For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 5 Promo: చిచ్చు పెట్టేశాడు.. షటప్ అన్న పింకీ, మీదకు దూసుకెళ్లిన కంటెస్టంట్!

  |

  స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఆదివారం నాడు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇంటి సభ్యులు దాదాపు నాలుగు రోజుల లోపల గడపగా ఎవరు ఎలాంటి వారు అంచనాకు వచ్చారు. ఇంకా బిగ్ బాస్ కూడా ఆలస్యం చేయకుండా వాళ్ళ మధ్య చిచ్చు పెట్టడానికి రెడీ అయిపోయాడు. తాజా ప్రోమో ప్రకారం హౌస్ సభ్యుల మధ్య పెద్ద ముసలం పుట్టినట్లు కనిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

  వరస్ట్ ఎవరు ? బెస్ట్ ఎవరు ?

  వరస్ట్ ఎవరు ? బెస్ట్ ఎవరు ?

  ఎట్టకేలకు బిగ్ బాస్ హౌస్ కి సిరి హనుమంతు కెప్టెన్ గా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఆమె కెప్టెన్గా ఎన్నికవుతూ విశ్వను రేషన్ మేనేజర్గా కూడా నియమించింది. ఇక రకంగా హౌస్ గాడిలో పడుతుంది అనుకున్న నేపథ్యంలోనే బిగ్ బాస్ ఇంటి సభ్యుల మధ్య గొడవలు పెట్టేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఎలిమినేషన్ వ్యవహారంలో చాల మంది మధ్య విభేదాలు మొదలు కాగా ఇప్పుడు కొత్తగా హౌస్ లో వరస్ట్ కంటెస్టెంట్ ఎవరు అలాగే బెస్ట్ కంటెస్టెంట్ ఎవరు చెప్పాలని 19 మంది సభ్యులను అడగడంతో వారి మధ్య ఉన్న విభేదాలు మరోసారి తెరమీదకు వచ్చాయి.

  రవి టార్గెట్ ఎవరు?

  రవి టార్గెట్ ఎవరు?

  ఇక రిలీజ్ అయిన ప్రోమో ప్రకారం ముందుగా యాంకర్ రవి ఒక కంటెస్టెంట్ గురించి మాట్లాడుతూ గేమ్ ని చాలా సీరియస్ గా తీసుకుంటూ ఉంటాడని, అయితే ఎక్కడైతే ఉండాలో అక్కడ మాత్రం ఉండకుండా మిస్ అవుతారు అని అన్నాడు. సన్నీతో తాజా వివాదం నేపథ్యంలో యాంకర్ రవి ఆయన పేరు సూచించి ఉండొచ్చని భావిస్తున్నారు ప్రేక్షకులు. తరువాత విశ్వ మాట్లాడుతూ టాస్క్ ఒక్కటే చేసి పక్కకు రావడానికి మీకు రాదేమో అన్నట్లుగా చెబుతున్నారు, దీంతో ఆయన ఎవరైనా లేడీ కంటెస్టెంట్ ను ఉద్దేశించి ఈ కామెంట్ చేసి ఉండవచ్చని అంటున్నారు.

  మొదలైన కలవరం

  మొదలైన కలవరం

  ఇక సరయు మాట్లాడుతూ పనులేవీ చేయకుండా బయటికి వెళ్లి కూర్చుంటున్నారని అనగా ఎవరో చేస్తున్నాం కదా అని అంటున్నట్టు అనిపిస్తోంది, దీంతో ఏంటి మీరు చేసేది బయటకు నుంచి టాయిలెట్ కి వెళ్ళడమేనా అని ఘాటుగా ప్రశ్నించింది. ఇది ఎవరినీ ఉద్దేశించి అన్నది తెలియదు కానీ హౌస్ మేట్స్లో మాత్రం కలవరం మొదలైనట్లు చెప్పవచ్చు. ఇక లహరి మాట్లాడుతూ ఒక కంటెస్టెంట్ కి ఒక బాధ్యత అప్పగించిన తర్వాత నువ్వు అక్కడికి వచ్చి ఎందుకు మాట్లాడుతున్నావు అని కాజల్ ని ప్రశ్నించగా దానికి ఆమె నా ఇష్టం అని సమాధానం ఇచ్చింది ఓకే అది నాకు వరస్ట్ అనిపించింది అంటూ లహరి బయటపడింది.

  నేను మార్చుకోను అని

  నేను మార్చుకోను అని

  మరో పక్క శ్వేతా వర్మ మాట్లాడుతూ ఉమా ఫిజికల్ గా నే కాకుండా ఆమె గొంతు కూడా లౌడ్ గా ఉంటుందని, చెప్పుకు వచ్చింది. ఇక మరో పక్క సిరి హనుమంతు మాట్లాడుతూ ఈ విషయం గురించి మీకు చెప్పేది ఇదేనని అయితే మిమ్మల్ని మార్చుకోమని చెప్పడం లేదు కానీ నా ఉద్దేశం అదే అని అంటుంది, అయితే మీరు చెప్పినా నేను మార్చుకోను అని ఉమా తేల్చి చెప్పేసింది.

  Bheemla Nayak పాటతో కిన్నెర మొగిలయ్య స్టార్ స్టేటస్.. ఏంటీ కాంట్రవర్సీ || Filmibeat Telugu

  ఉమాను షట్ అప్ అన్న పింకీ

  అయితే వీళ్ల మధ్య వ్యవహారం ఇలా ఉన్న క్రమంలో ఉమా ప్రియాంక సింగ్ అలియాస్ పింకీ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.. ప్రియాంక వినమని ఉమతో అంటుంటే పర్సనల్ విషయాలు తీసుకురావద్దని ఉమా వార్నింగ్ ఇవ్వడం కనిపిస్తోంది, రెండు మూడు సార్లు అదే మాట అన్న తర్వాత ఉమాను షట్ అప్ అని పేర్కొన్న పింకీ అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా ఉమా సీరియస్ గా ఆమె మీదకు వెళ్లబోతున్నట్లుగా చూపించారు. వెంటనే రంగంలోకి దిగిన యాంకర్ రవి, సిరి హనుమంతు ఆమెను ఆపడం కూడా ప్రోమో లో కనిపిస్తోంది.

  English summary
  Bigg Boss Telugu 5 September 10 promo released, fight between Contestants started as bigg boss asked to say best and worst Contestants.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X