For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 5: నా మొగుడితో కూడా ఇలానే.. ఉమా ఆగ్రహం, లోబో యాటిట్యూడ్

  |

  బిగ్ బాస్ సీజన్ 5 కూల్ గా విభిన్నమైన సెలబ్రిటీలతో మొదలైనప్పటికీ రోజురోజుకి ఇంట్లో వాతావరణం వేడెక్కుతోంది. కంటెస్టెంట్స్ మొదట్లో చాలా ఫ్రెండ్లీగా కొనసాగి ఇప్పుడు మాత్రం ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఒకరోజు మిత్రులు గా ఉన్నవారు మరొకరోజు శత్రువులుగా మారుతున్నారు. ఇక బిగ్ బాస్ కూడా రోజు రోజుకి మధ్యలో గొడవలు స్థాయిని మరింత పెంచుతున్నాడు.

  ఇక రెండవ వారం నామినేషన్స్ తో సరికొత్త మలుపు తిప్పిన బిగ్ బాస్ ఈరోజు నుంచి అసలైన ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు. సరికొత్త టాస్క్ లతో గట్టిగా పోరాడిన వాడే ఎలిమినేషన్స్ నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఇక ప్రోమో తో కూడా బిగ్ బాస్ నిర్వాహకులు మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు.

  హాట్‌గా హాట్‌గా బాలయ్య హీరోయిన్ .. మరో ప్రస్థానంలో గ్లామరస్‌గా

  విభేదాలు మళ్ళీ క్లియర్ అవుతాయా?

  విభేదాలు మళ్ళీ క్లియర్ అవుతాయా?

  నామినేషన్స్ లో వచ్చిన విభేదాలు మళ్ళీ క్లియర్ చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ అందులో ఎంతమంది సమస్యల క్లియర్ అవుతాయి అనేది అర్థం కావడం లేదు. ఒకసారి నామినేట్ చేసిన అనంతరం తప్పకుండా ఆ ప్రభావం మిగతా ఐదు రోజుల్లో ఎంతో కొంత చూపిస్తుంది. ఎలిమినేట్ అయ్యే వరకు కూడా ఒకరికొకరు పోట్లాడుకునే ఉండడం కనిపిస్తుంది. అయితే కొందరు మాత్రం వీలైనంత త్వరగా పోటీదారులను మంచిగా చేసుకోవాలని చూస్తున్నారు.

  Ram Charan ఖాతాలో మరో ఖరీదైన కారు.. ఇండియాలోనే తొలి వ్యక్తిగా.. ధర ఎంతో తెలుసా?

  లోబో vs శ్వేతా

  లోబో vs శ్వేతా

  శ్వేత మొదటి రోజు నుంచి కూడా సైలెంట్ గా ఉండడం లోబోకు నచ్చలేదు. ఇక ఆమెను నామినేట్ చేసిన విషయం తెలిసిందే. శ్వేత కూడా అదే తరహాలో లోబోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నామినేట్ చేసింది. ప్రతిరోజు అక్కడి నుంచి ఇక్కడికి తిరుగుతాను అంటూ లోబో చేసిన కామెంట్ ఆమెకు ఏమాత్రం నచ్చలేదు అని అర్థమైంది. ఇంకా అదే విషయాన్ని చెబుతూ మరింత కోపానికి లోనవుతుంది.

  అంతకుమించి అనేలా హాట్ లుక్స్ తో కవ్విస్తున్న అరియానా గ్లోరీ.. లేటెస్ట్ ఫొటోస్

  యాటిట్యూడ్ ఎప్పుడు చూపించాను

  యాటిట్యూడ్ ఎప్పుడు చూపించాను

  అంతేకాకుండా లోబో మానస్ పై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నువ్వు నా దగ్గర యాటిట్యూడ్ చూపియ్యకు హీరో కదా అంటూ నామినేషన్ సమయంలో గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. అదే విషయాన్ని మానస్ కూడా అడిగేందుకు ప్రయత్నం చేశాడు. నీ వద్ద నేను ఎప్పుడూ యాటిట్యూడ్ చూపించాను అని అడిగాడు దానికి లోబో ఎలాంటి సమాధానం ఇస్తాడో చూడాలి.

  చిట్టిపొట్టి డ్రెస్సుల్లో మరోసారి షాక్ ఇచ్చిన అషు రెడ్డి.. హాట్ థైస్

  రవి vs నట్రాజ్ మాస్టర్

  రవి vs నట్రాజ్ మాస్టర్

  ఇక రవికి నట్రాజ్ మాస్టర్ కూడా విభేదాలు గట్టిగానే వస్తున్నాయి ఈ సమస్యను క్లియర్ చేసుకునేందుకు యాంకర్ రవి కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ నట్రాజ్ మాస్టర్ అందుకు ఏ మాత్రం ఒప్పుకోలేదు. ఇక నామినేషన్ సమయంలో ఒక గుంట నక్క తన కోసం ప్రణాళికలు రచిస్తోంది అని అనడంతో రవి ఆ విషయంపై కూడా అడిగే ప్రయత్నం చేశాడు. నట్రాజ్ మాస్టర్ కూడా రవి విషయంలో కొంచెం కూడా తగ్గడం లేదు. అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు అంటూ మరోవైపు ప్రియ కూడా ఉమ తో మాట్లాడటం విశేషం.

  లోబో రివర్స్ అవ్వడంపై రవి అప్సెట్

  లోబో రివర్స్ అవ్వడంపై రవి అప్సెట్

  ఇక సింగర్ రామచంద్ర తో జెస్సి స్నేహం గా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. కనెక్ట్ అవ్వడం లేదు అని నామినేట్ చేసిన జెస్సీ కొంతమంది కావాలని తొక్కేసారు అంటూ వారి గురించి తర్వాత చెప్తాను అని ఏదో మాట్లాడుతున్నాడు. లోబో రవి స్నేహం గురించి అందరికీ తెలిసిందే కానీ లోబో మాత్రం రవి ని మిత్రుడు గా ఒప్పుకోవడంలేదు. నామినేషన్స్ లో అతని ప్రతిసారి టార్గెట్ చేస్తున్నాడు. ఒక వైపు రవి అతనితో స్నేహంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటే నామినేషన్స్ వచ్చినప్పుడు మాత్రం లోబో ఒక్కసారిగా రివర్స్ అయిపోతున్నాడు. అదే విషయాన్ని రవి ప్రస్తావించాడు.

  నా మొగుడితో కూడా ఇలానే..

  ఇక ఉమా కోపాన్ని తగ్గించుకోవాలి అని కాస్త ప్రేమ కూడా ఉండాలని సన్నీ అర్థమయ్యేలా చెప్పాలని అనుకున్నాడు. అందుకు ఉమ మాత్రం తన నుంచి కోపాన్ని మాత్రమే తీసుకుంటున్నారని ప్రేమను తీసుకోవడం లేదని చెబుతోంది. ఒకసారి ప్రేమను కూడా చూపించండి అని సన్నీ అడగడంతో ఇప్పుడు సడన్ గా చూపించాలి అంటే తనకు రాదని నేను మా ఇంట్లో నా చెల్లి, నా మొగుడితో అయినా కూడా అలానే మాట్లాడుతాను అంటూ ఉమా మరోసారి కౌంటర్ ఇచ్చింది.

  అందుకు సన్నీ అందరూ ఒకేలా ఉండరు ఇక్కడ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారని చెబుతాడు. ఇక తన మెంటాలిటీ తన ఇష్టం అని ఎవరైనా అంగీకరిస్తే అంగీకరిస్తారు లేదంటే లేదు అని ఉమ మరో కౌంటర్ ఇస్తుంది. మరి వీరందరి మధ్య ఉన్న అభిప్రాయభేదాలు ఎలా క్లియర్ అవుతాయో ఈరోజు ఎపిసోడ్ లో చూడాలి.

  English summary
  Bigg boss telugu 5 uma devi aggressive lobo attitude.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X