For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 5: 'ఉమా' మీద మరోసారి రెచ్చిపోయిన ప్రియాంక.. పోవే ఉమా పో అంటూ షాకింగ్ గా!

  |

  బిగ్ బాస్ తెలుగు 5వ సీజన్ రెండో వారం నామినేషన్ ప్రక్రియ నిన్న రసవత్తరంగా సాగింది. మరీ ముఖ్యంగా శ్వేత వర్మలో ఇంత ఫైర్ ఉందా అని అంతా షాక్ అయ్యే విధంగా ఆమె ఓవర్ రియాక్ట్ అయింది. ఇక ఉమా దేవి వెర్రి ** అంటూ బూతులు మాట్లాడడంతో అనీ మాస్టర్ ఏడ్చేసింది. ఇక నటరాజ్ మాస్టర్ ప్రియను ఉద్దేశించి గుంట నక్క అంటూ కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. అంతే కాక ఉమాను ఉదేశించి ప్రియాంక.. 'సరే పోవే ఉమా పో' అంటూ కామెంట్ చేయడం సంచలనంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

  రచ్చ రచ్చే

  రచ్చ రచ్చే


  సోమవారం నామినేషన్‌ ప్రక్రియతో హౌస్ మేట్స్ మధ్య పెద్ద చిచ్చు పెట్టినట్టే కనిపించింది. ముందుగా ఈ నామినేషన్స్ గొడవ పెట్టడానికి హౌస్ మేట్స్ అందరినీ రెండు టీములుగా విడిదీశారు. వూల్ఫ్స్ (నక్క), ఈగల్ (గ్రద్ద) అనే టీములుగా విడతీయగా నక్క టీములో ఉమాదేవి, లహరి, రవి, జెస్సీ, మానస్‌, సన్నీ, కాజల్‌, శ్వేత, నటరాజ్‌ ఉండగా, గద్ద టీములో లోబో, యానీ మాస్టర్‌, శ్రీరామ్‌, ప్రియ, హమీదా, విశ్వ, సిరి, షణ్ముఖ్‌, ప్రియాంక ఉన్నారు. ఇక హౌస్‌మేట్స్‌ తమ టీమ్ సభ్యులను కాకుండా ఇతర టీమ్ సభ్యులను నామినేట్ చేయాలనీ చెబుతూ నామినేట్‌ చేయాలనుకున్న కంటెస్టెంట్‌పై పెయింట్‌ పూయాల్సి ఉంటుందని చెబుతూ రెడ్ పెయింట్ కూడా సిద్ధం చేసారు. అయితే సిరి కెప్టెన్‌ కావడంతో ఆమెను నామినేషన్ నుంచి తప్పించుకుంది, కానీ ఆమె మొదట నామినేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

  సిరి సేఫ్

  సిరి సేఫ్

  అందులో భాగంగానే ముందు సిరి.. ఉమాదేవిని, నటరాజ్‌ మాస్టర్‌ను నామినేట్‌ చేసింది. ఆ తరువాత నటరాజ్‌ మాస్టర్‌ వెళ్లి ప్రియ మంచి కోసం చెప్పినా తను నన్ను పక్కకు పిలిచి తిట్టేదని, చెబుతూ ఆ విషయంలో తాను హర్ట్ అయ్యాను అని అందుకే నామినేట్ చేస్తున్నాం అని చెబుతూ నామినేట్ చేశాడు. ఈ విషయంలో కూడా ఘాటుగానే స్పందించింది ముందు మీరు పక్కన ఉన్న వాళ్లను ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఆపేయండి ఎవరికి వాళ్లు ఆడేలా అవకాశం ఇవ్వండి అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది.

  నటరాజ్ vs ప్రియ

  నటరాజ్ vs ప్రియ

  నటరాజ్ మాస్టర్ ఆ తర్వాత ప్రియాంక సింగ్ ను నామినేట్ చేశాడు తాను వంట వండే విషయంలో ఎలాంటి దురుద్దేశాలు లేకుండా ఒక కౌంటర్ వేస్తే దానిని పట్టుకుని తన ఫోటో చంపడం నచ్చలేదని చెబుతూ ఆమెను నామినేట్ చేశాడు. ఇక యానీ మాస్టర్ కూడా ఉమాదేవి తనతో మాట్లాడిన విధానం తనకు నచ్చలేదని ఆమెను, వంట విషయంలో నాగార్జున చెప్పినప్పటి నుంచి చేస్తున్నావు ఒక్కరోజు చూసి నాలుగు రోజుల విషయాన్ని నేను పక్కన పెట్టలేదు అని చెబుతూ కాజల్ ను నామినేట్ చేసింది. సన్నీ పెద్దగా లేవని రీజన్స్ లేవని చెబుతూనే టాస్కుల్లో ఇంకా యాక్టివ్‌ కావాలని ప్రియను, కిచెన్‌లో ఉండకుండా ఆటలోకి రమ్మంటూ ప్రియాంక సింగ్‌ను నామినేట్‌ చేశాడు, దానికి ప్రియాంక ఘాటుగానే స్పందించింది.

  లోబో vs మానస్

  లోబో vs మానస్


  మరో పక్క మానస్‌.. తాను కెప్టెన్సీ టాస్క్ ఆడుతున్న సమయంలో తాను కెప్టెన్గా కాకుండా అడ్డుకున్నందుకు లోబోను నామినేట్‌ చేశాడు. అయితే ఈ విషయాన్ని ముందుగా ఏమాత్రం ఊహించని లోబో.. LOBO నాటే నేమ్‌, ఇట్స్‌ ఏ బ్రాండ్‌, పెద్ద పెద్ద హీరోలు నన్ను గుర్తుపడతరు అని కాసేపు తన గురించి గొప్పగా చెప్పుకుంటూ, నేను మన అనుకుని సపోర్ట్ చేయడానికి వెళితే నాకే ఇంత బాధ పెట్టారు ఉన్నట్లుగా మాట్లాడుతూ అసహనానికి లోనయ్యాడు. ఇదే మాట గతంలో ప్రస్తావించినప్పుడు ఎందుకు చెప్పలేదని మానస్‌ అడగ్గా.. 'మీరు హీరో కదా! విననీకి రెడీ లేరు, అందుకే నేను చెప్పే ప్రయత్నం చేయలేదు, నా ముందు యాటిట్యూడ్‌ చూపిస్తున్నవ్‌, కానీ నా ముందు చిన్నపోరడివి ' అని ఆవేశపడ్డాడు, దానికి ముందు నేను నిజంగా చిన్న పిల్లవాడిని అంటూ ప్రియకు రంగు పూసి ఆమెను కూడా నామినేట్‌ చేశాడు.

  ఉమా చాలెంజ్

  ఉమా చాలెంజ్

  ఇక ఆ తర్వాత విశ్వ.. కంటెస్టెంట్లు కూర లేదన్నప్పుడు నాగార్జున ఇచ్చిన ఆలూ కూర వారికి పెట్టకపోవడం సరికాదంటూ ఉమాదేవిని నామినేట్‌ చేశాడు, కానీ నాగార్జున ఆ కూరను ఎవరికీ షేర్‌ చేయొద్దన్నాడని, ఆ మాటకు తాను కట్టుబడి ఉన్నానని ఉమ స్పష్టం చేసింది. అంతే కాక ఈ క్రమంలో ఆమె వెర్రి** అంటూ బూతులు కూడా మాట్లాడటంతో ప్రియాంక సింగ్‌ పడీపడీ నవ్వింది. ఉమాదే వి తనవంతు రాగానే ఓ రేంజ్‌లో అందరికీ సవాలు విసిరింది. దమ్ముధైర్యం, బుద్ధిబలం ఉన్నవాళ్లు నాతో ఆడటానికి ట్రై చేయండి అని చాలెంజ్‌ చేసింది.

  Vijay Raja Interview With YouTube Star Alankrutha | Gem Movie
  పోవే ఉమా పో

  పోవే ఉమా పో


  నా పుట్టలో వేలు పెడితే నేను ఊరుకుంటానా అంటూ యానీ మాస్టర్‌, విశ్వలను నామినేట్‌ చేసింది. ఈ క్రమంలో ఉమాదేవి, ప్రియాంకసింగ్‌, యానీ మాస్టర్‌ల మధ్య పెద్ద ఫైటే నడిచింది. అయితే ఆనీ మాస్టర్ మాట్లాడుతూ మేము మీకు గౌరవం ఇచ్చి మాట్లాడుతుంటే మీరు ఇలా చేస్తారా అని అడగగా నాకు రెస్పెక్ట్‌ అవసరం లేదు అని ఉమా తేల్చి చెప్పడమే కాక ఎవరు ఏం చెబుతున్నావ్ వినే పరిస్థితుల్లో ఆమె కనిపించలేదు. చాలాసేపు ఆమెను సర్ది చెప్పడానికి ప్రయత్నించిన వినలేదు. దీంతో ప్రియాంక పోవే ఉమా పో.. అని వ్యంగ్యంగా మాట్లాడింది. అలా మొత్తం మీద రెండవ వారం నామినేషన్ ప్రక్రియ హాట్ హాట్గా సాగింది.

  English summary
  Bigg Boss Telugu 5 Week 2 Nominations went violent. priyanka singh targets uma and calls her with no respect.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X