For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss : వరస్ట్ పెర్ఫార్మర్ ఎంపికలో రచ్చ.. కాజల్ కి ఊహించని షాకిచ్చిన రవి..

  |

  బిగ్ బాస్ షో విజయవంతంగా నాలుగు వారాలు పూర్తి చేసుకుని ఇప్పుడు ఐదవ వారానికి ఎంటర్ అయ్యింది. కెప్టెన్సీ కోసం 'బిగ్ బాస్' పెట్టిన టాస్క్ 'రాజ్యానికి ఒక్కడే రాజు'లో నిన్నటి ఎపిసోడ్‌లో ముగిసింది. ఇక చివరికి తమ తమ స్ట్రాటజీతో రాజు పోటీదారులు అయిన రవి, సన్నీలు ఎన్నో ప్రయత్నాలు చేసినా చివరికి రాజుగా రవి గెలిచారు. దీంతో రాజుగా ఎన్నికయిన రవి టీమ్ నుంచి పోటీగా దిగారు. ఇక తాజా ఎపిసోడ్ ప్రోమో విడుదల కాగా అది ఆసక్తికరంగా సాగింది. ఆ వివరాల్లోకి వెళితే

  పదివేళ్ళు సరిపోవు సోదరా

  పదివేళ్ళు సరిపోవు సోదరా


  ఈ వారానికి గాను కెప్టెన్‌ను ఎంచుకొనేందుకు.. 'పదివేళ్ళు సరిపోవు సోదరా' అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ సందర్భంగా నలుగురు కెప్టెన్సీ పోటీదారులకు నాలుగు రంధ్రాలు ఉండే నీటి ట్యాంక్ ఇచ్చారు. వారికి సపోర్ట్ చేసే సభ్యులు ఆ ట్యాంక్ రంధ్రాలను మూసి నీళ్లు బయటకు పోకుండా సపోర్ట్ చేయాలని బిగ్ బాస్ తెలిపారు. ఈ టాస్క్‌కు షణ్ముఖ్‌ను సంచాలకుడిగా వ్యవహరించాలని పేర్కొన్నాడు.

  కెప్టన్ గా ప్రియ

  కెప్టన్ గా ప్రియ


  ఇక ఈ టాస్క్‌లో యానీ, శ్వేత, ప్రియా, రవి పాల్గొన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ టాస్క్‌లో ప్రియా విజేతగా నిలిచినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఈ విషయాన్ని ఈరోజు విడుదల చేసిన ప్రోమోలో కూడా క్లారిటీ ఇచ్చారు. వరస్ట్ పెర్ఫార్మర్ ఎన్నిక సమయంలో అందరూ మారుతున్నారు కానీ ప్రియా మాత్రం అందరితో పాటు నుంచుని సంచలకురాలిగా కనిపిస్తుంది. బిగ్ బాస్ లో ఈ వారం దోషిని ఎంచుకుని జైలుకు పంపే సమయం ఆసన్నమైందని అంటూ ప్రియ చదవడంతో ఆమె కెప్టెన్ అయిపోయినట్లు భావిస్తున్నారు. ఇక ఈ వరస్ట్ పెర్ఫార్మర్ ను ఎంచుకునే ప్రక్రియ కూడా ఆసక్తికరంగా ఉంది. బలికి ఇస్తున్న వారిని బలి పీఠం ఎక్కించినట్లు ఎక్కించి నచ్చని వారి ముఖం మీద నీళ్లు కొట్టి కారణాలు చెప్పమని సూచించారు.

  మళ్ళీ ఏకం అయిన సిరి, షన్ను, జస్వంత్

  మళ్ళీ ఏకం అయిన సిరి, షన్ను, జస్వంత్


  సన్నీ నేను చాలా కంట్రోల్ అవ్వాలని ప్రయత్నిస్తున్నాను నన్ను రెచ్చగొట్టొద్దు అంటూ ఉండటం ప్రోమోలో కనిపిస్తుండగా ఎవరితో అంటున్నాడు అనేదాని మీద మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇక కాజల్ను వరస్ట్ పర్ ఫార్మర్ గా ఎంచుకున్న శ్వేతా వర్మ తనకు సన్నీకి ఆనీ మాస్టర్ కు మంచి ర్యాపొ ఉందని ఒక టాస్క్ వల్ల అది పాడైపోతుందని అనుకోవద్దని అంటుంది. ఇక నువ్వు వాళ్ళని ఇన్ఫ్లూ యన్స్ చేసి దానిని చెడగొట్టడానికి చూడవద్దని అంటుంది.

  ఇక ముందు నుంచి భావించినట్లుగానే సిరీ, షణ్ముఖ్ ఇద్దరూ ఒక్కరినే వరస్ట్ పెర్ఫార్మర్ గా నిర్ణయించుకున్నారు. విశ్వా ను వరస్ట్ పెర్ఫార్మర్ గాఎంచుకున్న సిరి దమ్ముంటే ముందు నుంచి ఆడండి, వెనక నుంచి కాదు అని అనడం తనకు నచ్చలేదని అంటుంది. ఇక షణ్ముక్ కూడా నీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఉంటే చిల్లర అనే మాట మాట్లాడతావా అంటే నేను నిన్ను ఉద్దేశించి అనలేదని విశ్వ అంటాడు. ఇంట్లో ఎవరు దొంగతనం చేశారు అనే సంగతి నీకు తెలుసు కదా అంటే నువ్వు దొంగతనం చేశావా అని ప్రశ్నించడంతో షణ్ముఖ సైలెంట్ అవుతాడు.

  శ్రీ రామచంద్రతో ఇష్యూ

  శ్రీ రామచంద్రతో ఇష్యూ


  ఇక మొన్న వంట విషయంలో మాట తేడా రావడంతో శ్రీరామచంద్రని వరస్ట్ పెర్ఫార్మర్ గా జస్వంత్ పేర్కొన్నాడు. నాకు వంట రాదు అంటే వంట చేయాలి అనడం ఏమిటి అని ప్రశ్నిస్తుండగా 15 మంది అని శ్రీ రామచంద్ర ఏదో చెబుతూ ఉండగా ఇక నేనేమి వినను తెలుసుకోవాలి అనుకోవడం లేదు ఆపండి అంటూ జస్వంత్ ఫైర్ అవుతున్నట్లు కనిపిస్తోంది.

  ఇక మానస్ కూడా శ్రీ రామ చంద్రనే వరస్ట్ పెర్ఫార్మర్ అని చెబుతూ ఆటలో నువ్వు ఒకవైపునే ఉన్నావు అనిపించింది అని చెప్పుకొచ్చాడు. అది మా స్ట్రాటజీ అని శ్రీ రామచంద్ర తప్పించుకునే ప్రయత్నం చేశాడు తరువాత నేను ఒకరి వైపే ఉన్నాను అని ఎవరికైనా అనిపించిందా? నేను వాళ్లకు సామాధానం చెబుతాను, అని ప్రశ్నిస్తే సిరి, షన్ముఖ్, జస్వంత్ ముగ్గురు కూడా చేతులెత్తారు.

  కాజల్ ను వరస్ట్ పెర్ఫార్మర్ అని

  కాజల్ ను వరస్ట్ పెర్ఫార్మర్ అని


  ఇక తన విషయంలో వేళాకోళం చేసింది అనే ఉద్దేశంతో కాజల్ ను వరస్ట్ పెర్ఫార్మర్ అని రవి పేర్కొన్నాడు. ఇంతలో కాజల్ ఏదో అంటూ ఉండగా దానికి రవి సీరియస్ అవుతాడు. ఏమన్నా ఉంటె నీ దగ్గర పెట్టుకో అని అంటారు. మరో పక్క కాజల్ శ్రీ రామచంద్ర వరస్ట్ పెర్ఫార్మర్ గా పేర్కొంటూ వాటర్ పోసింది, ఇక ఆనీ మాస్టర్ కూడా కాజల్ వరస్ట్ పెర్ఫార్మర్ గా పేర్కొంటూ కలకలం రేపింది.

  నీ మీద నేను నీళ్ళు కొట్టలేను కాబట్టి నా మొఖం మీద నేనే కొట్టుకుంటున్నాను అని తన ముఖం మీదనే నీళ్లు కొట్టుకోవడం కనిపంచింది. ఇక అలా ఈ రోజు ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కాజల్ ఈ వారానికి గాను వరస్ట్ పర్ఫార్మర్ గా ఎన్నిక అయిందని ఆమెను జైలులో కూడా పెట్టారని తెలుస్తోంది.

  English summary
  In Bigg Boss telugu 5 latest promo worst performer task fight between kajal and ravi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X