For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 5: మొదటి రోజే రవి vs నటరాజ్, చూస్తే భయం వేస్తుందన్న రవి, నటరాజ్ షాకింగ్ కామెంట్స్!

  |

  తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఎట్టకేలకు ప్రారంభమైంది ఇప్పటికే మొత్తం 19 మంది కంటెస్టెంట్ లు హౌస్ లోపలికి ఎంట్రీ ఇచ్చారు. ఆదివారంనాడు ఒకరికొకరు పరిచయం చేసుకుంటూ సాగిపోగా సోమవారం నుంచి అసలైన ఆట మొదలైంది, ఈ దెబ్బతో ఒకరికొకరు ఇప్పటికే గొడవలు పడటం మొదలు పెట్టారు. అయితే ప్రతి సోమవారం రోజు హౌస్ నామినేషన్స్ ప్రక్రియ ఉంటుందన్న సంగతి తెలిసిందే, అందులో భాగంగా మొదటి వారంలో దాదాపుగా ఆరుగురు సభ్యులు నామినేట్ అయ్యారు, అయితే ఈ నామినేషన్ ప్రాసెస్ లో యాంకర్ రవి, నటరాజ్ మాస్టర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే

  Photo Courtesy: Disney+hotstar and Star Maa

  లోబో గురక

  లోబో గురక

  హౌస్ లో మొదటి రోజు సభ్యుల మధ్య దూరం పెరిగేలా కొన్ని కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా హమీదాతో కొంత మంది హౌస్ సభ్యులకు కొన్ని ఇబ్బందులు కలిగినట్లుగా చూపిస్తున్నారు. మొదటి రోజు ఇంటిలోనే సభ్యులందరూ ఒకరి గురకతో మరొకరికి నిద్ర లేకుండా చేశారని చెప్పొచ్చు. కాకపోతే ఎక్కువగా కెమెరాలు లోబో గురక మీదనే ఫోకస్ చేశాయి. హౌస్ మేట్స్ కూడా ఎక్కువగా లోబో గురక ఆపడానికి ప్రయత్నించారు అయినా సరే ఏ మాత్రం గురక శబ్దం తగ్గించకుండా అలాగే నిద్ర పోయాడు.

  నామినేషన్స్ పూర్తి

  నామినేషన్స్ పూర్తి

  ఇక ఉదయాన్నే జెస్సీ, సిరీ ఇద్దరికీ బోర్ కొట్టడంతో మిగతా వాళ్ళ వస్తువులన్నీ తీసి దాచే ప్రయత్నం చేశారు. కాసేపటికి ప్రణామం, ప్రణామం సాంగ్ మ్యూజిక్ స్టార్ట్ కావడంతో అందరూ ఫ్లోర్ మీదకు వచ్చి కాసేపు ఆనందంగా గడిపారు. అయితే ఎప్పుడైతే ఈ నామినేషన్ ప్రక్రియ మొదలైందో అప్పుడు మొదటి వారం నామినేషన్స్ కూడా హాట్ హాట్ గా సాగాయి. ఎక్కువ మంది హౌస్ సభ్యులు ఒక్కరోజులో ఎలాంటి కారణం చూపి నామినేషన్ చేయాలి అని ప్రశ్నిస్తూనే దానికి నామినేషన్ కు తగ్గ కారణాలు చూపిస్తూనే నామినేషన్స్ పూర్తి చేశారు.

   భయం వేస్తోంది

  భయం వేస్తోంది

  ఈ నామినేషన్స్ మొత్తం మీద కూడా యాంకర్ రవి, నటరాజ్ మాస్టర్ ఇద్దరి నామినేషన్ ఆసక్తికరంగా మారాయి. ముందు యాంకర్ రవి, నటరాజ్ మాస్టర్ ని నామినేట్ చేస్తూ ఆయనతో నాకు చాలా ఏళ్లుగా పరిచయం ఉంది. కానీ బయట ఉన్న నట్రాజ్ మాస్టర్ కి ఇక్కడ ఉన్న కనిపిస్తున్న మాస్టర్ కి చాలా తేడా కనిపిస్తుంది. ఆయనను చూస్తుంటే ఆయన దగ్గరికి వెళ్ళాలన్నా కూడా భయం వేస్తోంది అని చెప్పుకొచ్చాడు. ఆయనను చూస్తే ఒక మాస్టర్ ని చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది కానీ ఎందుకో కనెక్ట్ కాలేక పోతున్నామని అదే కారణంగా నామినేట్ చేస్తున్నా అని చెప్పుకొచ్చాడు. అలాగే మానస్ నాగులపల్లిను కూడా నామినేట్ చేస్తూ ఎందుకు మిగతా వాళ్ళతో కలవడం లేదేమోనని కాస్త గ్యాప్ మెయింటెన్ చేస్తున్నాడు అనిపించడంతో ఆయన నామినేట్ చేస్తున్నా అని చెప్పుకొచ్చాడు.

  నటించలేనని షాక్

  నటించలేనని షాక్

  ఇక యాంకర్ రవి నామినేట్ చేయడంతో నటరాజ్ మాస్టర్ కూడా రవిని నామినేట్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను తన భార్యను ఏడు నెలల గర్భంతో బయట వదిలేసి ఇక్కడికి వచ్చాను అంటే అది మీ అందరి కోసమేనని అందరినీ అలరించడం కోసమే అని అన్నాడు. ఇక్కడ తాను తమలాగే ఉంటానని తనకు నటించడం రాదు అని అందుకే మీకు కొత్తగా కనిపిస్తూ ఉండి ఉంటానని చెప్పుకొచ్చాడు. ఎన్ని చేసినా ఫైనల్ గా అందరూ గేమ్ కోసమే వచ్చాము కాబట్టి అదే స్ఫూర్తి కొనసాగిస్తానని నటరాజ్ మాస్టర్ తేల్చిచెప్పాడు. మరోపక్క జెస్సీని నామినేట్ చేస్తూ నువ్వు మరీ అమాయకత్వంగా కనిపిస్తున్నావు నిన్ను వీళ్ళు అందరూ తొక్కేస్తారు కాబట్టే ఆ విషయం తెలిసి రావాలనే ఉద్దేశ్యంతో నేను నామినేట్ చేస్తున్నా అని పేర్కొన్నాడు నటరాజ్ మాస్టర్. వెంటనే ఎమోషనల్ అయిన జెస్సీ వచ్చి ఆయనను హగ్ చేసుకుని మరీ ఏడ్చేశాడు.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
   వాళ్లంతా నామినేట్

  వాళ్లంతా నామినేట్

  ఇక అలా మొట్ట మొదటి వారం నామినేషన్ ప్రక్రియ ఆసక్తికరంగా సాగగా ఈ నామినేషన్ ప్రక్రియలో ఫైనల్ గా యాంకర్ రవి, మానస్, సరయు, కాజల్, హమీదా, జస్వంత్ (జెస్సీ)లు నామినేట్ అయ్యారు. ఈ ఆరుగురిలో ఒకరు మొదటి వారమే బయటకు వచ్చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ఓటింగ్ ప్రాసెస్ కూడా మొదలైంది. ఎవరు ఎవరికి ఓటు వేస్తారు? ఎవరు మొదటి వారమీ బయటకు వచ్చి చేయబోతున్నారు అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి.

  English summary
  Bigg Boss Telugu 5 anchor ravi and nataraj master fight in nomination process in second episode it self.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X