Don't Miss!
- News
అత్యాచారం కేసులో ఆశారాం బాపూను దోషిగా తేల్చిన గుజరాత్ కోర్టు
- Sports
IND vs NZ: స్టన్నింగ్ డెలివరీతో షేన్ వార్న్‌ను గుర్తు చేసిన కుల్దీప్ యాదవ్వీడియో
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Bigg Boss Telugu 6 ఆమె అలాంటి సినిమాలకే సూట్ అవుతుంది.. అందరిముందు ఆదిరెడ్డి షాకింగ్ కామెంట్స్!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 అనూహ్య పరిణామాలతో దూసుకుపోతోంది. ఎన్నో అనుమానాలు, అంచనాల మధ్య ప్రారంభమైన ఈ సీజన్ దాదాపుగా పూర్తి దశకు చేరుకుంది. మరో మూడు రోజుల్లో 14వ వారంలో కూడా పూర్తి కానుంది. ఇంకొన్ని రోజుల్లో టైటిల్ విన్నర్ ను ప్రకటించనున్నారు. ఇందుకోసం ప్రస్తుతం హౌజ్ లో ఉన్న ఏడుగురు కంటెస్టెంట్స్ గట్టి పోటి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. వీరందరు కోల్పోయిన విన్నర్ ప్రైజ్ మనీని తిరిగి గెలుచుకునేందుకు బిగ్ బాస్ ఈ వారం అంతా ఛాలెంజ్ లు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే గత రాత్రి బుధవారం నాటి 95వ ఎపిసోడ్ లో లేడి కంటెస్టెంట్ పై ఆదిరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశాడు.

మొత్తంగా రూ. 44 లక్షలకుపైగా..
ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లో విన్నర్ ప్రైజ్ మనీ నుంచి కోల్పోయిన డబ్బును తిరిగి పొందేందుకు ఇంటి సభ్యులకు బిగ్ బాస్ ఛాలెంజ్ లు ఇస్తున్న విషయం తెలిసిందే. వాటికి తగినట్లుగా ఆడుతూ ఇంటి సభ్యులు పోయిన డబ్బును తిరిగి తెచ్చుకుంటున్నారు. ఇలా గత ఎపిసోడ్ చివరిలో మొత్తంగా రూ. 44, 35, 100 వరకు సాధించారు. ఇక 94వ రోజు 95వ ఎపిసోడ్ లో ఐదో, ఆరో ఛాలెంజ్ లు జరిగాయి.

ఏకాభిప్రాయంతో శ్రీహాన్ గెలుస్తాడని..
ఐదో ఛాలేంజ్ లో ఆదిరెడ్డి, రోహిత్ పోటీ పడగా.. ఆదిరెడ్డి గెలిచాడు. ఒక శ్రీసత్య తప్పా మిగతా ఇంటి సభ్యులందరూ ఆదిరెడ్డి గెలుస్తాడని చెప్పడంతో రూ. 80 వేలను తిరిగి సంపాదించుకున్నారు. తర్వాత ఆరో ఛాలెంజ్ లో భాగంగా శ్రీహాన్, కీర్తి భట్ పోటి పడ్డారు. ఇంటి సభ్యులంతా కలిసి శ్రీహాన్ గెలుస్తాడని ఏకాభిప్రాయంతో బిగ్ బాస్ కు తెలిపారు. వాళ్లిద్దరికి వాల్ బ్రేకర్ ఛాలేంజ్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో అనుకున్నట్లుగానే శ్రీహాన్ గెలిచాడు.

డార్క్ రూమ్ గా కన్ఫెషన్ రూమ్..
వాల్ బ్రేకర్ ఛాలెంజ్ లో శ్రీహాన్ గెలవడంతో రూ. 2 లక్షలు వచ్చి బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీలో యాడ్ అయ్యాయి. దీంతో బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ రూ. 43, 90, 100గా మారింది. ఈ ఛాలెంజ్ తర్వాత డార్క్ రూమ్ టాస్క్ ఇచ్చారు. ఇందులో మొదటగా ఆదిరెడ్డిని పాల్గొనమని బిగ్ బాస్ చెప్పాడు. కన్ఫెషన్ రూమ్ ను డార్క్ రూమ్ గా మార్చి అందులో పాములు, ఎముకలు, దెయ్యాలు, భయంకరమైన సౌండ్ ఎఫెక్ట్స్ తో నింపారు.

ఆదిరెడ్డికి తోడుగా శ్రీహాన్..
డార్క్ రూమ్ కి ఆదిరెడ్డి వెళ్లి భయంతో తన యాసలో మాట్లాడిన తీరు నవ్వు తెప్పించింది. లోపలికి రండి అని బిగ్ బాస్ అంటే యాడకి బిగ్ బాస్ వచ్చేది అంటూ కామెడీ తెప్పించాడు. తర్వాత సౌండ్స్ ఓకే కానీ కాళ్లు చేతులు పట్టుకుని లాగొద్దు, దగ్గరికి వస్తే కొట్టేస్తాను అంటూ భయపడ్డాడు ఆదిరెడ్డి. తర్వాత ఆదిరెడ్డికి తోడుగా శ్రీహాన్ ను పంపించారు బిగ్ బాస్. అతను కూడా చాలా భయపడ్డాడు.

దెయ్యం వచ్చిన అమ్మాయిలా..
ఇదిలా ఉంటే ఈ ఎపిసోడ్ కు ముందు రోజు రాత్రి కూడా భయంకరమైన అరుపులు వినిపించాయి. దీంతో హౌజ్ మేట్స్ అంతా కలిసి బాత్రూమ్ లో దాక్కున్నారు. ఇదంతా అయ్యాక.. ఆదిరెడ్డిని ఇనయా తెగ భయపెట్టేసింది. అచ్చం దెయ్యం వచ్చిన అమ్మాయిలా మాట్లాడుతూ ఆదిరెడ్డికి చుక్కలు చూపించింది. అదంతా నటన అని తెలిసినా కూడా తెగ భయపడిపోయాడు ఆదిరెడ్డి. ఈ విషయం గురించే 95వ ఎపిసోడ్ లో ఉదయం ఇంటి సభ్యులు చర్చించుకున్నారు.

ఎర్రిపప్పలను చేసేది ఇనయా..
ఉదయం సాంగ్ వేసి తర్వాత.. రాత్రి ఇనయా చేసినదాన్ని చూసి ఆదిగారు కన్ఫ్యూజ్ అయి రియలా అని అడిగాడని రోహిత్ చెప్పాడు. దీంతో రెడ్డిగారు మీరు కామెడీ నిన్న అని శ్రీసత్య అంది. మధ్యలో రాత్రి కల కూడా వచ్చిందని ఆదిరెడ్డి అన్నాడు. ఇనయా చేసింది నిజమే అనుకుని రియాలా అని రోహిత్ ను అడిగానని చెప్పాడు. అందరం అలాగే ఉంటే అందరినీ ఎర్రిపప్పలను చేసేది ఇనయా అని రేవంత్ అన్నాడు. చూడటానికి రేవులో తాడి చెట్టులా ఉన్నాడు అని ఆదిరెడ్డిని రేవంత్ అన్నాడు. దీంతో అందరిముందు దెయ్యాల సినిమాలకు సెట్ అవుద్ది ఇనయా అని ఆదిరెడ్డి అన్నాడు.