For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 5: ఉమా- లోబో ముద్దులాట, గగ్గోలు పెట్టిన ఆనీ మాస్టర్.. షన్ముఖ్ కి దీప్తి క్యూట్ ప్రపోజల్

  |

  తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లోని 12 ఎపిసోడ్ లో డే 11 హౌస్ కెప్టెన్సీ కోసం రెండు టీమ్ సభ్యులు హోరాహోరి పోరు పోరాడారు. అయితే ఈరోజు ఎపిసోడ్ లోనే రెండో వారానికి గాను హౌస్ కెప్టెన్ కూడా ఎంపికయ్యాడు. అయితే కెప్టెన్సీ టాస్క్ పూర్తయిన తర్వాత ఉమాదేవి లోబోల మధ్య ప్రేమ పొంగి పొరలడం ఆసక్తికరంగా మారింది. అసలు 12వ ఎపిసోడ్ లో ఏం జరిగింది? అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  ఆసక్తికరంగా 12వ ఎపిసోడ్

  ఆసక్తికరంగా 12వ ఎపిసోడ్

  బిగ్ బాస్ 2 వ వారం కెప్టెన్ కోసం కొన్ని ప్రత్యేకంగా టాస్క్ లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈగల్ టీమ్ అలాగే వూల్ఫ్ టీమ్ అంటూ రెండు టీములను ఏర్పాటు చేసి ఒకరికి ఒకరు శత్రువులా అన్నట్లుగా కొట్టుకునేలా చేశాడు బిగ్ బాస్. మరీ దారుణంగా నిన్నటి ఎపిసోడ్ లో అయితే ఉమాదేవి - అని మాస్టర్, ప్రియా - సన్నీ, సిరి - కాజల్ కొట్టుకునే దాకా వెళ్లారు మిగతా హౌస్ సభ్యులు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. ఇక ఈ రోజు కూడా జరిగిన అగ్గిపుల్ల టాస్క్ లో కూడా ఈగల్ టీం సభ్యులు విజయం సాధించారు. దాదాపు అన్ని టాస్క్ లలో ఆధిపత్యం చూపించిన ఈగల్ టీం సభ్యులు కెప్టెన్సీ పోటీదారులుగా నిలబడే అర్హత సాధించారు.

  కెప్టెన్గా ఎన్నికైన విశ్వ

  కెప్టెన్గా ఎన్నికైన విశ్వ

  బిగ్ బాస్ ఈగల్ టీం నుంచి నలుగురు సభ్యులను ఏకాభిప్రాయంతో ఎన్నుకుని ఆ నలుగురి పేర్లను చెప్పాలని కోరగా అనేక తర్జనభర్జనల అనంతరం హమీదా, ఆనీ మాస్టర్, ప్రియాంక సింగ్, విశ్వ నలుగురి పేర్లను సూచించారు. అయితే ఈ నలుగురు కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీ పడగా కొబ్బరికాయలు కొట్టి ఆ కొబ్బరికాయలలో ఉన్న నీళ్లు నలుగురు పోటీదారుల ముందు ఉంచిన ఒక గిన్నెలో పోయాలి అని అంటారు. ముందుగా ఎవరిది నిండుతుందో వాళ్లు విజేతలు అని బిగ్ బాస్ పేర్కొన్నాడు.. మిగతా ముగ్గురి కంటే కూడా ముందే విశ్వ ముందున్న బౌల్ ముందుగా నిండిపోవడంతో విశ్వ ఈ హౌస్ కి రెండవ కెప్టెన్గా ఎన్నికయ్యాడు.

  ఉమా లోబో ముద్దులాట

  ఉమా లోబో ముద్దులాట


  మొత్తం మీద ఆహ్లాదకరంగా ఈ ఎపిసోడ్ మొత్తం సాగిపోతూ కనిపించింది. విశ్వ కెప్టెన్ అయ్యాక ఉమా- లోబో ఇద్దరూ ఒకరి మీద ఒకరు ప్రేమ కురిపించు కుంటూ ముద్దులుపెట్టుకుంటూ ఉన్నట్లు కూడా కనిపించారు. అయితే అనీ మాస్టర్ వచ్చి దీనిని చూడలేకపోతున్నాం అని, ఇది ఎక్కడి కొత్త ట్రాక్ రా నాయనా ఆపేయండి అంటుంది. యాంకర్ రవి వచ్చి మీది యాక్టింగ్ అనే విషయం అర్థమైపోతుంది ఇంకా ఆపేయండి ఉంటాడు. అయితే నిజంగా యాక్టింగ్ కాదని మేమిద్దరం ఒకరంటే ఒకరికి ఇష్టం అని చెబుతూ ఉమాదేవి లోబోని వాటేసుకుంది. అయితే లోబో నవ్వుతూ ఉండడంతో ఇదంతా నాటకం అనే విషయం అర్థమవుతుంది.

  సింగిల్ బెడ్ గెలుచుకున్న లోబో

  సింగిల్ బెడ్ గెలుచుకున్న లోబో

  అయితే ఉమాదేవి - లోబో మధ్య మంచం వివాదం కొనసాగుతూనే ఉండగా హౌస్ లో మిగిలి ఉన్న మరో సింగిల్ బెడ్ తాళాలు తెరిచే సమయం అయిందని అయితే అది అంత ఈజీగా జరగదని lobo- ఉమా దేవి వేరువేరుగా స్కిట్స్ వేసి చూపించాలని ఆ స్కిట్స్ ను బట్టి హౌస్ సభ్యులు ఎవరికి ఇవ్వాలి అనేది నిర్ణయిస్తారు అని అంటాడు బిగ్ బాస్. అందులో భాగంగానే ప్రియాంకతో కలిసి ఒక ఆటో స్కిట్ వేసి కడుపుబ్బా నవ్వించాడు లోబో. మరో పక్క ఉమాదేవి కూడా సిరి హనుమంతుతో కలిసి అత్తా కోడళ్ళ మధ్య రియాలిటీ అలాగే భ్రమ ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ చేసి చూపించారు.

  ఎమోషనల్ అయిన శ్వేతా వర్మ

  ఎమోషనల్ అయిన శ్వేతా వర్మ

  అయితే ఇద్దరి లో కూడా లోబో బాగా చేసినట్లు హౌస్ సభ్యులకు కనిపించడంతో లోబోకి సింగిల్ బెడ్ ఇస్తున్నట్లుగా చూపించారు. ఇక 12 వ ఎపిసోడ్ లో పదకొండవ రోజున శ్వేతా వర్మ పుట్టినరోజు కావడంతో ఆమె చేత కేక్ కట్ చేయించి ఆమె కుటుంబసభ్యులు పంపిన వీడియో ప్లే చేసారు. శ్వేత వర్మ చాలా ఎమోషనల్ అవుతూ ఇలాంటి అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చినందుకు బిగ్ బి కు ధన్యవాదాలు తెలుపుతుంది. ఇక 12 వ ఎపిసోడ్ లో 12వ రోజు షణ్ముఖ్ బర్త్డే కావడంతో షణ్ముఖ ఇంటి నుంచి వచ్చిన వీడియో కూడా ప్లే చేసి చూపించారు. అదే వీడియోలో షణ్ముఖ్ ప్రేయసి దీప్తి సునయన కూడా మాట్లాడిన మాటలు చూపించారు.

  Nee Jathaga Movie Official Teaser
  దీప్తి సునైనా క్యూట్ విషెస్

  దీప్తి సునైనా క్యూట్ విషెస్


  ప్రతి రోజు ఒక గంట పాటు నిన్ను చూస్తున్నానని అయితే మిగతా ఇరవై మూడు గంటలు ఎలా గడుపుతున్నావు అని ప్రశ్నించింది. నువ్వు బాగానే ఉంటే పర్లేదు బాలేకపోయినా స్ట్రాంగ్ గా ఉండు అని చెప్పుకొచ్చింది. ఇక ఈ ఏడాది నీకేకులు కూడా నేనే కట్ చేస్తున్నాను అని చెబుతూ చాలా క్యూట్గా ఐలవ్యూ చెప్పింది. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమ చూసి మిగతా హౌస్ సభ్యులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. అలా 12వ ఎపిసోడ్ మొత్తం ఆహ్లాదకరంగా ఎలాంటి గొడవలు ఇబ్బందులు లేకుండా సాగిపోయింది.

  English summary
  bigg Boss Telugu season 5 episode 12 is full of love and affection. team celebrated Shweta Verma birth and shanmukh jaswanth birthday. Vishva elected as new captain in the house.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X