక రోజా పువ్వు ప్రియాంక చేతికి ఇస్తుంది. నువ్వు కెప్టెన్ అయిన తర్వాత మళ్ళీ ఆ పువ్వుని నాకు ఇవ్వు అంటూ ప్రియాంక చెబుతుంది. అందుకు మానస్ కూడా ఎంతగానో సంతోషిస్తాడు. చూస్తుంటే వీరి మధ్యలో మరిన్ని డిఫరెంట్ సన్నివేశాలు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యలో ఎవరు వచ్చినా కూడా మళ్లీ బకరా అయ్యే అవకాశం ఉందని కూడా అనిపిస్తుంది. గతంలో ఇదే తరహాలో చాలా మంది మధ్యలో ప్రేమ సన్నివేశాలు చోటుచేసుకున్నాయి.

  దమ్ముంటే మానస్ ముందు లైన్ వేయి

  దమ్ముంటే మానస్ ముందు లైన్ వేయి

  ఇక ప్రియాంక లోబోకు ఒక హెచ్చరిక చేయడం విశేషం రెస్ట్ రూమ్ లో ఎప్పటిలాగే పని చేసుకుంటూ ఉన్న లోబో ప్రియాంక రావడాన్ని గమనిస్తాడు. కాకపోతే కాస్త విభిన్నంగా చూడడంతో వెంటనే ప్రియాంక ఒక స్వీట్ వార్నింగ్ అయితే ఇస్తుంది. నువ్వు నన్ను చూస్తున్నామని మానస్ కు కంప్లైంట్ చేస్తాను. నీకు దమ్ముంటే మానస్ ముందు నాకు లైన్ వేయి..అంటూ ప్రియాంక లోబోకు ఒక హెచ్చరిక చేయడం అందరినీ షాక్ గురి చేసింది. లోబో కూడా ఆమె మాటలకు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు.

  ప్రియాకు లోబో ప్రపోజల్

  ప్రియాకు లోబో ప్రపోజల్

  ఇక అప్పుడే మానస్ వాష్ రూమ్ లోకి రావడంతో ఆ విషయాన్ని లోబో అతనికి చెబుతాడు. నేను ప్రియాని ప్రపోజ్ చేయాలని అనుకున్నాను. కానీ ఆమె ఎమన్నది అంటే. ఫస్ట్ వెళ్లి మానస్ వెళ్లి మాట్లాడు అని చెప్పింది.. అని లోబో చెప్పాడు. ఇక ఆ మాటలకు మానస్ చిన్నగా స్మైల్ ఇచ్చాడు. మానస్ అక్కడనుంచి వెళ్ళి పోతాడు కానీ మ్యాటర్ పై అతను పెద్దగా స్పందించడానికి ప్రయత్నం చేయడు.

  Bigg Boss Telugu 5 : Anchor Ravi VS Shanmukh Jaswanth || Filmibeat Telugu

  బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ అవ్వలేరు

  ఇక మరోవైపు పవర్ హౌస్ వద్ద మొత్తానికి హామీదా విజయం సాధిస్తుంది. సిగ్నల్ రాగానే వెళ్లి స్కానర్ వద్ద చేయి పెట్టడంతో బిగ్ బాస్ ఆమెకు ఒక చాలెంజ్ విసురుతాడు. ఇప్పుడు మీకు లభించిన పవర్ తో ఎవరినైనా సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు ఎప్పటికీ కూడా బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ అవ్వలేరు అని చెబుతాడు. దీంతో హామీదా కూడా కొంత షాక్ అవుతుంది.

  అదే విషయాన్ని బయటకు వచ్చి అందరికీ చెప్పడంతో ఒక విధంగా కంటెస్టెంట్స్ అందరిలో ఒక ఆందోళన మొదలవుతుంది. కెప్టెన్ అనేది ప్రతిసారి ఎలిమినేషన్స్ నుంచి తప్పించుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక అలాంటి కెప్టెన్ అవకాశం రాకపోతే రిస్క్ లో పడినట్లే.. మరి హామీదా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటుందో చూడాలి.

  English summary
  Bigg Boss Telugu 5 promo new story between priyanka and manas lobo
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X