For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg boss telugu 5: ఇలాంటివి ఓపెన్ గా అడిగితే ఎలా సార్.. నాగార్జున ముందు సిగ్గుపడిన ప్రియాంక!

  |

  బిగ్గెస్ట్ రియాల్టీ షో గా కొనసాగుతున్న బిగ్ బాస్ సీజన్ 5 మొత్తానికి మొదటి వారం విజయవంతంగా పూర్తి చేసుకుంటోంది. మొదట్లో కంటెస్టెంట్స్ విషయంలో కొన్ని విభిన్నమైన కామెంట్స్ వచ్చినప్పటికీ కూడా బిగ్ బాస్ మెల్లగా టాస్క్ ల విషయంలో డోస్ పెంచుతున్నాడు. కంటెస్టెంట్స్ కూడా పోటా పోటీగా ఆల్ రౌండర్ ప్రదర్శన ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అసలు బిగ్ బాస్ షో ఈసారి హిట్ అవుతుందా లేదా అనే అనుమానాలు చాలానే వచ్చాయి.

  ఎందుకంటే కంటెస్టెంట్స్ లలో ఇంకా టాప్ సెలబ్రిటీలతో వచ్చి ఉంటే బాగుండేది అని కామెంట్స్ కూడా వచ్చాయి. ఇక హౌస్ లో ప్రతి ఒక్కరు కూడా వారి అసలు స్వభావాలను బయట పెడుతున్నారు. ఇక ఆదివారం రోజు సండే అనే విధంగా కొనసాగుతోంది. మొదట ఆటలు పాటలు ఆడించే నాగార్జున ఆ తర్వాత ఎలిమినేషన్ ట్విస్ట్ తో సరికొత్త షాక్ ఇవ్వబోతున్నారు.

  సన్ డే ఫన్ డే..

  సన్ డే ఫన్ డే..

  నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు సిజన్ 5 సరికొత్త స్టైల్ తో ముందుకు సాగుతోంది. సండే అంటే ఫన్ డే అంటూ నాగార్జున ఎపిసోడ్ లో హైలెట్ గా కనబడుతున్నారు. అందుకు సంబంధించిన ప్రేమ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈసారి నాగార్జున తన పోస్టింగ్ తో అంతకుమించి ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నట్లు అర్థమవుతోంది. ఇక మాస్ బిర్యానీ అంటే సాంగ్ తో ఎంట్రీ ఇచ్చిన మన్మధుడు అందరిని ఆటపాటలతో అలరింప చేశాడు.

  అర్జున్ రెడ్డి టైటిల్

  అర్జున్ రెడ్డి టైటిల్

  ముఖ్యంగా లోబో కంటెస్టెంట్స్ తో సరికొత్త తరహాలో డ్యాన్సులు చేస్తూ నవ్వించాడు. ఇక ఈ పాట్నర్ కి సూటయ్యే సినిమా టైటిల్ ఏది అంటూ అన్నప్పుడు ఉమాదేవి , సరయుకు అర్జున్ రెడ్డి టైటిల్ ను ఇవ్వడం విశేషం. ఆ తర్వాత అందరూ పక్కన వేశారు. మీకు సరైన టైటిల్ ఇచ్చిందని కూడా అందరూ క్లాప్స్ కొట్టారు. ఇక యాంకర్ రవి డెన్స్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు. అని మాస్టర్, సన్నికి మధ్యలో జరిగిన గొడవలు వాళ్ళు చేసి చూపించారు కూడా. అది కూడా ఈ షోలో హైలెట్గా అనిపించినట్లు అర్థమవుతోంది.

  లోబోని ఎత్తిన విశ్వ

  లోబోని ఎత్తిన విశ్వ

  ఇక ఆ తర్వాత షణ్ముఖ్ జస్వంత్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో మరింత ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అతనితోపాటు శ్వేత కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ఈరోజు ఎపిసోడ్ లో అన్నిటికంటే హైలెట్ గా నిలిచే ది లోబో అని మరోసారి అర్థమవుతోంది. అయితే అతన్ని కండలవీరుడు విశ్వ పైకెత్తుకుని మోసుకు వెళ్లడం నాగార్జునను కూడా ఆశ్చర్య పరిచింది. ఇక సింగర్ శ్రీరామచంద్ర క్యాప్టెన్ సిరిని ఎత్తుకొని తీసుకు వెళ్లడం విశేషం.ఆ తర్వాత సన్నికి కెప్టెన్ కు మధ్యలో జరిగిన సంభాషణలో ఎందుకు ఎంగేజ్ చేసుకున్నారు చెప్పడం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. దానికి నాగార్జున కూడా ఆశ్చర్యపోయారు.

  యాంకర్ రవి కూడా

  యాంకర్ రవి కూడా

  ఇక అందుకు సిరి నువ్వు వస్తావని తెలియక అని సన్నికి సమాధానం సమాధానం ఇవ్వడం మరొక ట్విస్ట్. మధ్యలో యాంకర్ రవి కూడా పంచ్ లు వేయడంలో ఏ మాత్రం తగ్గలేదు. అయినప్పటికీ సిరి నా బెస్ట్ ఫ్రెండ్ అని సమాధానం ఇవ్వడంతో నిన్న నన్ను అన్నావు కదా అని రవి ఓ మాట అన్నాడు. ఇక నాగార్జున రేపు మళ్ళీ ఇంకొకరు అని కూడా సమాధానం ఇచ్చాడు.

  దీప్తి గురించి ఎక్కువగా?

  అయితే ఏ కంటెస్టెంట్ ఎక్కువగా ఎవరి గురించి మాట్లాడతారు అనే ప్రశ్నల వర్షం కురిపించిన నాగార్జున మొదట విశ్వను అడుగుతాడు. ఇక అక్కడ కూడా షన్ను ప్రస్తావన రావడం తో అతను ఎవరు గురించి మాట్లాడుతాడు అని అడుగుతారు. అప్పుడు విశ్వ ఎక్కువగా దీప్తి గురించి చెబుతారని అనగానే అందరూ నవ్వేస్తారు. ఇక నాగార్జున హౌస్ లో ఎవరి గురించి మాట్లాడుతాడు అని హామీదపై మరొక ప్రశ్న వేశారు. ఇక శ్రీరామ్ సన్షైన్ ఏమిటంటే ప్రశ్నించడం హైలెట్ గా నిలుస్తోంది. మరి కంటెస్టెంట్స్ ఎవరెవరు ఎలాంటి సమాధానం ఇస్తారో ఈ రోజు ఫుల్ ఎపిసోడ్ లో చూడాలి.

  Bigg Boss Telugu 5 Episode 7 Analysis..RJ Kajal the ultimate target for housemates
  ఆలాంటివి డైరెక్ట్ గా అడుగుతారా?

  ఆలాంటివి డైరెక్ట్ గా అడుగుతారా?

  ఇక ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువగా వైరల్ అవుతున్న వారిలో ప్రియాంక కూడా ఉంది. ప్రియాంకను డైరెక్ట్ గా నాగార్జున ఒక ప్రశ్న అడగడంతో తను ఒక్కసారిగా సిగ్గు పడింది. క్రష్ ఎవరు అనగానే.. ఇలాంటివి ఓపెన్ గా అడిగితే ఎలా సార్? అంటూ మరోసారి మానస్ ను చూసి నవ్వేసింది. అక్కడే అందరికి మరో సారి ఆ విషయం క్లారిటీగా అర్థమైంది కూడా. మిగతా వాళ్ళు అవునవును అంటూ అరిచేశారు.

  చూస్తుంటే ఈ రోజు షోలో ఫన్ ఎంటర్టైన్మెంట్ చాలానే ఉన్నట్లు అర్ధమవుతొంది. నాగార్జున శనివారంనాడు తమదైన హోస్టింగ్ స్టైల్ తో మెప్పించాడు. ఎలిమినేషన్ ప్రక్రియ కూడా ఆసక్తిగా కొనసాగే అవకాశం ఉన్నట్లు అర్థమవుతోంది. ఇక డేంజర్ జోన్ లో సరయు ఉన్న విషయం తెలిసిందే. ఆమెను వెళ్లిపోయింది అని ఇప్పటికే ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే సండే ఫుల్ ఎపిసోడ్ పై ఒక లుక్ వేయాల్సిందే.

  English summary
  Bigg boss telugu 5 sarayu bold comments on rj kajal behavior
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X