twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6:బిగ్ బాస్ నువ్ బయటకెళ్లి చూసుకోండి.. రేవంత్ కు ఆదిరెడ్డి వార్నింగ్

    |

    బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. సింగర్ రేవంత్ తోపాటు టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన చిత్తూరు చిరుత గీతూ రాయల్ ఎలిమినేషన్ మిగతా ఇంటి సభ్యులకు షాక్ ఇచ్చింది. దీంతో వాళ్లు ఆడే గేమ్ ఆడియెన్స్ కు ఎలా రిజిస్టర్ అవుతుందోనని ఆలోచనలో పడ్డారు. ఆదివారం గీతూ రాయల్ ఎలిమినేషన్ తో హౌజ్ మొత్తం ఎమోషనల్ అయింది. ఆమెను తిరిగి హౌజ్ కు పంపించేయండని హోస్ట్ నాగార్జున అడగటం చూస్తే అర్థమవుతుంది ఆమె వాళ్లకు ఎంత ఇష్టమో. ఇక ఇదిలా ఉంటే సోమవారం నామినేషన్స్ అని తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు.

    హద్దు మీరనంతా వరకు..

    హద్దు మీరనంతా వరకు..

    ఏదైనా హద్దు దాటకుండా ఉన్నంత వరకే బాగుంటుంది. హద్దు మీరనంతా వరకు ఏ రిలేషన్ అయినా, ఏ బాండింగ్ అయిన బాగుంటుంది. లేకుంటే తెగిపోతుంది. బిగ్ బాస్ తెలుగు 6 మిషన్ పాజిబుల్ టాస్క్ లో గీతూ రాయల్ హద్దు దాటి ప్రవర్తించిందనే అనేక మంది ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. అందుకే నామినేషన్లలో శ్రీ సత్య వెళ్తుందనుకున్న అంచనాలకు తారుమారుగా గీతూ రాయల్ వెళ్లిపోవాల్సి వచ్చింది.

    హౌజ్ సభ్యుల్లో మార్పు..

    హౌజ్ సభ్యుల్లో మార్పు..

    అతి ఎప్పుడైనా కీడుకు సంకేతమే. వెటకారం, కోపం, మాట్లాడటం అతిగా ఉంటే అది వారికే ప్రమాదం. ఇక బిగ్ బాస్ తెలుగు 6 తొమ్మిదో వారం ఎలిమినేట్ అయిన గీతూ రాయల్ నోరు గురించి చెప్పనవసరం లేదు. ఇది చూసైనా హౌజ్ సభ్యుల్లో మార్పు వస్తుందంటే అ సూచనలు కనిపించడం లేదు. తాజాగా బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ నవంబర్ 7 ఎపిసోడ్ నాటి ప్రోమోను విడుదల చేశారు. ఈ ఎపిసోడ్ లో నామినేషన్ల ప్రక్రియ చూపించారు.

    ఎరుపు రంగు నీళ్లు కొట్టి..

    ఎరుపు రంగు నీళ్లు కొట్టి..

    నామినేట్ చేయాలనుకున్న ఇంటి సభ్యులను వారి మొహంపై ఎరుపు రంగు నీళ్లు కొట్టి కారణాలు చెప్పాలి. శ్రీసత్య ఇనయా సుల్తానాను నామినేట్ చేసింది. నువ్ ఒక సెన్సిటివ్ విషయం మాట్లాడావు. శ్రీహాన్ ఒక్కడి గురించే అంటే ఏ సమస్య ఉండేది కాదు. అందులో నన్ను కూడా అన్నావ్. శ్రీహాన్ కొ బయట ఒక లైఫ్ ఉంది. నాకు కూడా ఒక జీవితం ఉంది అని చెప్పింది శ్రీ సత్య. దానికి నువ్ ఇన్ డైరెక్ట్ గా సూర్య గురించి ఎత్తలేదా అని ఇనయా అడిగింది.

     హ్యుమానిటీ గురించి..

    హ్యుమానిటీ గురించి..

    ఇనయా సుల్తానా అడిగిన ప్రశ్నకు నేను సూర్య గురించి మాట్లాడలేదు. ఫైమా గురించి అన్నాను అని వాదించింది శ్రీ సత్య. తర్వాత వచ్చిన కీర్తి.. శ్రీహాన్ ను నామినేట్ చేసింది. చివరి నామినేషన్ లో మీరు హ్యుమానిటీ గురించి మాట్లాడారని కీర్తి అంటే.. హ్యుమానిటీ గురించి నేను హైలెట్ చేసుకోలా.. నువ్ హీరోయిన్ లా చేసుకున్నావ్ అని శ్రీహాన్ అన్నాడు. దీంతో కీర్తి.. ఇక్కడ ఎవరు హీరోలు, హీరోయిన్లు లేరు. అదే తగ్గించుకుంటే మంచిదని అంది. అందుకు శ్రీహాన్ తగ్గించుకోను అని సమాధానమిచ్చాడు.

    టాస్క్ లో అగ్రెసివ్.. అగ్రెసివ్..

    టాస్క్ లో అగ్రెసివ్.. అగ్రెసివ్..

    వాసంతిని రేవంత్ నామినేట్ చేశాడు. చెయ్యెత్తి కొట్టడం తప్పు అంటూ నామినేట్ చేశాడు. దీనికి అందరూ ఫుటేజ్ చూశారని వాసంతి బదులిచ్చింది. నీకు భయం.. ముందుకు వచ్చి ఆడేందుకు నీకు భయం.. నువ్ ఆడకుండా వెనక్కి వెళ్లిపోతావ్.. అంటూ మాట్లాడాడు రేవంత్. తర్వాత వచ్చిన ఆదిరెడ్డి.. రేవంత్ ను నామినేట్ చేశాడు. అగ్రెసివ్.. అగ్రెసివ్ అని టాస్క్ లో ఇక రండి అంటావని ఆదిరెడ్డి అంటే.. అది నా ఇష్టం, నా స్ట్రాటజీ అని రేవంత్ అన్నాడు.

     నువ్ ఎంత తోపు అయినా..

    నువ్ ఎంత తోపు అయినా..

    నువ్ రాలేవా అని రేవంత్ ప్రశ్నిస్తే నువ్ ఎంత తోపు అయినా.. నేను ఎంత బక్కపలుచగా ఉన్నా నేను తగ్గను అని ఆదిరెడ్డి స్ట్రాంగ్ గా అన్నాడు. తర్వాత ఇనయాను వాసంతి నామినేట్ చేసింది. అనంతరం వచ్చిన ఆదిరెడ్డి కూడా ఇనయాను నామినేట్ చేశాడు. వీళ్లద్దరి మధ్య మాటల యుద్దం జరిగింది. బిగ్ బాస్ కు నీకు ఉంటే బయటకెళ్లి చూసుకోండి ఇక్కడ కాదు అంటూ మాట్లాడాడు ఆదిరెడ్డి. ఇలా జరుగుతుండగా.. శ్రీహాన్ అండ్ శ్రీ సత్య నవ్వు ఆపుకుంటూ ఓవర్ చేశారు. చివరిగా అయ్యో.. అని శ్రీహాన్ అనడంతో ప్రోమో ముగిసింది.

    నామినేషన్లలో 9 మంది..

    ఇక బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి ఏకంగా 21 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో తొమ్మిది వారాలకు గానూ తొమ్మిది మంది ఎలిమినేట్ అవడంతో 12 మంది మిగిలారు. అలాంటిది ఈ వారం 9 మంది నామినేషన్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది. అంటే ఈ పదో వారం కెప్టెన్ శ్రీ సత్యతో పాటు రోహిత్, రాజశేఖర్‌లు మాత్రమే సేఫ్ అయ్యారని బిగ్ బాస్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం.

    English summary
    Bigg Boss Telugu 6 Season 10th Week Nominations Process In November 7 Episode Promo Released. And Adireddy Shocking Comments.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X