For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: రేవంత్ చేతి నుంచి ఎగిరిపడిన గొడ్డలి.. జస్ట్ లో మిస్, ఆమెకు తప్పిన ప్రాణాపాయం

  |

  సాధారణంగా బిగ్ బాస్ హౌజ్ అంటే గొడవలు, అరుపులు, కేకలతో రసవత్తరంగా సాగుతుంది. కానీ అక్టోబర్ 4, 5 రెండు ఎపిసోడ్ లలో అలాంటివేమి లేకుండా కేవలం సరదా సన్నివేశాలతో ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశాడు బిగ్ బాస్. ఈ రెండు ఎపిసోడ్ లలో బిగ్ బాస్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. బిగ్ బాస్ తో పాటు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు ఇంటి సభ్యులు బాగానే కష్టపడ్డారు. ఇందులో భాగంగానే హౌజ్ లో రాత్రి పూట మెరీనా, వాసంతి దెయ్యాల్లా వేషం వేసుకోవడం, స్కూల్ స్కిట్, హౌజ్ లోకి జోకర్ ను పంపడం వంటి తదితర పనులు చేశారు. ఇక తాజా ఎపిసోడ్ లో కొద్దిలో ప్రమాదం తప్పింది. రేవంత్ వేసిన గొడ్డలి వేటుకు ఆమె బలి అయ్యేది. కానీ కొద్దిలో ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరపీల్చుకున్నారు.

  గొడవలు, అరుపులు కాకుండా..

  గొడవలు, అరుపులు కాకుండా..

  గొడవలు, అరుపులు ఎలాంటివి లేకుండా ఒక రెండు రోజులు మాతర్ం బిగ్ బాస్ హౌజ్ సరదాగా సాగింది. బిగ్ బాస్ తో సహా ఇంటి సభ్యులందరూ ఫన్ జెనరేట్ చేసేందుకు ప్రయత్నించారు. ఆ రెండు రోజులు బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ లో బిగ్ బాస్ బర్త్ డే వేడుకలు జరిగాయి. బిగ్ బాస్ ను ఎంటర్టైన్ చేసేందుకు వాసంతి, మెరీనాలు రాత్రిపూట దెయ్యాల్లా వేషం వేసి పడుకున్న హౌజ్ మేట్స్ ను భయపెట్టే ప్రయత్నం చేశారు.

  ఫైమా సీక్రెట్ టాస్క్..

  ఫైమా సీక్రెట్ టాస్క్..


  అలాగే ఫైమా సీక్రెట్ టాస్క్ లో భాగంగా ముగ్గురి ఇంటి సభ్యుల నిద్ర చెడగొట్టాల్సి ఉండగా సక్సెస్ అయినట్లే తెలుస్తోంది. అయితే ఆమె ద్వారా డిస్టర్బ్ అయినట్లు ఎవరికీ తెలియదు. అనంతరం స్కూల్ స్కిట్ వేసి బాలాదిత్య టీచర్ లా, మిగిలిన హౌజ్ మేట్స్ స్కూల్ పిల్లల్ల ఆకట్టుకున్నారు. ఇక తాజాగా అక్టోబర్ 6 గురువారం నాడు ప్రసారమైన 32వ రోజు 33వ ఎపిసోడ్ లో కొద్దిలో ప్రమాదం తప్పింది.

  కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో ఆరుగురు..

  కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో ఆరుగురు..

  అయితే కెప్టెన్సీ పోటీదారుల సెలక్షన్ లో భాగంగా ఈవారం మొత్తం జరిగిన టాస్క్ (బిగ్ బాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో ఎంటర్టైన్ చేసినవాళ్లలో) లో బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చిన టాప్ 6 కంటెండర్స్ ని సెలెక్ట్ చేయాలని బిగ్ బాస్ తెలిపాడు. ఆ ఆరుగురిని ఎంపిక చేసి ఎవరో చెప్పాల్సిందిగా కెప్టెన్ కీర్తి భట్ ని ఆదేశించాడు బిగ్ బాస్. దీంతో ఆమె ఫైమా, ఆర్జే సూర్య, రేవంత్, గీతూ రాయల్, బాలాదిత్య, రాజశేఖర్ లను సెలెక్ట్ చేసి బిగ్ బాస్ కు చెప్పింది.

  కెప్టెన్ కీర్తిపై అసహనం..

  కెప్టెన్ కీర్తిపై అసహనం..

  దీంతో ఆమెపై కొంతమంది అసహనం వ్యక్తం చేశారు. తాము దెయ్యాల్లా యునిక్ గా చేశాం అయినా సెలెక్ట్ చేయలేదని వాసంతతో మెరీనా అంది. దీనికి తను రాత్రిపూట సరిగ్గా చూడలేదు అని చెప్పిందిగా, అది తన వ్యూ, మనం కెప్టెన్సీ కోసం ఆడలేదు కదా.. ఆడియెన్స్ కోసం ఆడాం కదా అని వాసంతి తెలిపింది. తర్వాత తనకు ఇంట్లో సరిగ్గా మద్దతు ఎవరి నుంచి రావట్లేదని ఇనయా సుల్తానా బాధపడింది. ఫైమా, రాజ్, ఆర్జే సూర్య ఓదార్చే ప్రయత్నం చేశారు.

  నేను ఆడిన గేమ్ కీర్తి చూడలేదేమో..

  నేను ఆడిన గేమ్ కీర్తి చూడలేదేమో..

  తర్వాత సుదీప, వాసంతి, కీర్తి మాట్లాడుకుంటారు. పేవరిజం అంటే వాసంతిని, సుదీపను చేయాలి కదా అలా చేయలేదు నాకు ఎవరైతే ఎంటర్టైన్ చేశారనిపించిందో వాళ్ల పేరే చెప్పాను అని కీర్తి అంది. శ్రీహాన్ కూడా బాగా పెర్ఫామ్ చేశాడని కీర్తితో సుదీప, వాసంతి తెలిపారు. మరోవైపు తను ఆడిన గేమ్ కీర్తి చూడలేదేమో అని శ్రీహాన్ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ను ప్రారంభించారు.

  గొడ్డలి ఇచ్చి కట్టెలు కొట్టి..

  గొడ్డలి ఇచ్చి కట్టెలు కొట్టి..

  కెప్టెన్సీ కంటెండర్లకు సెలెక్ట్ అయిన ఆరుగురికి గొడ్డలి ఇచ్చి కట్టెలు కొట్టి దానికి తగిలించి ఉన్న బ్యాగ్ కిందపడ్డాక అందులోని బిగ్ బాస్ లోగోకు సంబంధించిన ఫొటోలను సరిగ్గా పెట్టాలనేది టాస్క్. ఈ టాస్క్ కు సంచాలక్ గా ఇనయా సుల్తానా వ్యవహరించింది. టాస్క్ బాలాదిత్యతో మొదలైంది. తర్వాత రాజ్, ఫైమా, గీతూ రాయల్ టాస్క్ కంప్లీట్ చేశారు. ఆర్జే సూర్య, రేవంత్ లను ఒకేసారి టాస్క్ నిర్వహించాల్సిందిగా బిగ్ బాస్ తెలిపాడు.

  రేవంత్ చేతినుంచి ఎగిరిపడిన గొడ్డలి..

  రేవంత్ చేతినుంచి ఎగిరిపడిన గొడ్డలి..

  ఈ క్రమంలోనే రేవంత్ గొడ్డలితో కట్టెలు కొడుతుంటే సడెన్ గా రేవంత్ చేతిలో నుంచి స్లిప్ అయి ఎగిరిపడింది. ఆ గొడ్డలి సంచాలకులుగా వ్యవహరిస్తున్న ఇనయా సుల్తానా పక్కనుంచే దూసుకుని వెళ్లింది. దానికి ఆమె అరుస్తూ పక్కకు వెళ్లిపోయింది. దీంతో కొద్దిలో ఇనయాకు ప్రాణపాయం తప్పినట్లయింది. గొడ్డలి అలా వెళ్లడంతో మిగిలిన కంటెస్టెంట్స్ రేవంత్.. జాగ్రత్త.. చూసి కొట్టు అని కేర్ ఫుల్ గా ఆడమని సలహా ఇచ్చారు.

  టాప్ 3లో బాలాదిత్య, రేవంత్, ఆర్జే సూర్య..

  టాప్ 3లో బాలాదిత్య, రేవంత్, ఆర్జే సూర్య..

  ఇక ఈ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో టాప్ 3లో బాలాదిత్య, రేవంత్, ఆర్జే సూర్య ఉన్నారు. అయితే వీళ్లందరితోపాటు ఫైమా కూడా చాలా బాగా ఆడింది. ముందుగా బాలాదిత్య తర్వాతి స్థానంలో ఫైమానే ఉంది. కానీ ఆర్జే సూర్య, రేవంత్ రావడంతో ఆమె స్థానం నాలుగుకు వెళ్లింది. ఇక ఐదో స్థానంలో గీతూ రాయల్, ఆరో స్థానంలో రాజశేఖర్ ఉన్నారు. ఇక ఈ ఐదోవారం మొత్తం 8 మంది ఇనాయా సుల్తానా, మెరీనా, బాలాదిత్య, చలాకీ చంటి, జబర్ధస్త్ ఫైమా, వాసంతి కృష్ణన్, ఆది రెడ్డి, అర్జున్ నామినేట్ అయిన విషయం తెలిసిందే.

  English summary
  The Axe Slipped And Missed To Inaya Sultana From Revanth In The Part Of Bigg Boss Telugu 6th Season 5th Week Captaincy Contender Task.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X