Bigg Boss : తిండి కోసం పరితపిస్తున్న హౌస్ మేట్స్.. ఏమీ దొరక్క డస్ట్ బిన్లో పడేసింది తిన్న లోబో?

ఆసక్తికరంగా సాగుతున్న బిగ్ బాస్ సీజన్ ఫైవ్ తెలుగు ప్రతి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా కొత్త కొత్త టాస్కులు క్రియేట్ చేసి కంటెస్టెంట్ మధ్య గొడవలు మొదలు పెట్టేలా చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు కలిసి తిరిగిన వాళ్ళు సైతం ఈ రోజు శత్రువులు గా మారిపోతున్న అవకాశం కనిపిస్తోంది. అయితే తిట్టుకుంటున్న కాసేపటికే మళ్లీ కలిసి పోతూ మళ్ళీ తిట్టుకుంటూ మొత్తం మీద బిగ్ బాస్ హౌస్ మొత్తాన్ని ఒక ఎమోషనల్ జర్నీ లాగా సాగేలా చేస్తున్నారు నిర్వాహకులు.

అయితే ఈ రోజు టెలికాస్ట్ కాబోతున్న ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయింది. ఈ ప్రోమో లో లోబో తిండి కోసం పరితపిస్తూ డస్ట్ బిన్ లో పడేసిన తిండిని కూడా తింటున్నట్టు గా చూపించారు. కన్నీళ్లు తెప్పిస్తున్న ఈ ప్రోమో కి సంబంధించిన వివరాల్లోకి వెళితే

కొత్త ఫుడ్ టాస్క్

కొత్త ఫుడ్ టాస్క్

బిగ్ బాస్ లో కెప్టెన్సీ పోటీదారుల టాస్ కోసం కొత్తగా ఫుడ్ టాస్క్ ఒక దాన్ని ప్రవేశపెట్టారు. ఈ టాస్క్ ప్రకారం ఇంటి సభ్యులు వంట వండుకోవడానికి ఉపయోగించే ఆహార పదార్థాలు మొదలు వాళ్లు దాచుకున్న ఫ్రూట్స్ అలాగే ఇతర ఇతర తినుబండారాలను సైతం పీపీఈ కిట్లు వేసుకుని హౌస్ లోపలికి వచ్చిన నిర్వాహకులు మాయం చేశారు.. ఆ ఫుడ్ అంతటినీ తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పెట్టారు.

హౌస్ సభ్యులు ఈ టాస్క్ లో భాగంగా బరువు తగ్గాల్సి ఉంటుంది. బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ ల ప్రకారం ఇద్దరు ఇద్దరు చొప్పున జంటగా విడిపోవాల్సి ఉంటుంది. అలా విడిపోయిన జంటలు ఒక్కో టాస్క్ ఆడుతూ గెలిస్తే ఒక అర కేజీ బరువు తగ్గినట్టు ఓడిపోతే ఒక అర కేజీ బరువు పెరిగినట్లు బిగ్ బాస్ రూల్స్ పెట్టారు.

బరువు తగ్గాలంటూ

బరువు తగ్గాలంటూ

అయితే ఈ టాస్క్ లో ఎవరైతే ఎక్కువ బరువు తగ్గుతారు వారు ఈ వారం కెప్టెన్సీ పోటీదారులుగా నిలబడే అవకాశం కల్పిస్తారు బిగ్ బాస్ నిర్వాహకులు. అయితే బిగ్ బాస్ నిర్వాహకులు హౌస్ లోపలికి వెళ్ళిన సమయంలో దాదాపు అన్ని చోట్ల ఆహార పదార్థాలు తీసుకుని బయటకు వెళ్లి పోయారు. కానీ ప్రియాంక అలాగే లోబో మాత్రం కొన్ని యాపిల్స్ దాచుకో గలుగుతారు.

బిగ్ బాస్ వాటిని గుర్తించి స్టోర్ రూమ్ లో పెట్టమని చెప్పే లోపు లోబో కావాలనే ఆ యాపిల్ని కొరికి తినేస్తూ ఉంటాడు. ఈ విషయంలో జెస్సీ మీద సీరియస్ అయిన బిగ్ బాస్ కెప్టెన్గా సరిగ్గా బాధ్యతలు నిర్వహించడం లేదు అంటూ జస్వంత్ ని ఈ టాస్క్ నుంచి మినహాయిస్తారు. అలాగే అతని పార్ట్నర్గా ఉన్న కాజల్ కి కూడా ఈ వారం కెప్టెన్ అయ్యే అవకాశం లేదని తేల్చేశాడు.

ఫుడ్ ఏమీ లేక

అయితే ఫుడ్ ఏమీ లేదు కాబట్టి ఫుడ్ బండి అనే ఒక బండి ద్వారా నిర్వాహకులకు ఫుడ్ సప్లై చేస్తూ ఉంటారు. ఈ ఫుడ్ వచ్చినప్పుడు ఒక్కొక్క హౌస్ సభ్యుడు ఆ తిండి తినాలి.. ముందుగా నిన్నటి ఎపిసోడ్ లో ముద్ద పప్పు ఆవకాయ పంపించడంతో దానిని విశ్వ ఆరోగ్యం బాగోలేదని ఉద్దేశంతో విశ్వ కోసం విడిచిపెట్టారు. ఆ ఫుడ్ మొత్తం విశ్వాన్ని తినాల్సి ఉంటుంది గుమగుమలాడే వాసన వస్తున్నా సరే మిగతా వాళ్ళందరూ కళ్లప్పగించి చూడాల్సిందే తప్ప తినడానికి అవకాశం ఉండదు.

ఇక అందులో భాగంగానే ఈ రోజు పింకీ కోసం కెఎఫ్సి చికెన్ తో పాటు బర్గర్ కూడా పంపించారు..అయితే ఆకలితో పరితపిస్తున్న హౌస్ మేట్స్ లో కాజల్ అలాగే శ్వేత వాసన చూసయి నా కడుపు నింపుకుంటామని చెబుతూ పింకీ చుట్టూ చేరి వాసన చూడటం కనిపించింది. ఇక ఒక్కరోజులోనే ఆహారం విలువ ఎంత అనేది అర్థమయ్యేలాగా బిగ్ బాస్ చెప్పాడని రవి అని కూడా అనడం ప్రోమోలో కనిపించింది.

 జెస్సీకి షన్ను సూక్తులు

జెస్సీకి షన్ను సూక్తులు

ఇక మరో పక్క జెస్సీకి షన్ను ఎప్పటిలాగే నీతి సూక్తులు చెబుతూ కనిపించాడు.. బిగ్ బాస్ హౌస్ లో అందరు సమానమే కాబట్టి నువ్వు ఇంకా ఎవరిని అన్నా అని అనవద్దని చెబుతున్నాడు. దానికి జెస్సీ సరేనని తల ఊపుతూ ఉండడం కూడా కనబడుతుంది. మరోపక్క ఆకలికి తట్టుకోలేక లోబో డస్ట్ బిన్ లో పడేసిన ఏదో వస్తువుని తీసుకుని మళ్ళీ కడిగి తింటున్నట్టు గా చూపించారు. దాన్ని కవర్ చేసుకునేందుకు ముఖం కోరుకుంటున్నట్లుగా లోబో కనిపిస్తాడు. మరీ ఇలా చేయడం ఏమిటి అంటూ రవి అనడం కూడా ప్రోమో లో చూపించారు. ఒకరకంగా ఈ దృశ్యం అయితే కన్నీళ్లు తెప్పిస్తోంది. ఈ టాపిక్ మీద ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.

Recommended Video

Victory Venkatesh Launched Poni Poni Song From Natyam Movie
పాపం హౌస్ మేట్స్

పాపం హౌస్ మేట్స్

ఇలా ఆహారం విషయంలో నియమాలు పెట్టి వాళ్ళను ఏడిపించడం ఏమిటి అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. కొంతమంది మాత్రం తిని కూర్చుని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏది పడితే అది మాట్లాడుకుంటున్నారని దాని కంటే ఇలాంటి టాస్కులు పెడితే ఆహారం విలువ ఏమిటి అనే దాని మీద వాళ్లకు ఒక క్లారిటీ వస్తుందని కామెంట్లు చేస్తున్నారు.. మొత్తం మీద ఈ రోజు జరిగే ఎపిసోడ్ ఆద్యంతం ఆసక్తిగా సాగే అవకాశం కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X