For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: ఆరో వారం నామినేషన్లలో 9 మంది? గీతూపై బాలాదిత్య ఫైర్

  |

  బిగ్ బాస్ రియాలిటీ షోకి రెస్పాన్స్ మాత్రం అసాధారణంగానే ఉంది. ఇప్పటి వరకు 5 సీజన్లను ఎంతో విజయవంతంగా ప్రేక్షకుల మన్ననలు పొందగా.. సెప్టెంబర్ 4 నుంచి ప్రారంభమైన బిగ్​బాస్​ ఆరో సీజన్​ బాగానే ఆకట్టుకుంటోంది. ఇక ఈ సీజన్ లో వింతలు, విచిత్రాలు బాగానే జరుగుతున్నాయి. కంటెస్టెంట్ల మధ్య ప్రేమయాణాలు, అలకలు, బుజ్జగింపులే కాకుండా పొట్టి పొట్టి డ్రెస్ లతో గ్లామర్ ను బాగానే చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రతి సోమవారం నామినేషన్లు ఉంటాయన్న విషయం తెలిసిందే. తాజాగా అక్టోబర్ 10 సోమవారం నాడు బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ ఆరో వారం నామినేషన్ల ప్రక్రియ సాగింది. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేసింది స్టార్ మా.

  కొత్త కాన్సెప్టులతో..

  కొత్త కాన్సెప్టులతో..

  బిగ్ బాస్ షో తెలుగులో క్రమం తప్పుకుండా నాలుగు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో దాన్ని గతంలో ఎన్నడూ చూడని కొత్త కంటెంట్‌తో తీసుకు వచ్చారు. ఫలితంగా ఈ సీజన్ కొత్త కాన్సెప్టులతో సాగుతోంది. కానీ, ఈ సీజన్‌కు గతంలో వచ్చినట్లుగా ప్రేక్షకుల నుంచి స్పందన మాత్రం దక్కట్లేదు. దీంతో ఈ సీజన్ రేటింగ్ చెత్తగా వస్తుంది.

  5 వారాలు, ఐదుగురు ఎలిమినేట్..

  5 వారాలు, ఐదుగురు ఎలిమినేట్..

  బిగ్ బాస్ ఆరో సీజన్‌లో కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌‌లు వచ్చారు. వీరిలో షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటిలు ఎలిమినేట్ అయిపోయారు.

  మొదటగా బుధవారం..

  మొదటగా బుధవారం..

  సోమవారం బిగ్ బాస్ షోలో జరిగే ఎపిసోడ్‌లోనే నామినేషన్స్ టాస్కును చూపిస్తారు. అయితే, ఆరో సీజన్ మొదటి వారంలో మాత్రం దీన్ని బుధవారం నిర్వహించారు. కానీ, దానిపై ప్రేక్షకులు పెదవి విరిచారు. దీంతో నిర్వహకులు మరోసారి పాత పద్దతినే వాడుతున్నారు. ఇందులో భాగంగానే రెండో వారం నుంచి నామినేషన్స్ ప్రక్రియను సోమవారమే నిర్వహిస్తూ కొత్తగా చూపిస్తున్నారు.

  వందశాతం తగ్గించుకోలేదు అన్నారు..

  వందశాతం తగ్గించుకోలేదు అన్నారు..

  ఈ క్రమంలోనే బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ ఆరో వారం నామినేషన్లకు సబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో భాగంగా ముఖానికి ఫోమ్ (నురగ) కొట్టి నామినేట్ చేయాలని బిగ్ బాస్ చెప్పాడు. బాలాదిత్య ఫేస్ కు రేవంత్ ఫోమ్ కొట్టాడు. శనివారం నాటి ఎపిసోడ్ కు సంబంధించింది మాట్లాడుతూ వందశాతం తగ్గించుకోలేదు అన్నారుగా.. మీరిచ్చిన కామెంట్ ను అని రేవంత్ అనగానే మీరు వందశాతం ప్లాప్ అనలేదు, వందశాతం మార్పు రాలేదు కాబట్టి ఫ్లాప్ అన్నాను అని బాలాదిత్య చెప్పుకొచ్చాడు.

   నేను నూటొక్కసారి కూడా మాట్లాడతా..

  నేను నూటొక్కసారి కూడా మాట్లాడతా..

  అలాగే సుదీపను కూడా రేవంతే నామినేట్ చేశాడు. ఆదివారం ఇచ్చిన ట్యాగ్ గురించి ఇద్దరు వాగ్వాదం చేసుకున్నారు. నువ్ వందసార్లు మాట్లాడితే, నేను నూటొక్కసారి కూడా మాట్లాడతా అని సుదీప అంది. దీనికి రేవంత్ నేను కోటిసార్లు మాట్లాడతా అన్నాడు. దీంతో సరే మాట్లాడు అంటూ సుదీప అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సత్యను కీర్తి నామినేట్ చేసింది. ఇద్దరు ఇంట్లో పనుల గురించి వాదించుకున్నారు.

   చాలా నాలెడ్జబుల్ పర్సన్ అనిపించింది..

  చాలా నాలెడ్జబుల్ పర్సన్ అనిపించింది..

  తర్వాత మీరు చాలా నాలెడ్జబుల్ పర్సన్ అని ఇప్పటివరకు అనిపించింది. ఆ ఒపినియన్ మార్చుకునేలా చేయొద్దు అని ఆదిరెడ్డి అన్నాడు. అయితే ఆయన ఎవరినీ అన్నాడో తెలియదు. అనంతరం గీతూ రాయల్ ను బాలాదిత్య నామినేట్ చేశాడు. గీతూ వల్లే తను స్టార్ ఆఫ్ ది వీక్ టైటిల్ కోల్పోయినట్లు చెప్పుకొచ్చాడు. దానికి నువ్ గీతూ వల్ల కోల్పోలేదు. నీ అజాగ్రత్త వల్ల అని గీతూ రాయల్ తెలిపింది.

  నా అభిప్రాయంలో అది తప్పే..

  దీంతో నువ్ ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా.. నా అభిప్రాయంలో అది తప్పే అని గట్టిగానే చెప్పాడు బాలాదిత్య. అయితే బిగ్ బాస్ తెలుగు 6 ఆరో వారం నామినేషన్లలో బాలాదిత్య, రాజశేఖర్, గీతూ రాయల్, కీర్తి భట్, సుదీప, మెరీనా, శ్రీహాన్, అర్జున్, ఆదిరెడ్డి మొత్తం 9 మంది ఉన్నట్లు బిగ్ బాస్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. ఇక ఐదోవారం చలాకి చంటి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.

  English summary
  Baladitya Fires On Geetu Royal In Sixth Week Nominations Of Bigg Boss Telugu 6 October 10 2022 Episode Promo And 9 Contestants In Sixth Week Nominations.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X