For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 5 Unseen: కన్నుకొట్టి సిగ్నేల్ ఇచ్చేస్తా, నన్ను నమ్ము.. గుట్టుగా హామీదాతో యాంకర్ రవి ప్లాన్!

  |

  బిగ్ బాస్ హౌస్ లో ఎప్పటికప్పుడు వాతావరణం ఊహించని విధంగా మారుతోంది. మొదటి వారం ఎలిమినేషన్ అనంతరం కంటెస్టెంట్స్ ఏ మాత్రం తగ్గకుండా ఎగబడి పోటీ పడేందుకు
  సిద్ధమవుతున్నారు. రెండవ వారం కూడా నామినేషన్ పోరు చాలా గట్టిగానే జరిగింది. కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు కోప్పడుతూ.. నామినేట్ చేసుకోవడం హాట్ టాపిక్ గా నిలిచింది. మొదటి వారం అయితే నాగార్జున ఎవరిని కూడా ఏమీ అనలేదు.

  కానీ రెండవ వారం నుంచి ఆయన వేలెత్తి చూపే అవకాశం ఉందని అనిపిస్తోంది. ఇక ఎవరికి వారు గేమ్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. అయితే అందరి కంటే పెద్దగా యాంకర్ రవి కూడా తనదైన శైలిలో ప్రణాళికలు రచిస్తున్నాడు. ఇటీవల యాంకర్ రవి ఒక ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. హామీదాతో కన్ను కొట్టే సిగ్నల్ కూడా ఇస్తాను అని చెప్పడం విశేషం.

  హాట్‌గా హాట్‌గా బాలయ్య హీరోయిన్ .. మరో ప్రస్థానంలో గ్లామరస్‌గా

  గేమ్ స్ట్రాటజీ..

  గేమ్ స్ట్రాటజీ..

  బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం నామినేషన్స్ లో ఉన్న వారు ఎవరు బయటకు వెళ్తారు అనేది కాస్త హైలెట్ గా నిలుస్తోంది. ఎందుకంటే ఎవరికి వారు చాలా బలంగా ముందుకు సాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కంటెస్టెంట్స్ ను ఎదుర్కోవడంలో ఎవరు తగ్గడం లేదు అని చెప్పవచ్చు. తప్పు ఉన్నా సరే గట్టిగా మాట్లాడుతూ వారి కోపాన్ని చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు.

  అయితే బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఎలా ఉన్నా కూడా స్ట్రాటజీని ఫాలో అవ్వడం మరొక లెవెల్ లో ఉంటుంది. అయితే ఫార్మాట్ లో వెళ్లాలి అంటే చాలా కష్టమైన పని. ఏ మాత్రం దొరికిపోయినా కూడా కంటెస్టెంట్స్ చివరి వరకు కూడా ఇతరులతో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎవరికీ నమ్మడానికి వీలు లేదు కాబట్టి ఆచితూచి అడుగులు వేయాలి. ఒకవేళ స్ట్రాటజీ క్లిక్కయితే ఎలిమినేషన్స్ లో కొంత హెల్ప్ అవ్వచ్చు.

  అంతకుమించి అనేలా హాట్ లుక్స్ తో కవ్విస్తున్న అరియానా గ్లోరీ.. లేటెస్ట్ ఫొటోస్

  లోబో రివర్స్ కౌంటర్

  లోబో రివర్స్ కౌంటర్

  యాంకర్ రవి కూడా తనదైన శైలిలో గేమ్ ఫాలో అవ్వాలని డిసైడ్ అయ్యాడు. మొదటివారం తప్పకుండా హౌజ్ లో ఉంటాడని అతనికి కూడా బాగా తెలుసు. అంతేకాకుండా చివరి వరకు ఉంటాడని కూడా ఇప్పటికే అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఆ విషయాన్ని పక్కన పెడితే రవి ఆటలో భాగంగా అతను కంటెస్టెంట్స్ ను తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. మొదటి నుంచి కూడా లోబో తనకు మద్దతుగా ఉంటాడని రవి అనుకున్నాడు. అయితే అతను ఎంతో సన్నిహితంగా ఉన్నప్పటికీ నామినేషన్స్ వచ్చేసరికి రివర్స్ అవుతున్నాడు.

  చిట్టిపొట్టి డ్రెస్సుల్లో మరోసారి షాక్ ఇచ్చిన అషు రెడ్డి.. హాట్ థైస్

  గుంట నక్క ఎవరు?

  గుంట నక్క ఎవరు?

  రెండుసార్లు రవిని నామినేట్ చేసిన లోబో హౌస్ లో మాత్రం స్నేహానికి తావులేదు అని చాలా ఓపెన్ గా చెప్పేశాడు. అయితే రవి మాత్రం ఇంతవరకు లోబోపై రివేంజ్ తీర్చుకోలేదు. మిగతా వాళ్ళు కూడా మెల్లగా రవి వైవు శత్రువులాగా మారుతున్నారు. నట్రాజ్ మాస్టర్ కూడా తెలియకుండానే నెగిటివ్ అయిపోయాడు. రవిని నామినేషన్ లో కూడా నట్రాజ్ మాస్టర్ టార్గెట్ చేసినట్లు అనిపించింది. ఒక గుంట నక్క తన కోసమే హౌస్ లోకి దిగినట్లు అనిపించిందని మిగతా వారిని కూడా గొర్రెలు గా మార్చే తన వైపుకు ఉసి గోలుపుతోందని డైరెక్ట్ గా కామెంట్స్ చేశాడు. అది రవిని అన్నట్లు అనిపించినట్లు అందరికి అర్ధమయ్యింది.

  హామీదాతో రవి స్ట్రాటజీ..

  హామీదాతో రవి స్ట్రాటజీ..

  రవి వైపు మెల్లమెల్లగా నెగిటివ్ వైబ్రేషన్స్ అయితే ఎక్కువ అవుతున్నాయి అని అనిపిస్తుంది. దీంతో దెబ్బకు అతను అలర్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సీనియర్ యాక్టర్ ఎలాగైనా వీలైనంత వరకు కొంతమందికి తన వైపు తిప్పుకోవాలని చూస్తున్నాడు కూడా. అతను హామీదాపై రాజకీయ ఎత్తుగడను ఫాలో వేస్తున్నట్లు అనిపిస్తోంది.

  స్ట్రాటజీ గేమ్ లో భాగంగా హామీదాతో ఒప్పందం కుదుర్చుకోవడానికి మెల్లగా మంచిక చేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. గేమ్ లో ఎక్కువ రోజులు ఉండాలంటే ఒకరికొకరం తప్పకుండా ఏదో ఒక విధంగా సహాయం చేసుకోవాలని అందుకే నాకు నువ్వు హెల్ప్ చెయ్ నేను కూడా నీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను అని యాంకర్ రవి చెప్పాడు.మరో రెండు మూడు రోజుల వరకు టాస్క్ లు ఉంటాయి కాబట్టి మనం ఇద్దరం కలిసి పని చేస్తే సేఫ్ గా ఉండొచ్చు అని కూడా హామీదకు రవి వివరణ ఇచ్చాడు.

  కన్ను కొట్టి సిగ్నల్ ఇవ్వాలి..

  కన్ను కొట్టి సిగ్నల్ ఇవ్వాలి..

  అందుకు హామీదా కూడా ఒప్పుకున్నట్లే కనిపించినప్పటికీ కాస్త చిరునవ్వు కూడా విసిరేసింది. దీంతో రవికి నమ్మకం కలగలేదు. మరోసారి ఆమెతో మాట్లాడుతూ.. ఒకసారి ఆలోచించుకు రమ్మని చెప్పాడు. ఇంకా చాలా సమయం ఉందని ఒకవేళ ఒప్పుకుంటే నేను నీకు సిగ్నల్ కూడా ఇస్తాను, నేను కుడి కన్ను కొడితే నాకు సపోర్ట్ చేయాలి. లేదు సపోర్ట్ చేయను అంటే ఎడమ కన్ను కొట్టాలి. ఇదే మన సిగ్నల్ అని రవి హామిదాకు చెప్పాడు.

  ఇక ఇంతలో అక్కడికి ప్రియా, లాహరి వచ్చి ఎంత మాత్రం ఇన్ఫ్లుయెన్స్ కావద్దని చెబుతారు. ముఖ్యంగా ప్రియా హామీదా మరీమరీ చెబుతుంది. దీంతో ఆమెను రవి అక్కడి నుంచి వెళ్ళమని ఉంటాడు. ఇక ఎలాగైనా ఇద్దరి మధ్యలో నమ్మకం అనేది ఉండాలి అని ట్రస్ట్ చేయాలని రవి మరోసారి హామీదాకు వివరిస్తాడు. మరి రవి చెప్పినట్లుగా హామీదా మద్దతు ఇస్తుందో లేదో చూడాలి.

  English summary
  Bigg Boss Telugu 5 Unseen Episode: anchor ravi strategy on, Hamida Khatoon.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X