For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  bigg boss 5: నీకు సిరి ఏ యాంగిల్‌లో నచ్చింద్రా.. సిరి కోసం జెస్సి, షన్ను పులిహోర ట్రాక్

  |

  బిగ్ బాస్ హౌస్ లో స్నేహితులు ఎంత బలంగా ఉన్నా కూడా ఏదో ఒక సందర్భంలో మాత్రం గొడవలకు దిగడం కామన్. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి కాస్త ఎక్కువగానే ఫ్రెండ్షిప్ బాండ్స్ మొదలయ్యాయి. అయితే ఫ్యామిలీ రిలేషన్ తరహాలో కూడా కొంతమంది స్పెషల్ బాండింగ్ ను ఏర్పరచుకున్నారు. వారిమధ్య కూడా ఫైనల్ గా గొడవలు వచ్చేశాయి. ముఖ్యంగా హౌస్ లో మొదటి నుంచి చాలా ఎమోషనల్ గా కనిపిస్తున్నారు. అయితే శ్వేతా, ఆనీ మధ్యలో కూడా గొడవలు చాలానే మొదలయ్యాయి. చూస్తుంటే ఈ వారంలో వీరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు చాలా క్లియర్ గా అర్థం అవుతోంది. ఇక అందరిదీ ఒక తరహాలో ఉంటే సిరి, షణ్ముఖ్ బంధం ఏమిటి అనేది ఎవరికి అర్థం కావడం లేదు. వారికి తోడుగా మధ్యలో ఉండే జెస్సి ఎందుకు ఉన్నాడో తెలియదు అనే కామెంట్స్ వస్తున్నాయి. ఒక విధంగా ఇదంతా సిరి గేమ్ ప్లాన్ కూడా అయ్యి ఉండవచ్చని అనిపిస్తోంది.

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

   సెంటిమెంట్ కార్డ్

  సెంటిమెంట్ కార్డ్

  ఈ వారం ఎలిమినేషన్స్ సైతం చాలా రసవత్తరంగా జరిగాయి. కంటేస్తెంట్స్ మళ్ళీ ఎప్పటిలానే గొడవ పడుతూ నామినేషన్ చేశారు. ఈ క్రమంలో స్నేహితులు గా ఉండే వాళ్ళు కూడా గొడవ పడుతూ కనిపించారు. అయితే తర్వాత రోజు నుంచి మాత్రం ఎప్పటిలానే మళ్ళీ కొందరు నార్మల్ గానే కనిపించారు. హౌస్ లో కొందరు సెంటిమెంట్ కార్డ్ వాడుతున్నారు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అవసరం ఉన్నప్పుడు ఒకలా అవసరం లేనప్పుడు మరొక తరహాలో నటిస్తున్నారని కూడా తెలుస్తోంది. కొందరు అయితే దొంగ ప్రేమ కూడా చూపిస్తున్నట్లు సోషల్ మీడియాలో అనేక రకాల కామెంట్స్ వస్తున్నాయి.

  అలాంటి కంటెస్టెంట్ ఎక్కడ?

  అలాంటి కంటెస్టెంట్ ఎక్కడ?

  తెలుగులో బిగ్ బాస్ మొదలైనప్పటి నుంచి కూడా ప్రతి సీజన్ కు ఎవరో ఒకరు చాలా హైలెట్ అవుతున్నారు. ఎంతో కొంత జనాల్లో క్రేజ్ అందుకుంటూ వచ్చేవారు. కానీ ఈసారి అలాంటి పవర్ఫుల్ కంటెస్టెంట్ అయితే ఎవరూ పెద్దగా కనిపించడం లేదు. వారం వారానికి కూడా కంటెస్టెంట్స్ చాలా రకాలుగా మారిపోతున్నారు అని అనిపిస్తోంది. దీంతో ఎవరిపై జనాలు అంతగా ఆసక్తి కనబరచడం లేదు. ఇక్కడ స్నేహాలు బంధాలు కలకాలం నిలవవు అని అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ రిలేషన్ షిప్స్ మెయింటెయిన్ చేస్తే నిలదొక్కు వచ్చు అనే ఆలోచనతో రావడం పెద్ద మైనస్. అయినప్పటికీ కొందరు అదే తరహాలో ఎందుకు ఫాలో అవుతారో అనేది అర్థంకాని మిస్టరీ.

  ఎవరికీ తెలియని మిస్టరీ

  ఎవరికీ తెలియని మిస్టరీ

  మొదటి నుంచి కూడా షన్ను బిగ్ బాస్ హౌస్ లో ఒక సపరేట్ గ్యాంగ్ మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. అయితే ఆ గ్యాంగ్ ను షన్ను మెయింటైన్ చేస్తున్నాడా లేకపోతే సిరి తనకు మద్దతుగా ఉండాలని అలాంటి వాతావరణం క్రియేట్ చేసిందా అనేది మరో అనుమానం. సిరి, షన్ను, జెస్సీ ముగ్గురు కూడా బిగ్ బాస్ హౌస్ లో కలిసికట్టుగా గేమ్ ఆడుతున్నారు అనిపిస్తోంది. కానీ భవిష్యత్తులో వీరు మధ్యలో కూడా గొడవలు మొదలవుతాయని చాలా క్లారిటీ గా అర్థం అవుతోంది. చాలా సందర్భాల్లో షన్ను సిరిని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కావాలనే ఆడుకుంటున్నాడా లేకపోతే చిన్న చిన్న మాటలకే సిరి కావాలని నటిస్తోందా అనేది ఎవరికీ తెలియని మిస్టరీ అని చెప్పవచ్చు.

  హేళన చేస్తుంటే..

  హేళన చేస్తుంటే..

  ఇక శుక్రవారం ఎపిసోడ్ లో జెస్సీ షన్ను మరొకసారి వారి పులిహోర మాటలతో సిరిని పైకి లేపి ప్రయత్నం చేశారు. కానీ చివరికి షన్ను నోటిదూల కారణంగా మళ్ళీ ఆమె అలక మొదలుపెట్టింది. హేళన చేసి మాట్లాడితే నాకు ఏమాత్రం నచ్చదు అని సిరి జెస్సి తో మాట్లాడుతూ షన్ను గురించి చెబుతుంది. అతను జోక్ గా అన్నాడు అని జెస్సి నచ్చజెప్పే ప్రయత్నం చేసాడు. వేరే వాళ్లతో కంపేర్ చేసి హేళన చేస్తుంటే బాధగా అనిపిస్తుందని అనడంతో.. వాడు ఏదో అన్నాడని కోపంలో నువ్ రాంగ్ స్టెప్ తీసుకోకు అని జెస్సీ చెప్పడంతో.. ‘వాడు అన్నంత మాత్రాన అయిపోతుందేంట్రా నేనేమైనా పిచ్చదాన్నా.. లేక చిన్న పిల్లనా? అని సిరి మరో సమాధానం ఇస్తుంది.

  Bigg Boss Telugu 5 : కాజల్, సిరిలకు దిమ్మతిరిగే షాక్.. మా ఇష్టం అంటూ రెచ్చిపోయి..!| Filmibeat Telugu
   ఏ యాంగిల్‌లో నచ్చింద్రా..

  ఏ యాంగిల్‌లో నచ్చింద్రా..


  ఇంతలో షణ్ముఖ్ వచ్చి కూల్ చేసే ప్రయత్నం చేసాడు. ఇంతలో ప్రియాంక.. నువ్ నాకు ప్రపోజ్ చేయాల్సి వస్తే ఎలా చేస్తావ్ అని జెస్సిని అడుగుతుంది.. నేను నీకు ప్రపోజ్ చేయను అంటూ సిరికి మాత్రమే చేస్తా అని అంటాడు. ఆ మాటకు షన్ను నీకు సిరి ఏ యాంగిల్‌లో నచ్చింద్రా' అని హేళన చేస్తాడు. అదే మాట నేను నిన్ను అడిగితే ఏం చేస్తావ్ అని జెస్సీ జెస్సి అడగడంతో.. నాకు హైట్ లుక్స్ ఫిగర్ కంటే గుణం ఇంపార్టెంట్ అని షణ్ముఖ్ ఆన్సర్ ఇస్తాడు.. దీంతో సిరి మళ్ళీ అలక మొదలు పెట్టింది. బెడ్ మీదకు వెళ్లి ఉండడంతో షన్ను మళ్ళీ కూల్ చేసే ప్రయత్నం చేసాడు.

  English summary
  Bigg boss telugu 5 Shanmukh Jaswanth and siri another funny track
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X