For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg boss telugu 5: నీ పుట్టలో వేలు పెట్టడం ఇష్టం లేదు.. అలా టచ్ చేసినందుకు కాజల్ పై సరయు దారుణంగా..

  |

  బిగ్ బాస్ హౌస్ లో మెల్ల మెల్లగా కంటెస్టెంట్స్ మధ్యలో వాతావరణం ఒక్కసారిగా చేంజ్ అవుతోంది. మొదట రెండు రోజుల పరిచయం సన్నివేశాలతో కాస్తా పరిచాయలతో ఆటలతో కొనసాగిన బిగ్ బాస్ షో ఇప్పుడు గొడవలతో కొనసాగుతోంది. టాస్క్ ముందుకు సాగుతున్న కొద్దీ.కంటెస్టెంట్స్ లలో అసలు రంగులు బయట పడుతున్నాయి. ఎవరు ఎలాంటి వారు అని తెలుసుకోవాలనే ఆలోచనలతో కావాలని కూడా డిఫరెంట్ గా రియాక్ట్ అవుతున్నారు. అయితే మరికొందరు మాత్రం చిన్న చిన్న వాటికి ఎక్కువ స్థాయిలో వారి కోపాన్ని లేదా కన్నీళ్లను బయట పెడుతున్నారు. ముందు గొడవ పది ఒకటి తరువాత మరొకరు కన్నీళ్లు పెట్టుకోవడం కాస్త డిఫరెంట్ గా ఉంది. అయితే అందరిలో ఎక్కువగా ఫోకస్ అవుతోంది మాత్రం ఆర్జే కాజల్ అనే చెప్పాలి. ఆమె హౌస్ లోకి అడుగు పెట్టినప్పటి నుంచి కూడా కంటెస్టెంట్స్ ఎక్కువ మంది ఆమెపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా సరయు అయితే ఎవరూ ఊహించని విధంగా బోల్డ్ కామెంట్ చేయడం వైరల్ గా మారింది.

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

   అనవసర విషయాల్లో వేలు పెట్టడం..

  అనవసర విషయాల్లో వేలు పెట్టడం..

  రేడియో జాకీగా యాంకర్ గా విభిన్న రకాల ప్రొఫెషన్స్ నుంచి వచ్చినటువంటి RJ కాజల్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతుందని ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే ప్రతి సారి కూడా బిగ్ బాస్ కు సంబంధించిన సమాచారాలను రివ్యూలను అందిస్తూ సోషల్ మీడియాలో బాగా క్రేజ్ అందుకుంటూ వచ్చింది. గతేడాది కంటెస్టెంట్స్ ను పరీక్షిస్తూ ఆమె చేసిన రివ్యూ లు అన్ని ఇన్ని కావు. దీంతో బిగ్ బాస్ 5 లోకి అడుగు పెట్టిన కంటెస్టెంట్స్ అందరూ కూడా కాజల్ ను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నట్లు అనిపిస్తోంది. అయితే కాజల్ ఆ పాయింట్ ను ఎక్కువగా ఉపయోగించుకోవడం లేదని కామెంట్స్ కూడా వస్తున్నాయి. చాలా వరకు ఆమె అనవసర విషయాల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతోందని అంటున్నారు.

  లోబో సెటైర్

  లోబో సెటైర్

  మొదటి నుంచి కూడా కంటెస్టెంట్స్ లో చాలామంది RJ కాజల్ తో మంచిగా మాట్లాడుతూనే ఆ తర్వాత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ప్రతి విషయంలో కూడా ఎక్కువగా ఇన్వాల్వ్ కావడం కొందరికి ఏమాత్రం నచ్చడం లేదు. పవర్ హౌస్ వద్ద కొన్నిసార్లు కాజల్ బాగానే ఎదురు చూసి ఓపికతో కనిపించింది. అయితే ఎవరు పవర్ హౌస్ లోకి వెళ్లి వచ్చినా కూడా ఆమె ప్రతిసారి కాస్త ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ ఏం చెప్పారు ఏం చెప్పారు అని ప్రశ్నలు అడగడం మిగతా కంటెస్టెంట్ పెద్దగా నచ్చలేదు. పవర్ హౌస్ లోకి వెళ్ళింది నువ్వా లేదా కాజాల అంటూ ఆ మధ్యలో లోబో కూడా సెటైర్ వేసాడు

  కాజల్ కు హెచ్చరికలు

  కాజల్ కు హెచ్చరికలు

  కాజల్ అందరితో బాగానే ఉండాలి అని, ఎలిమినేషన్స్ లో మద్దతు కావాలని ప్రయత్నాలు చేస్తోంది. కానీ అవి ఏవి కూడా ఆమెకు కలిసి రావడం లేదు. మొదట లహరి కూడా కాజల్ తో బాగానే కొనసాగింది. కానీ ఆమె ఓవర్ చేస్తోందని కంటెంట్ ఇవ్వడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తోందని కూడా లహరి మొహం మీద కామెంట్ చేసింది. కాజల్ తీరుపై తనకు చాలా ఇబ్బందులు ఉన్నాయి అని, ఏదైనా విషయం చెప్పినప్పుడు ఏదో కొట్టడానికి వచ్చినట్లు మీదకు రావడం మాత్రం నచ్చలేదని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది.

   శత్రువుల సంఖ్యను పెంచుకోవడం..

  శత్రువుల సంఖ్యను పెంచుకోవడం..

  అయితే లహరి తో గొడవలను సాల్వ్ చేసుకోవాలని కాజల్ మధ్య మధ్యలో ప్రయత్నం చేసింది కానీ అవి ఏ మాత్రం ప్రయత్నం సఫలం కాలేదు. మళ్ళీ టాస్క్ లు మొదలవ్వగానే కాజల్ యధావిధిగా శత్రువుల సంఖ్యను పెంచుకోవడం హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా కెప్టెన్ టాస్క్ కోసం బిగ్ బాస్ నలుగురిని సెలెక్ట్ చేశాడు. పవర్ హౌస్ లో ఎవరైతే స్కాన్ చేశారో నలుగురికి బిగ్ బాస్ మధ్యలో మరొక టాస్క్ కూడా ఇచ్చాడు. అందులో విశ్వ, సిరి, మానస్, హామీదా పోటీ పడిన విషయం తెలిసిందే.

  అబ్బాయిలు ఒడిపోవాలని

  అబ్బాయిలు ఒడిపోవాలని

  సైకిల్ తొక్కుతూ చివరివరకు ఎవరైతే ఆ సైకిల్ లైట్ ను వెలిగేలా చేస్తారో వారే కెప్టెన్ గా కొనసాగుతారని బిగ్ బాస్ చెబుతాడు. అయితే ఆ విషయంలో కాస్త కాజల్ డిఫరెంట్ గా ఆలోచించింది. సాధారణంగా టాస్క్ లో ఉన్నప్పుడు ఎవరు ఎవరినైనా సరే డిస్టర్బ్ చేయవచ్చు. లేదా సపోర్ట్ కూడా చేయవచ్చు. అయితే కాజల్ మాత్రం అబ్బాయిలను టార్గెట్ చేసి ఓడిపోయేలా చేయాలని అనుకుంది.. అమ్మాయిలను ఫుల్ సపోర్ట్ చేయాలని కూడా అనుకుంది.

  ముందుగానే చెప్పిన సరయు

  ముందుగానే చెప్పిన సరయు

  అయితే మధ్యలో వచ్చిన సరయు అబ్బాయిలలో విశ్వ కు సపోర్ట్ చేయాలనుకుంది. అయితే ఎవరో ఒకరికి మాత్రమే ప్రత్యేకంగా టార్గెట్ చేయకూడదు అని సరయు ముందుగానే చెప్పింది. కానీ కాజల్ మాత్రం అబ్బాయిలు ఓడిపోయేలా చేయాలనుకుని మానస్ పై ఎక్కువగా ఫోకస్ అయితే చేయలేదు. విశ్వను ఓడించాలని ప్రయత్నం చేసింది. ఆ విషయం నాకు ఏమాత్రం నచ్చలేదు. అలా చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని చేస్తే.. ఇద్దరిదీ టార్గెట్ చేయాలని తెలిపింది.

  #BiggBossTelugu5 లో Lobo Shannu కాంబో పీక్స్.. Abhijit ని కాపీ కొట్టేదెవరు ! || Filmibeat Telugu
  నీ పుట్టలో వేలు పెట్టడం నచ్చలేదు

  నీ పుట్టలో వేలు పెట్టడం నచ్చలేదు

  ఇక అందరూ మాట్లాడుకుంటున్న సమయంలో సరయు కాజల్ గొడవ తీవ్రత మరింత ఎక్కువైంది. సరయుని కాస్త టచ్ చేస్తూ కాజల్ అర్థమయ్యేలా చెప్పాలి అని అనుకుంది. కానీ ఒక్కసారిగా సరయు వాయిస్ పెద్దగా చేసింది. టచ్ ఎందుకు చేస్తున్నావు అక్కడే ఉండి నిలబడి మత్కడవచ్చు కదా అని మళ్లీ కామెంట్ చేసింది. ఒక మాటమీద ఉండాలని ఒకరిని ప్రత్యేకంగా టార్గెట్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని చెప్పింది అంతేకాకుండా కాజల్ మళ్ళీ మాట్లాడుతుండటంతో చిరాకుతో సరయు తనలోని బోల్డ్ అవతరాన్ని బయట పెట్టింది. నాకు నీతో గొడవ పడడం ఏమాత్రం ఇష్టం లేదు అంటూ నీ పుట్టలో వేలు పెట్టడం నచ్చలేదని కూడా డైరెక్ట్ గా బోల్డ్ కామెంట్స్ చేసింది. ఇక ఆ తర్వాత కాజల్ కూడా ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా వెనక్కి తగ్గింది. మరి వచ్చే నామినేషన్స్ లో వీరిద్దరి మధ్య వాతావరణం ఎలా ఉంటుందో చూడాలి.

  English summary
  Bigg boss telugu 5 sarayu bold comments on rj kajal behavior
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X