For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: శ్రీసత్యకు నోటి దురుసు.. శ్రీహాన్ వీక్.. యాంకర్ కు బాలాదిత్య కౌంటర్

  |

  ఊహించని పరిణామాలు, అనుకోని సంఘనటలతో బిగ్ బాస్ ఆరో సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఈ సీజన్ లో టైటిల్ ఫేవరెట్ గా నిలిచినావాళ్లు, టాప్ 5 కంటెస్టెంట్స్ ఇలా క్వాలిటీ ఉన్న వ్యక్తులే ఎలిమినేట్ అయి బయటకు వెళ్తున్నారు. గత రెండు వారాల్లో ఆర్జే సూర్య, గీతూ రాయల్ ఎలిమినేట్ కాగా తాజాగా మంచి వ్యక్తిగా పేరొందిన నటుడు బాలాదిత్య అనూహ్యంగా బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. మంచి హ్యూమన్ బీయింగ్ గా హౌజ్ లో ఉన్న బాలాదిత్యకు ఓట్లు తక్కువ పడటంతో బిగ్ బాస్ ఇంటిని వీడాడు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను బిగ్ బాస్ కేఫ్ ద్వారా ఇంటర్వ్యూ చేస్తారన్న విషయం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ శివ తనదైన శైలీలో ప్రశ్నలను సంధించాడు.

  ఆరంభంలో రాని రేటింగ్..

  ఆరంభంలో రాని రేటింగ్..

  తెలుగు బుల్లితెర చరిత్రలోనే సంచలన రేటింగ్‌తో దూసుకుపోతోన్న బిగ్ బాస్.. ఇప్పటికే ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ (నాన్ స్టాప్) వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్ కూడా చిత్ర విచిత్రంగా సాగుతోంది. దీనికి ఆరంభంలో పెద్దగా రేటింగ్ రాలేదు. కానీ, క్రమంగా ఇందులో అదిరిపోయే కంటెంట్ వస్తుండడంతో ఆదరణ పెరుగుతోంది. ఫలితంగా రేటింగ్ పెరుగుతోంది.

  గీతూ రాయల్ అన్న ఎలిమినేట్..

  గీతూ రాయల్ అన్న ఎలిమినేట్..

  బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో టాప్ అండ్ క్వాలిటీ కంటెస్టెంట్స్ అనూహ్యంగా ఎలిమినేట్ అవుతున్నారు. ఇటీవలే టైటిల్ ఫేవరేట్ కంటెస్టెంట్, బిగ్ బాస్ ముద్దుబిడ్డ, చిత్తూరు చిరుత గీతూ రాయల్ ఎలిమినేట్ చాలమందికి షాక్ ఇచ్చింది. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 6 పదోవారం గీతూ తన సోదరుడిగా భావించే బాలాదిత్య ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఈ సీజన్ లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను బిగ్ బాస్ కేఫ్ ద్వారా యాంకర్ శివ ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ ఇంటర్వ్యూకు బాలాదిత్య హాజరయ్యాడు.

  ఒక నేషనల్ టెలివిజన్ లో ఒక అమ్మాయిని..

  ఒక నేషనల్ టెలివిజన్ లో ఒక అమ్మాయిని..

  హౌజ్ లో మీరు ప్రవచనాలు చెప్పడంతో మీకు ఓ పేరు పెట్టారు బయట అని యాంకర్ శివ అన్నాడు. ప్రవచనాలు చెప్పడం నా వృత్తి కాదు. ఒక మంచి చెప్పాలనిపించినప్పుడు నేను ఆగను అని బాలాదిత్య సమాధానం ఇచ్చాడు. ఒక నేషనల్ టెలివిజన్ లో ఒక అమ్మాయిని.. సిగ్గుందా అని యాంకర్ శివ చెప్పబోతుంటే.. ఏ సందర్భంలో మాట్లాడాను నేను అని బాలాదిత్య అంటే మీ కాంటెక్ట్స్ ఏంటి అని యాంకర్ శివ అడిగాడు.

  నా సిద్ధాంతాలను బట్టి ఆడితే..

  నా సిద్ధాంతాలను బట్టి ఆడితే..

  పక్కవాళ్లను గుచ్చడం నీ క్యారెక్టరా.. అని బాలాదిత్య అంటే.. మీరు అలా అనడం కరెక్టా కాదా అని తిరిగి ప్రశ్నించాడు యాంకర్ శివ. దీనికి ఆ మాట తప్పు.. నా బాధ తప్పు కాదు అని బాలాదిత్య వివరణ ఇచ్చాడు. తర్వాత మీ విధానాలన్ని పనికొచ్చాయనుకుంటున్నారా అని శివ అడగ్గా.. ఇప్పుడు ఆటకు పనికి వచ్చే విధంగా ఆడితే నేను ఇంకొకలా మారినట్లు అవుతుంది. నేను నా సిద్ధాంతాలను బట్టి ఆడితే నాలా ఆడినట్లు అవుతుంది అని బాలాదిత్య చెప్పడంతో సైలెంట్ అయిపోయాడు శివ.

  అంత సీన్ చేయడం అవసరమా..

  అంత సీన్ చేయడం అవసరమా..


  స్టార్టింగ్ లో మీరు అన్నారు.. నాకు కోపం రాదు అని శివ లేవనెత్తగా.. నాకు ప్రతిదానికి కోప్పడను.. నిజంగా కోప్పడాల్సి వచ్చే అని బాలాదిత్య చెప్పబోతుంటే మధ్యలో మీరు ప్రతిదానికి కోప్పడరు.. వివరణ ఇస్తారు.. సాగదీస్తారు అన్నట్లుగా శివ అన్నాడు. దీంతో సైలెంట్ గా ఉండిపోయాడు బాలాదిత్య. ఆప్ట్రాల్ సిగరెట్ అన్న బాలాదిత్య దానికోసం అంత సీన్ చేయడం అవసరమా అని యాంకర్ శివ అడిగాడు.

  అందులో శ్రీహాన్ వీక్..

  అందులో శ్రీహాన్ వీక్..

  సిగరెట్ క్వశ్చన్ కి బాలాదిత్య ఏం సమాధానం చెప్పలేదు. తర్వాత మీ వల్లే గీతూ రాయల్ వెళ్లిపోయిందని యాంకర్ శివ అనడంతో.. ఎవరు చేసిన పనికి వాళ్లే బాధ్యులు అని బాలాదిత్య కౌంటర్ ఇచ్చాడు. కీర్తి ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంది. శ్రీహాన్ వెరీ స్మార్ట్ ప్లేయర్.. కానీ స్పాంటేనియస్ నిర్ణయాల్లో అతన వీక్. శ్రీసత్యకు నోటి దురుసు అని బాలాదిత్య అంటే.. శ్రీసత్యకు ఉందా.. ఏ విషయంలో అని యాంకర్ శివ ప్రశ్నించాడు.

  కొంచెం ట్రిగ్గర్ అవుతాడు..

  నామినేషన్స్ అప్పుడు.. ఎవరైనా కొంచెం ట్రిగ్గర్ చేస్తే లౌడ్ అయిపోతుంది మనిషి బాలాదిత్య చెప్పాడు. దానికి నవ్వేసి ఊకున్నాడు శివ. ఆదిరెడ్డి వెరీ వైస్ పర్సన్. వెరీ వైస్ థింకర్. అప్పుడప్పుడు కొంచెం ట్రిగ్గర్ అవుతాడు మనిషి అని బాలాదిత్య సమాధానం ఇచ్చాడు.

  English summary
  Bigg Boss Telugu 6th Season 10th Week Eliminated Contestant Baladitya Interview With Anchor Shiva In BB Cafe And Baladitya Shocking Answers To Shiva.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X