For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg boss telugu 5: సిరికి సపోర్ట్ చేసి అడ్డంగా దొరికిపోయిన షణ్ముఖ్.. ఆమె టీ షర్ట్ లో చేయి పెట్టాడని నిందవేసి.

  |

  బిగ్ బాస్ సీజన్ 5 మొత్తానికి రెండు వారాలను పూర్తిచేసుకుని మంచి రేటింగ్ ను సంపాదించుకుంటోంది. కంటెస్టెంట్స్ చాలా బాగా పోరాడుతున్నారు అంటూ నాగార్జున కూడా ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా అభినందించారు. ఇలానే కసిగా మీ ఆటను మీరు ఆడండి అంటూ ఏమాత్రం తగ్గ వద్దని చెప్పాడు. అయితే హౌస్ లో కొంతమందిని సెట్ చేయాల్సిన అవసరం ఉందని ముందుగానే చెప్పిన నాగార్జున కొంతసేపు అందర్నీ టెన్షన్ కూడా పెట్టారు. తప్పులు చేసిన వారిని నిలదీస్తున్నారు అంతేకాకుండా జరిగిన పొరపాట్లను కూడా సరిదిద్దారు.

  అయితే ఈ వారంలో జరిగిన ఫిజికల్ టాస్క్ లో సన్నీ పై ఒక నింద వేయడం జరిగింది. అతను తన టీ షర్ట్ లో చేయి పెట్టాడు అని కూడా అందరు తప్పుగా అనుకునేలా సిరి చెప్పడం కొత్త నెగిటివ్ కామెంట్ ను కూడా అందించింది. సిరికి మద్దతుగా షణ్ముఖ్ జస్వంత్ కూడా నిలిచాడు. చివరికి నాగార్జున వీడియోలు చూపించి అందరికీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. సిరికి సపోర్ట్ చేయబోయే షణ్ముఖ కూడా అడ్డంగా దొరికిపోయాడు.

  ఫిజికల్ టాస్క్ లలో..

  ఫిజికల్ టాస్క్ లలో..

  బిగ్ బాస్ షోలో కొన్నిసార్లు ఫిజికల్ టాస్క్ లో ఒకరికొకరు తోసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. ఆ సమయంలో అమ్మాయిలు అబ్బాయిల మధ్య జరిగే పోరాటాలు చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. కొందరు వాటిని అర్థం చేసుకుని ముందుకు వెళుతుంటే మరికొందరు మాత్రం కావాలని ఇతరులను నిందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ విషయంలో నాగార్జున ప్రతిసారి కూడా ఎంతో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. తప్పు జరిగితే వెంటనే వారికి కౌంటర్ కూడా ఇస్తున్నారు. ఇక తప్పు జరగకపోతే మాత్రం వారి గుట్టును బయటకు లాగుతూ తప్పు చేయని వారిని నిర్దోషిగా బయటకు తీసుకువస్తున్నారు.

  సన్నీ ఎంత మొత్తుకున్నా..

  సన్నీ ఎంత మొత్తుకున్నా..

  అయితే ఈ వారం జరిగిన ఒక ఫిజికల్ టాస్క్ లో సన్నీపై సిరి విరుచుకుపడిన విషయం తెలిసిందే. టాస్క్ లో భాగంగా తన కడుపులో దాచుకున్న బెటాన్ ను సన్నీ లాగేందుకు ప్రయత్నం చేశాడని ఎంత చెప్పినా కూడా కావాలని టీ షర్ట్ లోకి చేయి పెట్టాడు అని కామెంట్ చేసింది. సిరి టీం సభ్యులు కూడా ఆ విషయంలో సన్నీని ఎంతగానో నిందించారు కూడా. అసలు అలాంటి తప్పు చేయలేదు అంటూ సన్నీ ఎంత మొత్తుకున్నా కూడా అందరూ అతన్ని టార్గెట్ చేసి క్యారెక్టర్ని బ్యాడ్ చేసే ప్రయత్నం చేశారు. ఆ విషయం చాలావరకు సన్నీని ఎంతగానో బాధించింది.

  కావాలని చేయలేదు

  కావాలని చేయలేదు

  ఇక అదే విషయంపై ఆరా తీసిన నాగార్జున తప్పు జరిగిందా లేదా అనే విషయం లో మరొకసారి ఇంటి సభ్యులను అడిగే ప్రయత్నం చేశాడు. మొదట సన్నిని అడుగగా అప్పుడు నేను పొరపాటున ఎక్కడైనా తాకి ఉండవచ్చునేమో కానీ కావాలని అయితే చేయలేదు. అసలు చేయి అయితే పెట్టలేదు అని నమ్మకంగా చెప్పగలను. అయినప్పటికీ అప్పుడు మా టీం సభ్యులు లోని అమ్మాయిలను పిలిచాను. అదే సమయంలో శ్వేత కనిపించడంతో గట్టిగా అరిచాను. ఆమె దగ్గర నుంచి బెటాన్ ను తీసుకోవాలని చెప్పినట్లు సన్నీ చాలా క్లియర్ గా చెప్పాడు. ఇక అదే విషయాన్ని శ్వేతాని అడుగగా ఆమె అయోమయంలో ఎటు తేల్చలేకపోయింది.

  అడ్డంగా దొరికిపోయిన షణ్ముఖ్

  అడ్డంగా దొరికిపోయిన షణ్ముఖ్

  ఆమె సరిగ్గా చెప్పకపోవడంతో పక్కనే ఉన్న షణ్ముఖ్ ని కూడా నాగర్జున అడిగే ప్రయత్నం చేశారు. అయితే షణ్ముఖ్ జస్వంత్ మరోసారి సన్నీ పై స్పెషల్ గా టార్గెట్ చేసినట్లు కామెంట్ చేశాడు. అవును సార్ ఆమె టీ షర్ట్ లో అతను చేయి పెట్టడం చూశాను అంటూ వివరణ ఇవ్వడంతో మరోసారి అందరూ అది నిజం అని అనుకున్నారు. ఇక అదే విషయాన్ని నాగార్జున మరోసారి సిరిని గట్టిగా అడుగగా ఆమెది తప్పు అని అన్నారు.

  ఇదివరకే షణ్ముఖ్ జస్వంత్ సన్నీకి మధ్య గొడవలు అయితే జరిగాయి. ఫిజికల్ టాస్క్ లో ఒకరినొకరు తోసుకున్నారు. అప్పుడు సన్నీ పై షణ్ముఖ్ చాలా సీరియస్ అయ్యాడు. ఇక సిరి కోసం మరోసారి సన్నీని బుక్ చేసే ప్రయత్నం చేశాడు. తెలిసి చేశాడు తెలియక చేశాడో కానీ అతను టీషర్ట్ లో చేయి పెట్టాడు అంటూ నింద వేయడం అందరినీ ఒక్క సారిగా ఆశ్చర్యపరిచింది.

  క్లాస్ పీకిన నాగార్జున

  క్లాస్ పీకిన నాగార్జున

  ఇక అందులో నిజం తెలుసుకోవడానికి నాగార్జున మరొకసారి జరిగిన సన్నివేశాన్ని టీవీ లో చూపించారు. ఇక అందులో సన్నిధి ఎలాంటి తప్పు లేదని కేవలం చేతిలు పట్టుకొని వెనక్కి తీసినట్లు అనిపించింది. దీంతో నాగార్జున సిరికి అలాగే షణ్ముఖ్ కు దిమ్మ తిరిగి ఇద్దరికీ కౌంటర్ ఇచ్చారు. తప్పు లేకుండా ఒకరి క్యారెక్టర్ ను అలా బ్యాడ్ చేయకూడదు అంటూ క్లాస్ పీకారు.

  ఇక అప్పుడు మళ్ళీ సిరి, షణ్ముక్ ఇద్దరు కూడా మాట మార్చారు. ఆటలో భాగంగా అలా జరిగి ఉండవచ్చు అని అనుకున్నాము కానీ ఆ తర్వాత మళ్ళీ అందరు లైట్ తీసుకన్నాం అని కూడా చెప్పారు. ఇక నాగార్జునకు సన్నీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాడు. ఇది తేలిక పోయి ఉంటే నన్ను అందరు నిజంగానే బ్యాడ్ అనుకునేవారు అంటూ ఇప్పుడు నాకు కొంచెం ప్రశాంతంగా ఉందని తెలియజేశాడు.

  English summary
  Bigg boss telugu 5 Shanmukh Jaswanth another mistake in sunny issue..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X